# 10th-class-public-exams-Telugu-model-papers-blue-print-2019

- Link: https://amaravathiteacher.com/10th-class-public-exams-telugu-model-papers-blue-print-2019/
- Published: 2019-09-27T22:05:57+05:30
- Author: amaravathiteacher

## **_10th-class-public-exams-Telugu-model-papers-blue-print-2019_**

### **కొత్త ప్రశ్నాపత్రం ఇలా..\***

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2019/09/screencapture-
drive-google-drive-u-3-folders-1-lsn1ZSS1EyRTajBN3S-IO0d4YcxhtKN-2019-09-27-22_22_27.
jpg?resize=618%2C483&ssl=1)

### **󠀁[TELUGU PAPER-1 BLUE PRINT](https://drive.google.com/file/d/1QGOlIs0zpZujH7E1_jpv4x-witCgk9sH/view?usp=sharing)󠁿**

### **_󠀁[కాంపోజిట్ తెలుగు మోడల్ పేపర్ (70 మార్కులు)](https://drive.google.com/file/d/1dGjjvUUuoztRUjyiVaF1DeCZRyTz6Y3a/view?usp=sharing)󠁿_**

### **󠀁[సంస్కృతం మోడల్ పేపర్ (04S) 30 మార్కులు ](https://drive.google.com/file/d/17yuZELWmHjj6_0HXeS8k-DsPYeB4gWnp/view?usp=sharing)󠁿**

### **󠀁[TELUGU PAPER-1 BLUE PRINT](https://drive.google.com/file/d/1QGOlIs0zpZujH7E1_jpv4x-witCgk9sH/view?usp=sharing)󠁿**

### 󠀁[**TELUGU PAPER-1 MODEL PAPER AP SCERT(SET-1)**](https://drive.google.com/file/d/1FjQsJccX_OZFM5FcHoMuwP1DzsND9y13/view?usp=sharing)󠁿

### **టెన్త్‌లో పేపర్‌–1లో 50 మార్కులు, పేపర్‌–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ టైప్, వెరీ షార్ట్‌ ఆన్సర్స్, షార్ట్‌ ఆన్సర్స్, ఎస్సే టైప్‌ ప్రశ్నలు ఇస్తారు. **

### **ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి. **

### **షార్ట్‌ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి.**

### **\*♦సింపుల్‌ ఆన్సర్‌ ప్రశ్నలు 8\* మొత్తం 8 మార్కులకు ఉంటాయి. **

### **వెరీ సింపుల్‌ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి.  **

### **అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు, **

### **సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం,**

### **ఇప్పుడు 18 పేజీల బుక్‌లెట్‌ ఇవ్వబోతున్నారు.**

### **_TELUGU PAPER-2 BLUE PRINT_**

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2019/09/TEL-2.jpeg?
resize=480%2C540&ssl=1)

### **󠀁[TELUGU PAPER-2 BLUE PRINT](https://drive.google.com/file/d/1kELAuLuMsfa2IY_9IIDSGqwMdaIMVWYp/view?usp=sharing)󠁿**

### **󠀁[TELUGU PAPER-2 MODEL PAPER AP SCERT(SET-1)](https://drive.google.com/file/d/1E35qjO0bZak_hzbqQ2-HENp4ETzd-kcP/view?usp=sharing)󠁿**

### **\*పదవ తరగతి\***

### **\*తెలుగు-I మోడల్ ప్రశ్నా పత్రం\***

### **\*విద్యార్థులకు సూచనలు:\***

### **1. ప్రశ్నాపత్రంలో మూడు సెక్షన్‌లు ఉంటాయి.**

### **2. ప్రశ్నాపత్రం చదువుకోవడానికి 15 ని||లు, జవాబులు రాయడానికి 2.30 ని||ల సమయం వుంటుంది.**

### **3. అన్ని ప్రశ్నలకు జవాబులు సమాధాన పత్రం(బుక్‌లెట్‌)లోనే రాయాలి.**

### **★★★★★★★★★★★★★★★**

### **\*I. అవగాహన – ప్రతిస్పందన : (16 మార్కులు)\***

### **1. ఈ కింది పద్యాలలో ఒకదానికి ప్రతిపదార్థం రాయండి. 1×4=4**

### **అ) సురుచిరతారకాకుసుమశోభి నభోంగణభూమిఁ గాలమ**

### **న్గరువపుసూత్రధారి జతనంబున దిక్పతికోటి ముందటన్‌**

### **సరసముగా నటింపఁగ నిశాసతి కెత్తిన క్రొత్తతోఁపుఁబెం**

### **దెర యన నొప్పె సాంధ్యనవదీధితి పశ్చిమదిక్తటంబునన్‌.**

### **జవాబు : సురుచిర = చాలా అందమైన**

### **తారకా = చుక్కలనే**

### **కుసుమ = పూల (చే)**

### **శోభి = అలంకరింపబడిన**

### **నభః+అంగణ = ఆకాశమనే రంగస్థలం**

### **భూమిన్‌ = (వేదిక) పై**

### **కాలము+అన్‌ = కాలం అనే**

### **గరువపు = గొప్పవాడైన**

### **సూత్రధారి = సూత్రధారి (దర్శకుడు)**

### **జతనంబున = ప్రయత్నపూర్వకంగా**

### **దిక్పతికోటి = దిక్పాలకుల సమూహం**

### **ముందటన్‌ = ముందు (ఎదుట)**

### **సరసముగా = చక్కగా (యుక్తంగా)**

### **నటింపగ = నటించడానికి**

### **నిశాసతికి = రాత్రి అనే స్త్రీకి**

### **ఎత్తిన = నిలిపిన (పట్టిన)**

### **క్రొత్త = క్రొత్తదైన**

### **తోఁపున్‌ = ఎర్రని**

### **పెన్‌+తెర = పెద్దతెర**

### **అనన్‌ = అన్నట్లుగా**

### **పశ్చిమ దిక్‌+తటంబునన్‌ = పడమటి తీరంలోని (పడమటి దిక్కున)**

### **సాంధ్య = సంధ్యకు సంబంధించిన (సంధ్యాకాలపు)**

### **నవ దీధితి = క్రొత్త కాంతి**

### **ఒప్పెన్‌ = ప్రకాశించింది**

### **(లేదా)**

### **ఆ) ఆకంఠంబుగ నిప్డు మాధుకర భిక్షాన్నంబు భక్షింఁపగా**

### **లేకున్నం గడు నంగలార్చెదవు మేలే? లెస్స! శాంతుండవే!**

### **నీ కంటెన్‌ మతిహీనులే కటకటా! నీవార ముష్టింపచుల్‌**

### **శాకాహారులుఁ గందభోజులు, శిలోంఛప్రక్రముల్‌ తాపసుల్‌!**

### **జవాబు : ఇప్డు = ఇప్పుడు**

### **ఆ కంఠంబుగన్‌ = గొంతుదాకా**

### **మాధుకర భిక్షాన్నంబు = మాధుకర  రూపమైన భిక్షాన్నము**

### **భక్షింపగాన్‌ = తినుటకు**

### **లేకున్నన్‌ = లేకపోయినను**

### **కడున్‌ = మిక్కిలి**

### **అంగలార్చెదవు = చిందులువేస్తూ  అరుస్తున్నావు**

### **మేలే = మంచిదా!**

### **లెస్స! = బాగున్నదా**

### **శాంతుండవే? = శాంతస్వభావము గలవాడవేనా!**

### **కటకటా = అయ్యెయ్యో!**

### **నీవారముష్టింపచుల్‌ = పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారును**

### **శాకాహారులు = కాయకూరలు  తినేవారును**

### **కందభోజులు = దుంపలు మాత్రమే తినెడివారును**

### **శిల = కోతకోసిన వరిమళ్ళలో జారిపడిన కంకులను ఏరుకొని బ్రతుకువారును**

### **ఉచ్ఛప్రక్రముల్‌ = రోళ్ళవద్ద మిగిలిన  బియ్యంతో జీవనం గడుపువారైన**

### **తాపసుల్‌ = మునులు (తపస్సు చేసుకొనేవారు)**

### **నీ కంటెన్‌ = నీ కన్నా**

### **మతిహీనులే = తెలివితక్కువ వారా?**

### **2. ఈ కింది పద్యాలలో ఒకదానిని పాదభంగం లేకుండా పూరించి, భావాన్ని రాయండి. 1×4=4**

### **అ) అనల జ్యోతుల నీ పతివ్రతల …………………………**

### **…………………………………. దుశ్చారిత్రముల్‌ సాగునే**

### **(లేదా)**

### **తనదేశంబు స్వభాష …………………………………….**

### **………………………………………… భక్త చింతామణీ!**

### **ఆ) కింది పరిచిత గద్య భాగాన్ని చదవండి. ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 4×1=4**

### **       కొత్త శతాబ్దంలో స్త్రీలందరం కలిసి చేసుకునే ఉత్సవంగా ఈ పుస్తకాన్ని తీసుకురావాలనుకున్నాం. ఫోటోలు ప్రచు రించాలనే నిర్ణయం చాలా ఆలోచించే తీసుకున్నాం. వ్యక్తులను చూస్తూ, వారి గురించి తెలుసుకోవటానికీ, ముఖమైనా తెలియని వ్యక్తుల గురించి చదవటానికి ఈ తరం వారు చూపే ఆసక్తిలో తేడా ఉంటుంది. ఈ తరం యువతకు గత చరిత్రను పరిచయం చేసేటప్పుడు వారి మనసుపై ముద్ర వేయటానికి ఫోటోలు అవసరమని పించింది. ఆ రకంగా వాళ్ళ జ్ఞాపకాలు మనలో ఎక్కువ కాలం ఉంటాయని మా ఉద్దేశం. వంద సంవత్సరాలుగా స్త్రీలు చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ జరుపుకునే విజయోత్సవంగా ఈ పుస్తకం నిలబడుతుందనుకున్నాం.**

### **ప్రశ్నలు :**

### **3) కొత్త శతాబ్దంలో ఏమి తీసుకురావాలనుకున్నారు?**

### **4) పై పేరాలో ‘ఈ పుస్తకం’ అంటే ఏది?**

### **5) ఫోటోలు ఎందుకు ప్రచురించాలనుకున్నారు?**

### **6) పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి?**

### **తే||గీ|| ఓ మునీశ్వర! వినవయ్య యున్న యూరుఁ**

### **గన్నతల్లియు నొక్క రూపన్న రీతి**

### **యటు విశేషించి శివుని యర్ధాంగలక్ష్మి **

### **కాశి; యివ్వీటి మీఁద నాగ్రహము దగునె?**

### **7) పై పద్యంలో మునీశ్వరుడు అంటే ఎవరు?**

### **8) శివుని అర్థాంగ లక్ష్మి  అని దేనికి పేరు?**

### **9) పై పద్యంలో గసడద వాదేశసంధి పదం ఉంది. దాన్ని గుర్తించి రాయండి?**

### **10) పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి.**

### **\*II. వ్యక్తీకరణ – సృజనాత్మకత  7 × 2 = 14\***

### **అ) కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు రాయండి?**

### **11. కవి వెన్నెలను వర్ణించడానికి ఏయే అంశాలను ఎన్నుకొన్నాడు?**

### **12. సముద్ర లంఘనానికి ముందు హనుమంతుడు చేసిన చేష్టల ఆంతర్యం ఏమైయుంటుంది?**

### **13. ఆచార్య నాగార్జునిని గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి?**

### **14. చిత్రగ్రీవాన్ని గురించి మీకు ఆశ్చర్యం కలిగించిన విషయాలు రాయండి?**

### **15. ”పల్లెటూళ్ళు ప్రశాంత జీవన సౌఖ్యానికి పుట్టిల్లు” అని చెప్పిన జానపదుని జాబు కవిని గురించి రాయండి?**

### **16. గోరంత దీపాలు పాఠ్యభాగ నేపథ్యాన్ని వివరించండి?**

### **17. ‘ప్రబంధం’ ప్రక్రియను పరిచయం చేయండి?**

### **ఆ) కింది ప్రశ్నలకు 10 లేక 12 వాక్యాల్లో సమాధానం రాయండి? 2×5=10**

### **18. మాతృభావన పాఠం ఆధారంగా శివాజీ వ్యక్తిత్వాన్ని విశ్లేషిం చండి?**

### **( లేదా )**

### **”కోపం మనిషి విచక్షణను నశింప జేస్తుంది’ అనే అంశాన్ని బిక్ష పాఠం ఆధారంగా నిరూపించండి.**

### **19. ‘పల్లెటూళ్ళు ప్రశాంత జీవన సౌఖ్యానికి పుట్టిల్లు’ దీన్ని సమర్ధిస్తూ సమాధానం రాయండి.**

### **( లేదా )**

### **గోరంత దీపాలు కథానికి లోని వృద్ధుని పాత్ర స్వభావాన్ని, గొప్పదనాన్ని సొంత మాటల్లో రాయండి?**

### **\*III. భాషాంశాలు 12 మార్కులు\***

### **20. ”అభినుతేందు చంద్రి కాంభోధియఖిలంబు**

### **నీట నిట్టలముగ నిట్టవొడిచె’ – ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి అలంకార లక్షణం రాయండి.**

### **జవాబు : ఈ వాక్యంలోని అలంకారం – రూపకాలంకారం.**

### **లక్షణం : ఉపమానోపమేయాలకు అభేదం చెప్పిన రూప కాలంకారం అంటారు.**

### **21. ఈ కింది పద్యపాదాలలో ఒకదానిని గణవిభజన చేసి లక్ష్య లక్షణ సమన్వయం చేయండి.**

### **నీకంటెన్‌ మతిహీనులే కటకటా!  నీ వార ముష్టింపచుల్‌**

### **జవాబు :**

### **నీకంటెన్‌ – మ UUU**

### **మతిహీ –  స IIU**

### **నులేక – జ IUI**

### **టకటా! –  స IIU**

### **నీవార – త UUI**

### **ముష్టింప – త UUI**

### **చుల్‌ – గ U**

### **– పై పద్యపాదంలో మ, స, జ, స, త, త, గ అనే గణాలు వచ్చాయి. ఇది శార్ధూలం.**

### **– ఒకటవ అక్షరానికి, 13వ అక్షరానికి యతిమైత్రి చెల్లింది. నీ – నీ**

### **– ఇది వృత్తజాతి పద్యం. ఇందులో నాలుగు పాదా లుంటాయి.**

### **– ప్రాస నియమం ఉంటుంది.**

### **(లేదా)**

### **గాద్పువేల్పుపట్టి గట్టెక్కి యుక్కున**

### **జూచె సూటి నేటి జోటి మగని**

### **(మొదటి పాదం )**

### **గాడ్పు – హ UI**

### **వేల్పు – హ UI**

### **పట్టి – హ UI**

### **గట్టెక్కి – త UUI**

### **యుక్కున – భ UII**

### **(రెండవ పాదం )**

### **జూచె – హ  UI **

### **సూటి – హ UI**

### **నేటి – హ UI**

### **జోటి – హ UI**

### **మగని – వ III**

### **– పై పద్యపాదాలలో మొదటి పాదంలో 3 సూర్య గణాలు, 2 ఇంద్రగణాలు, రెండవ పాదంలో ఐదూ సూర్యగణాలే ఉన్నాయి కాబట్టి ఇది ఆటవెలది పద్యం.**

### **– ఇది ఉపజాతి పద్యం. దీనికి 4 పాదాలుంటాయి.**

### **– ఒకటవ గణం మొదటి అక్షరానికి నాలుగవ గణం మొదటి అక్షరానికి యతి మైత్రి చెల్లింది. గా-గ**

### **– ప్రాస నియమం లేదు. ప్రాసయతి చెల్లుతుంది.**

### **ఈ కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి**

### **󠀁[10th CLASS PUBLIC EXAMS TELUGU PAPER-1 MODEL PAPER](https://drive.google.com/file/d/1d7ZsCdrsdJhXMoToq-O_skC-YzQNwuZA/view?usp=sharing)󠁿**

### **󠀁[10th CLASS PUBLIC EXAMS TELUGU PAPER-2 MODEL PAPER](https://drive.google.com/file/d/1KKIsYTrp-a282U_w2_a6Xv12vj7l_JEq/view?usp=sharing)󠁿**

### **22.  \*రజనీకర బింబమును\* చూస్తే పిల్లలు ఆనందిస్తారు.**

### **గీత గీచిన పదానికి (ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో ఇవ్వబడింది) కింద ఇవ్వబడిన అర్థాలలో సరియైన దానిని గుర్తించి రాయండి.**

### **భవుడు    చంద్రుడు     ఇంద్రుడు**

### **జవాబు : చంద్రుడు**

### **23. ప్రక్షాళితంబైన \*పసిడి\* చట్టువము. గీ.ప.కు (ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో ఇవ్వబడింది) అర్థం రాయండి.**

### **జవాబు : బంగారం**

### **24. ఈ రాత్రి \*తమస్సు\* దట్టముగా అలముకొంది. గీ.ప. (ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో ఇవ్వబడింది)కు పర్యాయ పదాలను గుర్తించి రాయండి.**

### **అ) మంచు, మేఘాలు ఆ) గాలి, పొగ ఇ) చీకటి, అంధకారం ఈ) రాత్రి, పగలు**

### **జవాబు : చీకటి, అంధకారం**

### **25. ప్రతి ఒక్కరూ నివసించడానికి ఇల్లు అవసరము**

### **గృహమునకు దేవత గృహిణి. రవీంద్రుడు శాంతినికేతంలో నివసించాడు.**

### **పై వాక్యములలోని సమానార్థక పదాలను గుర్తించి వేరుగా రాయండి.**

### **జవాబు : గృహము = ఇల్లు, నికేతం**

### **26.  \*15 రోజుల\*  నుంచి చిలుక \*రెక్కలు\* విప్పుకుని ఎగురుట లేదు.**

### **గీ.ప.కు (ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో ఇవ్వబడింది) సరియైన నానార్థ పదాన్ని రాయండి.**

### **జవాబు : పక్షం**

### **27. చాలా రోజుల తరువాత మా \*గురువు\*  ను చూశాను.**

### **గీ.ప.కి (ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో ఇవ్వబడింది) వ్యుత్పత్తిని రాయండి.**

### **జవాబు : గురువు – అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే వాడు (ఉపాధ్యాయుడు)**

### **28. ‘ఆరోగ్యమే మహా \*భాగ్యం’\* అని పెద్దలు అంటారు.**

### **గీ.ప.కు (ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో ఇవ్వబడింది) సరియైన వికృతి పదాన్ని గుర్తించి రాయండి.**

### **బాగం    బాగ్గెం     బాగ్గెన్‌     బారం**

### **జవాబు : బాగ్గెం**

### **29.  \*చట్టాలు\* ఎన్ని చేసినా సమాజంలో మార్పురాదు. గీ.ప.కు (ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో ఇవ్వబడింది)ప్రకృతి పదం రాయండి.**

### **జవాబు : శాస్త్రాలు**

### **30. \*అంతరాత్మ\*  చెప్పినట్లుగా నడుచుకోవాలి. గీ.ప.ను (ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో ఇవ్వబడింది) విడదీసి రాయండి.**

### **జవాబు : అంతః + ఆత్మ**

### **31. తరిగొండ వెంగమాంబ గొప్ప \*భక్తురాలు.\* **

### **గీ.ప.కు (ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో ఇవ్వబడింది) సంధి పేరు రాయండి.**

### **జవాబు : రుగాగమ సంధి.**

### **32. చంద్రకాంతి భూమి, ఆకాశాలను కప్పేసింది.**

### **పై వాక్యంలో షష్టీ తత్సురుస సమాస పదాన్ని గుర్తించండి.**

### **జవాబు : చంద్రకాంతి**

### **33. దేశాభివృద్ధికి మనం  \*యథాశక్తి\*  కృషి చేయాలి.**

### **గీ.ప.కి. (ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో ఇవ్వబడింది) విగ్రహ వాక్యం రాయండి.**

### **జవాబు : శక్తి ఎంతో అంత.**

### **󠀁[సంస్కృతం పేపర్ బ్లూ ప్రింట్ (04S) ](https://drive.google.com/file/d/1C_EhsKPOt2l3xS9GJ_rNgRz4P6hsgx7O/view?usp=sharing)󠁿**

### **_󠀁[10TH CLASS TELUGU-1 MODEL PAPER (SET-2)](https://drive.google.com/file/d/1TvxgiGnnsHdJY9o_5P1PctKHh25PYv2h/view)󠁿_**

### _**󠀁[TELUGU PAPER-2 MODEL PAPER (SET-2)](https://drive.google.com/file/d/1PNLsWy13X8DfVKdOY4FFmh3zCs6CkLrN/view)󠁿**_

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
