73-services-in-all-post-office-common-service-centres-in-india

73-services-in-all-post-office-common-service-centres-in-india

Post Office: గుడ్ న్యూస్… పోస్ట్ ఆఫీస్ కామన్ సర్వీస్ సెంటర్లలో 73 సేవలు*

*®️మీరు కరెంట్ బిల్ కట్టాలా?

డీటీహెచ్ రీఛార్జ్ చేయాలా?

పాన్ కార్డుకు దరఖాస్తు చేయాలా?

పాస్ పోర్ట్ తీసుకోవాలా? ఇలా ఎలాంటి సేవలనైనా పోస్ట్ ఆఫీస్ కామన్ సర్వీస్ సెంటర్లలో పొందొచ్చు.

త్వరలోనే అన్ని పోస్ట్ ఆఫీసుల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఇ-గవర్నెన్స్‌పైన దృష్టి పెట్టిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ పోస్ట్ ఆఫీసుల్లో కామన్ సర్వీస్ సెంటర్లుగా మార్చి సరికొత్త సేవల్ని అందిస్తోంది.*

*®️అయితే అన్ని పోస్ట్ ఆఫీసుల్లోకి ఈ సేవలు ఇంకా అందుబాటులో రాలేదు.

దశలవారీగా పోస్ట్ ఆఫీసుల్లో ఈ సేవలు ప్రారంభమౌతాయి.

మీకు దగ్గర్లోని పోస్ట్ ఆఫీస్ కామన్ సర్వీస్ సెంటర్లలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్టైతే 73 రకాల సేవలు పొందొచ్చు*

*®️ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, పాన్ కార్డ్, పాస్ పోర్ట్ దరఖాస్తు, విద్యుత్ బిల్, డీటీహెచ్ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్, ఇన్స్యూరెన్స్ రెన్యువల్, ల్యాండ్ లైన్ నెంబర్ బిల్ పేమెంట్, బర్త్ సర్టిఫికెట్, ఐఆర్‌సీటీసీ బుకింగ్, బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్, ఫాస్ట్‌ట్యాగ్, ఐటీ రిటర్న్స్ లాంటి 73 రకాల సేవలు పొందొచ్చు.

ప్రస్తుతం ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో పరిమితంగా మాత్రమే సేవలు లభిస్తున్నాయి.

త్వరలో దేశంలోని అన్ని పోస్ట్ ఆఫీసుల్లో 73 సేవలు అందుబాటులోకి రానున్నాయి.*

error: Content is protected !!