GnanaDhaara–Learaning Enhancement Programme-GD–LEP

GnanaDhaara–Learaning Enhancement Programme( GD–LEP)

జ్ఞానధార..* *సరికొత్త బోధన* 

*6, 7, 8 తరగతుల విద్యార్థులకు*

*23 నుంచి కొత్తగా తొమ్మిదో  పీరియడ్‌ విధానం*

                        ఈ నెల 23నుంచి జ్ఞానధార కార్యక్రమం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులను టూ డైమన్షన్‌ విధానంలో బోధిస్తారు.  సంబంధిత సబ్జెక్టుల్లో ప్రాథమిక విషయాల్లోనూ,  రెగ్యులర్‌ సిలబస్‌తో సబ్జెక్టులను బోధిస్తారు. 

ఈ కార్యక్రమంలో క్లాస్‌ వర్క్‌, హోంవర్క్‌ ఇవ్వడం ద్వారా ఎప్పటికప్పుడు విద్యార్థుల ప్రగతిని అంచనా వేయనున్నారు.

*ప్రత్యేక పీరియడ్‌ ఇలా..*

జ్ఞానధార కార్యక్రమం అమలుకు సీ, డీ గ్రేడ్‌ విద్యార్థులకు తెలుగు, గణితం, ఆంగ్లం పాఠ్యాంశాల్లో ప్రాథమిక సామర్థ్యాలను నేర్పిస్తారు. వీరిని ప్రత్యేకంగా మరో తరగతి గదిలో కూర్చోబెట్టకుండా మిగతా విద్యార్థులతో పాటు కూర్చోబెట్టి, ప్రత్యేకంగా వ్యక్తిగత శ్రద్ధతో బోధిస్తారు. 

*రోజుకు తొమ్మిది ..* 

ఇప్పటి వరకు ఎనిమిది పీరియడ్లు అన్ని పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. జ్ఞానధార అమలుకోసం ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో తొమ్మిదో పీరియడ్‌ను ప్రవేశపెడుతున్నారు. 

★ ఇందుకు ప్రతి పీరియడ్‌ను 50 నిమిషాల నుంచి 45 నిమిషాలకు తగ్గించి ప్రతి పీరియడ్‌కు వచ్చే 5 నిమిషాలను కలిపి 45 నిమిషాలుగా తొమ్మిదో పీరియడ్‌ను పరిగణిస్తారు.

★ పాఠశాల సమయాల్లో ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల్లో ఎలాంటి మార్పు లేదు.

★ జ్ఞానధారకు సంబంధించిన పీరియడ్‌ ఉదయం 2వ పీరియడ్‌ ముగిసిన అనంతరం 3వ పీరియడ్‌లో బోధిస్తారు.

★ ప్రస్తుతం ఉన్న మూడో పీరియడ్‌ను 4వ పీరియడ్‌గా పరిగణిస్తారు.

★ ఇదే క్రమ పద్ధతి చివరి పీరియడ్‌ వరకు కొనసాగుతుంది. మిగిలిన టైం టేబుల్‌లో ఎలాంటి మార్పు ఉండదు.

★ ఇందుకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు, పాఠశాలలకు జారీ చేసింది.



 

స్కూలు విద్యార్థులకు 23 నుంచి ‘జ్ఞానధార’-  UP/ HS లకు కొత్త టైం టేబుల్ *

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ ఈనెల 23 నుంచి జ్ఞానధార కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు దసరా సెలవుల తర్వాత ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది.

 ప్రస్తుత విద్యా సంవత్సరంలో 150 రోజుల పాటు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థుల్ని గుర్తించి ప్రత్యేక శిక్షణ అందిస్తారు. తెలుగు, ఇంగ్లీష్‌, గణితం సబ్జెక్టులలో ప్రాథమిక పరీక్ష నిర్వహించి విద్యార్థుల్ని ఎ,బి,సి,డి గ్రేడులుగా విభజిస్తారు.

 ప్రస్తుతం పాఠశాలల్లో పీరియడ్‌కు 45 నిముషాలు చొప్పున రోజుకు 8 పీరియడ్లు జరుగుతున్నాయి.

ఒక్కో పీరియడ్‌ను 40 నిముషాలకు కుదించి తొమ్మిదో పీరియడ్‌కు మరో 40 నిముషాలు కేటాయిస్తారు. సి,డి గ్రేడుల్లో ఉన్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులకు ప్రత్యేక పుస్తకాలు, మెటిరియల్‌ను విద్యాశాఖ సరఫరా చేస్తుంది.

 

FOR MORE DETAILS about JNANADHARA NOTIFICATION CLICK HERE

error: Content is protected !!