10th-class-public-exams-Telugu-model-papers-blue-print-2019

10th-class-public-exams-Telugu-model-papers-blue-print-2019

కొత్త ప్రశ్నాపత్రం ఇలా..*

TELUGU PAPER-1 BLUE PRINT

కాంపోజిట్ తెలుగు మోడల్ పేపర్ (70 మార్కులు)

సంస్కృతం మోడల్ పేపర్ (04S) 30 మార్కులు

TELUGU PAPER-1 BLUE PRINT

TELUGU PAPER-1 MODEL PAPER AP SCERT(SET-1)

టెన్త్‌లో పేపర్‌–1లో 50 మార్కులు, పేపర్‌–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ టైప్, వెరీ షార్ట్‌ ఆన్సర్స్, షార్ట్‌ ఆన్సర్స్, ఎస్సే టైప్‌ ప్రశ్నలు ఇస్తారు.

ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి.

షార్ట్‌ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి.

*♦సింపుల్‌ ఆన్సర్‌ ప్రశ్నలు 8* మొత్తం 8 మార్కులకు ఉంటాయి.

వెరీ సింపుల్‌ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి. 

అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు,

సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం,

ఇప్పుడు 18 పేజీల బుక్‌లెట్‌ ఇవ్వబోతున్నారు.

TELUGU PAPER-2 BLUE PRINT

TELUGU PAPER-2 BLUE PRINT

TELUGU PAPER-2 MODEL PAPER AP SCERT(SET-1)

*పదవ తరగతి*

*తెలుగు-I మోడల్ ప్రశ్నా పత్రం*

*విద్యార్థులకు సూచనలు:*

1. ప్రశ్నాపత్రంలో మూడు సెక్షన్‌లు ఉంటాయి.

2. ప్రశ్నాపత్రం చదువుకోవడానికి 15 ని||లు, జవాబులు రాయడానికి 2.30 ని||ల సమయం వుంటుంది.

3. అన్ని ప్రశ్నలకు జవాబులు సమాధాన పత్రం(బుక్‌లెట్‌)లోనే రాయాలి.

★★★★★★★★★★★★★★★

*I. అవగాహన – ప్రతిస్పందన : (16 మార్కులు)*

1. ఈ కింది పద్యాలలో ఒకదానికి ప్రతిపదార్థం రాయండి. 1×4=4

అ) సురుచిరతారకాకుసుమశోభి నభోంగణభూమిఁ గాలమ

న్గరువపుసూత్రధారి జతనంబున దిక్పతికోటి ముందటన్‌

సరసముగా నటింపఁగ నిశాసతి కెత్తిన క్రొత్తతోఁపుఁబెం

దెర యన నొప్పె సాంధ్యనవదీధితి పశ్చిమదిక్తటంబునన్‌.

జవాబు : సురుచిర = చాలా అందమైన

తారకా = చుక్కలనే

కుసుమ = పూల (చే)

శోభి = అలంకరింపబడిన

నభః+అంగణ = ఆకాశమనే రంగస్థలం

భూమిన్‌ = (వేదిక) పై

కాలము+అన్‌ = కాలం అనే

గరువపు = గొప్పవాడైన

సూత్రధారి = సూత్రధారి (దర్శకుడు)

జతనంబున = ప్రయత్నపూర్వకంగా

దిక్పతికోటి = దిక్పాలకుల సమూహం

ముందటన్‌ = ముందు (ఎదుట)

సరసముగా = చక్కగా (యుక్తంగా)

నటింపగ = నటించడానికి

నిశాసతికి = రాత్రి అనే స్త్రీకి

ఎత్తిన = నిలిపిన (పట్టిన)

క్రొత్త = క్రొత్తదైన

తోఁపున్‌ = ఎర్రని

పెన్‌+తెర = పెద్దతెర

అనన్‌ = అన్నట్లుగా

పశ్చిమ దిక్‌+తటంబునన్‌ = పడమటి తీరంలోని (పడమటి దిక్కున)

సాంధ్య = సంధ్యకు సంబంధించిన (సంధ్యాకాలపు)

నవ దీధితి = క్రొత్త కాంతి

ఒప్పెన్‌ = ప్రకాశించింది

(లేదా)

ఆ) ఆకంఠంబుగ నిప్డు మాధుకర భిక్షాన్నంబు భక్షింఁపగా

లేకున్నం గడు నంగలార్చెదవు మేలే? లెస్స! శాంతుండవే!

నీ కంటెన్‌ మతిహీనులే కటకటా! నీవార ముష్టింపచుల్‌

శాకాహారులుఁ గందభోజులు, శిలోంఛప్రక్రముల్‌ తాపసుల్‌!

జవాబు : ఇప్డు = ఇప్పుడు

ఆ కంఠంబుగన్‌ = గొంతుదాకా

మాధుకర భిక్షాన్నంబు = మాధుకర  రూపమైన భిక్షాన్నము

భక్షింపగాన్‌ = తినుటకు

లేకున్నన్‌ = లేకపోయినను

కడున్‌ = మిక్కిలి

అంగలార్చెదవు = చిందులువేస్తూ  అరుస్తున్నావు

మేలే = మంచిదా!

లెస్స! = బాగున్నదా

శాంతుండవే? = శాంతస్వభావము గలవాడవేనా!

కటకటా = అయ్యెయ్యో!

నీవారముష్టింపచుల్‌ = పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారును

శాకాహారులు = కాయకూరలు  తినేవారును

కందభోజులు = దుంపలు మాత్రమే తినెడివారును

శిల = కోతకోసిన వరిమళ్ళలో జారిపడిన కంకులను ఏరుకొని బ్రతుకువారును

ఉచ్ఛప్రక్రముల్‌ = రోళ్ళవద్ద మిగిలిన  బియ్యంతో జీవనం గడుపువారైన

తాపసుల్‌ = మునులు (తపస్సు చేసుకొనేవారు)

నీ కంటెన్‌ = నీ కన్నా

మతిహీనులే = తెలివితక్కువ వారా?

2. ఈ కింది పద్యాలలో ఒకదానిని పాదభంగం లేకుండా పూరించి, భావాన్ని రాయండి. 1×4=4

అ) అనల జ్యోతుల నీ పతివ్రతల …………………………

…………………………………. దుశ్చారిత్రముల్‌ సాగునే

(లేదా)

తనదేశంబు స్వభాష …………………………………….

………………………………………… భక్త చింతామణీ!

ఆ) కింది పరిచిత గద్య భాగాన్ని చదవండి. ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 4×1=4

       కొత్త శతాబ్దంలో స్త్రీలందరం కలిసి చేసుకునే ఉత్సవంగా ఈ పుస్తకాన్ని తీసుకురావాలనుకున్నాం. ఫోటోలు ప్రచు రించాలనే నిర్ణయం చాలా ఆలోచించే తీసుకున్నాం. వ్యక్తులను చూస్తూ, వారి గురించి తెలుసుకోవటానికీ, ముఖమైనా తెలియని వ్యక్తుల గురించి చదవటానికి ఈ తరం వారు చూపే ఆసక్తిలో తేడా ఉంటుంది. ఈ తరం యువతకు గత చరిత్రను పరిచయం చేసేటప్పుడు వారి మనసుపై ముద్ర వేయటానికి ఫోటోలు అవసరమని పించింది. ఆ రకంగా వాళ్ళ జ్ఞాపకాలు మనలో ఎక్కువ కాలం ఉంటాయని మా ఉద్దేశం. వంద సంవత్సరాలుగా స్త్రీలు చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ జరుపుకునే విజయోత్సవంగా ఈ పుస్తకం నిలబడుతుందనుకున్నాం.

ప్రశ్నలు :

3) కొత్త శతాబ్దంలో ఏమి తీసుకురావాలనుకున్నారు?

4) పై పేరాలో ‘ఈ పుస్తకం’ అంటే ఏది?

5) ఫోటోలు ఎందుకు ప్రచురించాలనుకున్నారు?

6) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి?

తే||గీ|| ఓ మునీశ్వర! వినవయ్య యున్న యూరుఁ

గన్నతల్లియు నొక్క రూపన్న రీతి

యటు విశేషించి శివుని యర్ధాంగలక్ష్మి 

కాశి; యివ్వీటి మీఁద నాగ్రహము దగునె?

7) పై పద్యంలో మునీశ్వరుడు అంటే ఎవరు?

8) శివుని అర్థాంగ లక్ష్మి  అని దేనికి పేరు?

9) పై పద్యంలో గసడద వాదేశసంధి పదం ఉంది. దాన్ని గుర్తించి రాయండి?

10) పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.

*II. వ్యక్తీకరణ – సృజనాత్మకత  7 × 2 = 14*

అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి?

11. కవి వెన్నెలను వర్ణించడానికి ఏయే అంశాలను ఎన్నుకొన్నాడు?

12. సముద్ర లంఘనానికి ముందు హనుమంతుడు చేసిన చేష్టల ఆంతర్యం ఏమైయుంటుంది?

13. ఆచార్య నాగార్జునిని గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి?

14. చిత్రగ్రీవాన్ని గురించి మీకు ఆశ్చర్యం కలిగించిన విషయాలు రాయండి?

15. ”పల్లెటూళ్ళు ప్రశాంత జీవన సౌఖ్యానికి పుట్టిల్లు” అని చెప్పిన జానపదుని జాబు కవిని గురించి రాయండి?

16. గోరంత దీపాలు పాఠ్యభాగ నేపథ్యాన్ని వివరించండి?

17. ‘ప్రబంధం’ ప్రక్రియను పరిచయం చేయండి?

ఆ) కింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి? 2×5=10

18. మాతృభావన పాఠం ఆధారంగా శివాజీ వ్యక్తిత్వాన్ని విశ్లేషిం చండి?

( లేదా )

”కోపం మనిషి విచక్షణను నశింప జేస్తుంది’ అనే అంశాన్ని బిక్ష పాఠం ఆధారంగా నిరూపించండి.

19. ‘పల్లెటూళ్ళు ప్రశాంత జీవన సౌఖ్యానికి పుట్టిల్లు’ దీన్ని సమర్ధిస్తూ సమాధానం రాయండి.

( లేదా )

గోరంత దీపాలు కథానికి లోని వృద్ధుని పాత్ర స్వభావాన్ని, గొప్పదనాన్ని సొంత మాటల్లో రాయండి?

*III. భాషాంశాలు 12 మార్కులు*

20. ”అభినుతేందు చంద్రి కాంభోధియఖిలంబు

నీట నిట్టలముగ నిట్టవొడిచె’ – ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి అలంకార లక్షణం రాయండి.

జవాబు : ఈ వాక్యంలోని అలంకారం – రూపకాలంకారం.

లక్షణం : ఉపమానోపమేయాలకు అభేదం చెప్పిన రూప కాలంకారం అంటారు.

21. ఈ కింది పద్యపాదాలలో ఒకదానిని గణవిభజన చేసి లక్ష్య లక్షణ సమన్వయం చేయండి.

నీకంటెన్‌ మతిహీనులే కటకటా!  నీ వార ముష్టింపచుల్‌

జవాబు :

నీకంటెన్‌ – మ UUU

మతిహీ –  స IIU

నులేక – జ IUI

టకటా! –  స IIU

నీవార – త UUI

ముష్టింప – త UUI

చుల్‌ – గ U

– పై పద్యపాదంలో మ, స, జ, స, త, త, గ అనే గణాలు వచ్చాయి. ఇది శార్ధూలం.

– ఒకటవ అక్షరానికి, 13వ అక్షరానికి యతిమైత్రి చెల్లింది. నీ – నీ

– ఇది వృత్తజాతి పద్యం. ఇందులో నాలుగు పాదా లుంటాయి.

– ప్రాస నియమం ఉంటుంది.

(లేదా)

గాద్పువేల్పుపట్టి గట్టెక్కి యుక్కున

జూచె సూటి నేటి జోటి మగని

(మొదటి పాదం )

గాడ్పు – హ UI

వేల్పు – హ UI

పట్టి – హ UI

గట్టెక్కి – త UUI

యుక్కున – భ UII

(రెండవ పాదం )

జూచె – హ  UI 

సూటి – హ UI

నేటి – హ UI

జోటి – హ UI

మగని – వ III

– పై పద్యపాదాలలో మొదటి పాదంలో 3 సూర్య గణాలు, 2 ఇంద్రగణాలు, రెండవ పాదంలో ఐదూ సూర్యగణాలే ఉన్నాయి కాబట్టి ఇది ఆటవెలది పద్యం.

– ఇది ఉపజాతి పద్యం. దీనికి 4 పాదాలుంటాయి.

– ఒకటవ గణం మొదటి అక్షరానికి నాలుగవ గణం మొదటి అక్షరానికి యతి మైత్రి చెల్లింది. గా-గ

– ప్రాస నియమం లేదు. ప్రాసయతి చెల్లుతుంది.

ఈ కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి

10th CLASS PUBLIC EXAMS TELUGU PAPER-1 MODEL PAPER

10th CLASS PUBLIC EXAMS TELUGU PAPER-2 MODEL PAPER

22.  *రజనీకర బింబమును* చూస్తే పిల్లలు ఆనందిస్తారు.

గీత గీచిన పదానికి (ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో ఇవ్వబడింది) కింద ఇవ్వబడిన అర్థాలలో సరియైన దానిని గుర్తించి రాయండి.

భవుడు    చంద్రుడు     ఇంద్రుడు

జవాబు : చంద్రుడు

23. ప్రక్షాళితంబైన *పసిడి* చట్టువము. గీ.ప.కు (ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో ఇవ్వబడింది) అర్థం రాయండి.

జవాబు : బంగారం

24. ఈ రాత్రి *తమస్సు* దట్టముగా అలముకొంది. గీ.ప. (ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో ఇవ్వబడింది)కు పర్యాయ పదాలను గుర్తించి రాయండి.

అ) మంచు, మేఘాలు ఆ) గాలి, పొగ ఇ) చీకటి, అంధకారం ఈ) రాత్రి, పగలు

జవాబు : చీకటి, అంధకారం

25. ప్రతి ఒక్కరూ నివసించడానికి ఇల్లు అవసరము

గృహమునకు దేవత గృహిణి. రవీంద్రుడు శాంతినికేతంలో నివసించాడు.

పై వాక్యములలోని సమానార్థక పదాలను గుర్తించి వేరుగా రాయండి.

జవాబు : గృహము = ఇల్లు, నికేతం

26.  *15 రోజుల*  నుంచి చిలుక *రెక్కలు* విప్పుకుని ఎగురుట లేదు.

గీ.ప.కు (ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో ఇవ్వబడింది) సరియైన నానార్థ పదాన్ని రాయండి.

జవాబు : పక్షం

27. చాలా రోజుల తరువాత మా *గురువు*  ను చూశాను.

గీ.ప.కి (ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో ఇవ్వబడింది) వ్యుత్పత్తిని రాయండి.

జవాబు : గురువు – అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే వాడు (ఉపాధ్యాయుడు)

28. ‘ఆరోగ్యమే మహా *భాగ్యం’* అని పెద్దలు అంటారు.

గీ.ప.కు (ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో ఇవ్వబడింది) సరియైన వికృతి పదాన్ని గుర్తించి రాయండి.

బాగం    బాగ్గెం     బాగ్గెన్‌     బారం

జవాబు : బాగ్గెం

29.  *చట్టాలు* ఎన్ని చేసినా సమాజంలో మార్పురాదు. గీ.ప.కు (ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో ఇవ్వబడింది)ప్రకృతి పదం రాయండి.

జవాబు : శాస్త్రాలు

30. *అంతరాత్మ*  చెప్పినట్లుగా నడుచుకోవాలి. గీ.ప.ను (ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో ఇవ్వబడింది) విడదీసి రాయండి.

జవాబు : అంతః + ఆత్మ

31. తరిగొండ వెంగమాంబ గొప్ప *భక్తురాలు.* 

గీ.ప.కు (ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో ఇవ్వబడింది) సంధి పేరు రాయండి.

జవాబు : రుగాగమ సంధి.

32. చంద్రకాంతి భూమి, ఆకాశాలను కప్పేసింది.

పై వాక్యంలో షష్టీ తత్సురుస సమాస పదాన్ని గుర్తించండి.

జవాబు : చంద్రకాంతి

33. దేశాభివృద్ధికి మనం  *యథాశక్తి*  కృషి చేయాలి.

గీ.ప.కి. (ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో ఇవ్వబడింది) విగ్రహ వాక్యం రాయండి.

జవాబు : శక్తి ఎంతో అంత.

సంస్కృతం పేపర్ బ్లూ ప్రింట్ (04S)

10TH CLASS TELUGU-1 MODEL PAPER (SET-2)

TELUGU PAPER-2 MODEL PAPER (SET-2)

error: Content is protected !!