academic-calender-2020-21-primary-classes-working-days-syllabus
academic-calender-2020-21-primary-classes-working-days-syllabus
SCHOOLS REOPEN ON SEPTEMBER 5TH, 2020
ఈ ఏడాది 181రోజులే బడి!*
*♦ప్రైమరీ స్కూళ్ల అకడమిక్ క్యాలెండర్ రెడీ*
*♦సెప్టెంబరు 5న పాఠశాలలు పునఃప్రారంభం*
2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రాథమిక పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ సిద్ధమైంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా సెప్టెంబరు 5న పాఠశాలలు తెరుచుకునే పక్షంలో అందుకు సన్నాహకంగా ఈ క్యాలెండర్ రూపొందించారు.
కరోనా పరిస్థితిని అంచనా వేసి మరో వారం, పది రోజుల్లో అకడమిక్ క్యాలెండర్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటిస్తుంది.
సన్నాహక క్యాలెండర్ ప్రకారం … వచ్చే నెల 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభిస్తారు.
సెప్టెంబరులో 21 రోజులు,
అక్టోబరులో 21 రోజులు,
నవంబరులో 24 రోజులు,
డిసెంబరులో 25/22 రోజులు,
జనవరిలో 20/23 రోజులు,
ఫిబ్రవరిలో 23 రోజులు,
మార్చిలో 25 రోజులు,
ఏప్రిల్‌లో 21 రోజులు పాఠశాలలు పనిచేస్తాయి. మొత్తం మీద 2022-21లో 181 పనిదినాలు ఉంటాయి.
*♦పరీక్షల ప్రణాళిక*:
*నిర్మాణాత్మక మూల్యాంకనం-1 పరీక్షలు అక్టోబరులో*,
*సంగ్రహణాత్మక మూల్యాంకనం-1 పరీక్షలు జనవరిలో*,
*నిర్మాణాత్మక మూల్యాంకనం-2 పరీక్షలు మార్చిలో*,
*సంగ్రహణాత్మక మూల్యాంకనం-2 పరీక్షలు ఏప్రిల్‌లో జరుగుతాయి*.
*సెలవుల ప్రణాళిక*:
*🔹దసరా 2.10.2020-26.10.2020*,
*🔹క్రిస్టమస్ 24.12.2020 – 28.12.2020*,
*🔹సంక్రాంతి 12.01.2021- 17.01.2021*,
*🔹వేసవిసెలవులు 24.04.2021-11.06.2021*
*♦కాలనిర్ణయ పట్టిక*:
1 నుంచి 5 తరగతులకు మొదటి పీరియడ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది.
సాయంత్రం 4 గంటల వరకు మొత్తం 8 పీరియడ్‌లు ఉంటాయి.
కాగా, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ క్లాస్-3, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ క్లాస్-4, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ క్లాస్-5లలో మూడేసి పాఠాలను తొలగించారు.
TOTAL NUMBER OF WORKING DAYS 180
jagananna-vidya-kanuka-kits-instructions-for-headmasters-meo’s-checklist
High-schools-academic-calender-time-table-holidays-2020-21
error: Content is protected !!