after-B.Tech-B.E-what-next-courss-complete-details

after-B.Tech-B.E-what-next-courss-complete-details

బీటెక్ అయిపోయి నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా.. ఈ సమాచారం మీకోసమే.

బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ(బీటెక్).. లక్షల మంది విద్యార్థుల కల.

ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో ధనవంతులే కాదు పేదింటి పిల్లలూ ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్నారు.

కాగా, బీటెక్ అనంతరం ఉద్యోగంలో స్థిరపడటం మంచిదా? ఉన్నత విద్య వైపు వెళ్లాలా?! పీజీ వైపు వెళ్తే ఎంటెక్, ఎంబీఏల్లో దేన్నెంచుకుంటే బెటర్.. ఇవేవీ కాకుండా స్టడీ అబ్రాడ్ సరైన నిర్ణయమా.. విద్యార్థులకు ఎదురయ్యే ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానమే.. ఈ ప్రత్యేక కథనం..

ఎటు వెళ్లాలి..
మన దేశంలో బీటెక్ ఫ్రెషర్స్‌ను పరిశ్రమలు, ఐటీ కంపెనీలు పెద్ద సంఖ్యలో నియమించుకొనే పరిస్థితి ఉంది. ఇంజనీరింగ్ అనంతరం కొంత మంది కొలువుల్లో చేరిపోతే… మరికొంత మంది ఉన్నత విద్య వైపు మొగ్గు చూపుతున్నారు. ఎంటెక్ చేయడం ద్వారా సంబంధిత స్పెషలైజేషన్‌లో అడ్వాన్స్‌డ్ పరిజ్ఞానం లభిస్తుంది.

తద్వారా ప్లేస్‌మెంట్స్, ప్యాకేజీల విషయంలో అదనపు ప్రయోజనం ఉంటుంది. కొలువులో స్థిరపడాలనే నిర్ణయానికి వచ్చిన వారు తొలి ప్రాధాన్యంగా పీఎస్‌యూ కొలువులను లక్ష్యంగా పెట్టుకోవాలి. దీనితర్వాత స్థానంలో ఎంబీఏను పరిగణలోకి తీసుకోవచ్చు.

వాస్తవానికి ఎంటెక్‌తో పోల్చితే ఎంబీఏతో విభిన్న, విస్తృత అవకాశాలు లభిస్తాయనే అభిప్రాయం ఉంది. కానీ, ఇంజనీరింగ్‌పై నిజమైన ఆసక్తి ఉన్న వారు ఎంటెక్ వైపు వెళ్లడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

ఉద్యోగ మార్గాలు..

  1. బీటెక్ అర్హత అనేక ఉద్యోగావకాశాలకు ద్వారం తెరుస్తుంది. ఫైనలియర్‌లో ఉన్నప్పుడే ప్రముఖ కంపెనీలన్నీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహించి.. ఆఫర్ లెటర్స్ అందిస్తున్నాయి. అలాగే బీటెక్ అనంతరం గేట్‌లో ప్రతిభ చూపి.. పీఎస్‌యూల్లో కొలువును సొంతం చేసుకోవచ్చు. యూపీఎస్సీ నిర్వహించే ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్, రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నిర్వహించే పరీక్షలతో ప్రభుత్వ కొలువులు దక్కించుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారు యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకూ హాజరవ్వొచ్చు.

  2. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి త్రివిధ దళాల్లోనూ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. దేశానికి సేవ చేసే అవకాశంతోపాటు సమాజంలో గౌరవం, ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తుండటంతో యువతకు ఇటీవల కాలంలో త్రివిధ దళాల కొలువులపై ఆసక్తి పెరుగుతోంది.

  3. ఇంజనీరింగ్ విద్యార్థులు సీడీఎస్‌ఈ, ఎఫ్‌క్యాట్ వంటి పరీక్షల ద్వారా డిఫెన్‌‌స సర్వీసుల్లో కెరీర్ సొంతం చేసుకోవచ్చు.

ప్రభుత్వ రంగ సంస్థలు గేట్ స్కోర్ ఆధారంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైనీ, ట్రైనీ ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నాయి.

ఆయా పీఎస్‌యూలు నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు దరఖాస్తు చేసుకొని.. ఎంపిక ప్రక్రియలో నెగ్గితే ఉద్యోగం ఖాయం అవుతుంది. ఆయా కొలువుల వేతనాలు, కెరీర్ అవకాశాలు సైతం ఆకర్షణీయంగా ఉంటున్నాయి.

నైపుణ్యం కొద్దీ కొలువు..
ప్రస్తుత పరిస్థితుల్లో టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌లో చదువు పూర్తిచేసిన విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ప్రైవేట్ రంగంలో కార్పొరేట్ ఉద్యోగాలు లభిస్తున్నాయి. కాని ప్లేస్‌మెంట్స్‌కు అవకాశం లేని కాలేజీల్లో బీటెక్ చదివిన విద్యార్థులు టాప్ కంపెనీల్లో ఉద్యోగం దక్కించుకోవాలంటే.. జాబ్ మార్కెట్‌కు అవసరమైన స్కిల్స్ సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. డేటా అనలిటిక్స్, బిగ్‌డేటా, క్లౌడ్‌ కంప్యూటింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ వంటి నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ద్వారా ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చు.

TEACHERS TRANSFERS SENIORITY LISTS & VACANCIES FOR ALL DISTRICTS

GOOGLE INTRNSHIP FOR B.Tech STUDENTS IN HYDERABAD & BENGULURU CITIES CLICK HERE

క్లౌడ్ కంప్యూటింగ్ ప్రారంభంలో కొన్ని ఐటీ సంస్థలకే పరిమితమైనా.. ఇప్పుడు సర్వత్రా విస్తరించింది.

ఐటీ సంస్థలన్నీ తమ క్లయింట్‌లకు సులువైన మార్గంలో సమర్థంగా సేవలందించేందుకు క్లౌడ్ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి.

బీటెక్ అనంతరం క్లౌడ్ కంప్యూటింగ్‌లో శిక్షణ, సర్టిఫికేషన్స్ వంటివి పూర్తి చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవచ్చు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌..
పనిలో మానవ ప్రమేయాన్ని తగ్గించి రోబోలు, వర్చువల్ టెక్నాలజీల ద్వారా కార్యకలాపాలు వేగంగా నిర్వహించాలని ఐటీ సంస్థలు భావిస్తున్నాయి.

తద్వారా ఆర్థిక వ్యయం తగ్గించుకొని క్లయింట్లకు సత్వర సేవలందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి బీటెక్ విద్యార్థులు బ్రాంచ్‌తో సంబంధం లేకుండా.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ నైపుణ్యాలు పెంపొందించుకుంటే జాబ్ మార్కెట్‌లో అవకాశాలు దక్కించుకోవచ్చు.

డేటా అనలిటిక్స్, బిగ్ డేటా..
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు దృష్టిపెట్టాల్సిన మరో విభాగం.. డేటా అనలిటిక్స్, బిగ్ డేటా. ప్రస్తుతం కంపెనీలు అన్నీ వినియోగదారుల అభిరుచులు, ఆసక్తులకు అనుగుణంగా ఉత్పత్తులు, సేవలనందించాలనే ప్రయత్నాల్లో ఉన్నాయి. అందుకోసం డేటా అనలిటిక్స్, బిగ్ డేటా టూల్స్‌ను వినియోగిస్తున్నాయి.

కాబట్టి ఆయా నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు.

SMART QR CODE EHS HEALTH CARDS COMPLETE DETAILS

error: Content is protected !!