# చివరి ప్రయత్నం-విక్రం-ల్యాండర్‌పై-ఎగరనున్న నాసా ఆర్బిటర్.

- Link: https://amaravathiteacher.com/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%af%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a8%e0%b0%82-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82-lander/
- Published: 2019-09-16T21:17:50+05:30
- Author: amaravathiteacher

## **చివరి ప్రయత్నం.-విక్రం-ల్యాండర్‌పై-ఎగరనున్న నాసా ఆర్బిటర్.**󠀁[](https://amaravathiteacher.com/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%af%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a8%e0%b0%82-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82-lander/)󠁿

### **చివరి ప్రయత్నం… రేపు విక్రం ల్యాండర్‌పై ఎగరనున్న నాసా ఆర్బిటర్...**

### **Chandrayaan-2 : ఇప్పుడిప్పుడే మనం చంద్రయాన్-2ని మర్చిపోయేందుకు ప్రయత్నిస్తున్నాం. అలాంటి సమయంలో… **

### **చివరిసారిగా విక్రమ్ ల్యాండర్‌ పైనుంచీ నాసా ఆర్బిటర్ ఎగరబోతోంది. **

### **అందువల్ల విక్రమ్‌కి సంబంధించి కీలక సమాచారం లభించే ఛాన్స్ ఉంటుంది.**

### **సెప్టెంబర్ 6న అర్థరాత్రి దాటాక… చంద్రయాన్-2 ఆర్బిటర్ నుంచీ విడిపోయిన విక్రమ్ ల్యాండర్… రాత్రి 1.40 సమయంలో… చందమామ దక్షిణధ్రువంపై దిగుతూ… సిగ్నల్స్ అందుకోవడం మానేసింది. ఆ తర్వాత… అది చందమామపై ఎక్కడ దిగిందో ఇస్రో కనిపెట్టగలిగింది. కానీ… విక్రమ్ ల్యాండర్‌కి సంబంధించి అత్యంత దగ్గర నుంచీ చూసే ఫొటోలేవీ ఇస్రో దగ్గర లేవు. చందమామ చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్-2 ఆర్బిటర్‌కి ఉన్న కెమెరా తీసిన ఫొటోల ద్వారానే ఇస్రో… ఆ ల్యాండర్ ఎక్కడ పడిందో, ఎలా ఉందో గుర్తించగలిగింది. ఐతే… ఎంతగా ప్రయత్నించినా ల్యాండర్‌ సిగ్నల్స్ అందుకోలేదు. ఇప్పటికే 10 రోజులు గడిచిపోయాయి. **

### **మరో నాల్రోజుల తర్వాత విక్రమ్ ల్యాండర్ పడిన చోటి నుంచీ సూర్య కాంతి వెళ్లిపోతుంది. **

### **రెండు వారాల వరకూ మళ్లీ కాంతి రాదు. అందువల్ల మైనస్ 153 డిగ్రీల ఉష్ణోగ్రత వల్ల విక్రమ్ ల్యాండర్ పూర్తిగా పనిచేయకుండా పోతుంది. **

### **అందువల్ల దాని నుంచీ సిగ్నల్స్ అందుకోవడానికి ఇస్రో శాస్త్రవేత్తలకు ఇంకా 4 రోజుల సమయమే ఉంది. ఈ పరిస్థితుల్లో నాసాకు చెందిన ల్యూనార్ రికన్నైశాన్స్ ఆర్బిటర్ (LRO) రేపు విక్రమ్ ల్యాండర్ పడిన చోట ఎగరబోతోంది. **

### **అది విక్రమ్ ల్యాండర్‌ను అత్యంత దగ్గర నుంచీ ఫొటోలు తీసి… ఇస్రోకి పంపనుంది. **

### **తద్వారా ల్యాండర్ ఎలా ఉందో, అది సిగ్నల్స్ అందుకునే అవకాశం ఉందో లేదో మరింత స్పష్టంగా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది.**

### **నాసా రూల్స్ ప్రకారం… LRO పంపే ప్రతీ సమాచారాన్నీ నాసా ఈ ప్రపంచానికి చెప్పి తీరాల్సిందే. **

### **అందువల్ల విక్రమ్ ల్యాండర్‌కి సంబంధించి తీసే ఫొటోలు, డే అండ్ నైట్ టెంపరేచర్ మ్యాప్స్, గ్లోబల్ జియోడెటిక్ గ్రిడ్, హై రిజల్యూషన్ కలర్ ఇమేజెస్ కూడా ఇస్రోతోపాటూ… మనం అందరం చూసేందుకు వీలవుతుంది. **

### **ఆ ఫొటోలను నాసా తన LRO పోర్టల్‌లో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.**

### **విక్రమ్ ల్యాండర్ పనిచెయ్యకపోయినా… చంద్రయాన్-2 ఆర్బిటర్ మాత్రం… వచ్చే ఏడేళ్లపాటూ తన సేవలు అందించనుంది.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
