చివరి ప్రయత్నం-విక్రం-ల్యాండర్‌పై-ఎగరనున్న నాసా ఆర్బిటర్.

చివరి ప్రయత్నం.-విక్రం-ల్యాండర్‌పై-ఎగరనున్న నాసా ఆర్బిటర్.

చివరి ప్రయత్నం… రేపు విక్రం ల్యాండర్‌పై ఎగరనున్న నాసా ఆర్బిటర్...

Chandrayaan-2 : ఇప్పుడిప్పుడే మనం చంద్రయాన్-2ని మర్చిపోయేందుకు ప్రయత్నిస్తున్నాం. అలాంటి సమయంలో…

చివరిసారిగా విక్రమ్ ల్యాండర్‌ పైనుంచీ నాసా ఆర్బిటర్ ఎగరబోతోంది.

అందువల్ల విక్రమ్‌కి సంబంధించి కీలక సమాచారం లభించే ఛాన్స్ ఉంటుంది.

సెప్టెంబర్ 6న అర్థరాత్రి దాటాక… చంద్రయాన్-2 ఆర్బిటర్ నుంచీ విడిపోయిన విక్రమ్ ల్యాండర్… రాత్రి 1.40 సమయంలో… చందమామ దక్షిణధ్రువంపై దిగుతూ… సిగ్నల్స్ అందుకోవడం మానేసింది. ఆ తర్వాత… అది చందమామపై ఎక్కడ దిగిందో ఇస్రో కనిపెట్టగలిగింది. కానీ… విక్రమ్ ల్యాండర్‌కి సంబంధించి అత్యంత దగ్గర నుంచీ చూసే ఫొటోలేవీ ఇస్రో దగ్గర లేవు. చందమామ చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్-2 ఆర్బిటర్‌కి ఉన్న కెమెరా తీసిన ఫొటోల ద్వారానే ఇస్రో… ఆ ల్యాండర్ ఎక్కడ పడిందో, ఎలా ఉందో గుర్తించగలిగింది. ఐతే… ఎంతగా ప్రయత్నించినా ల్యాండర్‌ సిగ్నల్స్ అందుకోలేదు. ఇప్పటికే 10 రోజులు గడిచిపోయాయి.

మరో నాల్రోజుల తర్వాత విక్రమ్ ల్యాండర్ పడిన చోటి నుంచీ సూర్య కాంతి వెళ్లిపోతుంది.

రెండు వారాల వరకూ మళ్లీ కాంతి రాదు. అందువల్ల మైనస్ 153 డిగ్రీల ఉష్ణోగ్రత వల్ల విక్రమ్ ల్యాండర్ పూర్తిగా పనిచేయకుండా పోతుంది.

అందువల్ల దాని నుంచీ సిగ్నల్స్ అందుకోవడానికి ఇస్రో శాస్త్రవేత్తలకు ఇంకా 4 రోజుల సమయమే ఉంది. ఈ పరిస్థితుల్లో నాసాకు చెందిన ల్యూనార్ రికన్నైశాన్స్ ఆర్బిటర్ (LRO) రేపు విక్రమ్ ల్యాండర్ పడిన చోట ఎగరబోతోంది.

అది విక్రమ్ ల్యాండర్‌ను అత్యంత దగ్గర నుంచీ ఫొటోలు తీసి… ఇస్రోకి పంపనుంది.

తద్వారా ల్యాండర్ ఎలా ఉందో, అది సిగ్నల్స్ అందుకునే అవకాశం ఉందో లేదో మరింత స్పష్టంగా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది.

నాసా రూల్స్ ప్రకారం… LRO పంపే ప్రతీ సమాచారాన్నీ నాసా ఈ ప్రపంచానికి చెప్పి తీరాల్సిందే.

అందువల్ల విక్రమ్ ల్యాండర్‌కి సంబంధించి తీసే ఫొటోలు, డే అండ్ నైట్ టెంపరేచర్ మ్యాప్స్, గ్లోబల్ జియోడెటిక్ గ్రిడ్, హై రిజల్యూషన్ కలర్ ఇమేజెస్ కూడా ఇస్రోతోపాటూ… మనం అందరం చూసేందుకు వీలవుతుంది.

ఆ ఫొటోలను నాసా తన LRO పోర్టల్‌లో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.

విక్రమ్ ల్యాండర్ పనిచెయ్యకపోయినా… చంద్రయాన్-2 ఆర్బిటర్ మాత్రం… వచ్చే ఏడేళ్లపాటూ తన సేవలు అందించనుంది.

error: Content is protected !!