district-assessment-cell-revised-rolls-responsibilities-vacancies-DCEB

ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలలో 10వ తరగతి అంతర్గత మార్కుల తనిఖీలకు ఆదేశాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.
★ ఈ పరిశీలన కొరకు మండల, డివిజన్, జిల్లాల వారీగా మూడు స్ధాయిలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేసే సీనియర్ హెచ్ఎం, మండల విద్యాశాఖ అధికారి, SSA సెక్టోరల్ అధికారి, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ పర్యవేక్షణలో నిర్వహణ.
★ సమ్మెటివ్-1కు 10 మార్కులు, ఒక్కో ఫార్మెటివ్ పరీక్షకు రెండున్నర మార్కుల చొప్పున నాలుగు ఫార్మెటివ్లకు 10 మార్కులు చొప్పున కేటాయింపు.
[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
★ విద్యార్థుల పరీక్షలు, వారి అభ్యసన సామర్థ్యాలు, ప్రాజెక్టు వర్క్, మౌఖిక ఇంటర్వ్యూలు, స్లిప్ టెస్ట్‌లో మార్కులు, క్రమశిక్షణ తదితరాలను తనిఖీలకు జిల్లా విద్యాశాఖ.
★ విద్యార్థులు రాసిన సమాధానాలు ఆధారంగా మార్కులు వేసి వాటినే CSE వెబ్సైట్లో మార్కులు నమోదు చేశారా లేక ఇక్కడ ఏమైనా హెచ్చుతగ్గులుగా నమోదు చేశారా, విద్యార్థుల సమాధాన పత్రాలపై నమోదు చేసిన మార్కులు, సీఎస్ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన మార్కులు రెండూ ఒకేరకంగా ఉన్నాయా లేదా అనేది కూడా ఈ కమిటీలు ధ్రువీకరించాలి.
★ తనిఖీలకు వెళ్లిన ప్రతి చోటా మొత్తం విద్యార్థుల్లో 20 శాతం మంది పేపర్లు పరిశీలన.
* కమిటీల్లో సభ్యులు*
★ మండల స్థాయి కమిటీలో ఎంఈఓ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం, ఆ మండలంలో సీనియర్ ప్రధానోపాధ్యాయుడు.
★ డివిజన్ స్ధాయిలో డీవైఈవో, మండలంలో సీనియర్ హెచ్ఎం, ఎస్ఎస్ఏ నుంచి సెక్టోరియల్ అధికారి.
★ జిల్లా స్ధాయిలో డీఈవో, అసిస్టెంట్ కమిషనర్(ఎగ్జామినేషన్), డీసీఈబీ సెక్రటరీ, డైట్ ప్రిన్సిపాల్ సభ్యులు.
* పరిశీలనకు షెడ్యూల్*
★ మండల స్దాయిలో ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 2 వరకు.
★ డివిజన్ స్దాయిలో ఫిబ్రవరి 5 నుంచి 13 వరకు.
★ జిల్లా స్ధాయిలో ఫిబ్రవరి 5 నుంచి 13 వరకు.
[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,
