all-leaves-for-ap-teachers-with-government-orders

all-leaves-for-ap-teachers-with-government-orders

ప్రత్యేక ఆకస్మిక సెలవుల(Spl.Casual Leave)

ఫండమెంటల్ రూలు-85 రూలింగ్ 4 లోని అనుబంధం-VII ఐటమ్ 11 లో విశదీకరించారు.

ఉద్యోగి వ్యక్తిగత ప్రయోజనాలతో సంబంధo లేకుండా ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేయవచ్చు.

ఈ ప్రత్యేక ఆకస్మిక సెలవు సాధారణ, యాదృచ్చిక సెలవు 15 రోజులకు అదనంగా మంజూరుచేయవచ్చు.

క్యాలెండర్ సం॥లో 7 రోజులకు మించకుండా ప్రత్యేక సాధారణ సెలవు వాడుకోవచ్చు.

(G.O.Ms.No.47,Fin తేది:19-02-1965)

సాధారణ సెలవు నిల్వయున్నపటికి Spl.CL వాడుకోవచ్చు. Spl.CL ఇతర సాధారణ సెలవుదినాలతో కలిపి 10 రోజులకు మించకుండా వాడుకోవాలి.

రక్తదానం చేసిన ఉద్యోగికి ఒకరోజు Spl.CL ఇవ్వబడుతుంది.

(G.O.Ms.No.137 M&H తేది:23-2-1984)

పురుష ఉద్యోగులు వేసక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి ఆరు రోజులకు (6) మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.

ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల ఆరు(6) రోజులు మంజూరుచేయవచ్చు.

(G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968)

(G.O.Ms.No.257 F&P తేది:05-01-1981)

మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమి  ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి పధ్నాలుగు రోజులకు (14)మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.

ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల పద్నాలుగు(14) రోజులు మంజూరుచేయవచ్చు.

(G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968)

(G.O.Ms.No.124 F&P తేది:13-04-1982)

కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స భార్య చేయించుకున్నచో ఆమెకు సహాయం చేయుటకు ఉద్యోగి అయిన భర్తకు ఏడు(7) రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.

(G.O.Ms.No.802 M&H తేది:21-04-1972)

మహిళా ఉపాధ్యాయులు గర్భనిరోధక సాధనం(LOOP) అమర్చుకున్నరోజు ఒక(1) రోజు ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.

(G.O.Ms.No.128 F&P తేది:13-04-1982)

ఇద్దరికంటే తక్కువ పిల్లలున్నప్పుడు,ఆపరేషన్ తరువాత మగ, ఆడ పిల్లలందరూ చనిపోయినపుడు రీకానలైజేషన్ చేయించుకునే మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే ఆమేరకు మంజూరుచేస్తారు.

(G.O.Ms.No.102 M&H తేది:19-02-1981)

మహిళా ఉద్యోగి హిస్టరెక్టమి ఆపరేషన్(గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫారసుమేరకు 45 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.

(G.O.Ms.No.52 F&P తేది:01-04-2011)

CHILD CARE LEAVE DETAILS, APPLICATION FORM & G.Os

COMPASSIONATE RULES కారుణ్య నియామకాల వివరణ , అప్లికేషన్స్, అవసరమైన  డాక్యుమెంట్స్ G.Os

మహిళా ఉద్యోగులు గర్భవిచ్చితి(Medical Termination of Pragnancy) తర్వాత Salpingectomy(గర్భాశయనాళo తొలగింపు) ఆపరేషన్ చేయించుకున్నచో సందర్భంలో పద్నాలుగు(14) రోజులకు మించకుండా ప్రత్యేక ఆకస్మిక సెలవు పొందవచ్చు.

(G.O.Ms.No.275 F&P తేది:15-05-1981)

చట్టబద్దంగా గాని,అప్రయత్నంగా గాని గర్భస్రావం(Abortion) జరిగినచో 6 వారాల సెలవు మంజూరుచేయబడును.

(G.O.Ms.No.762 M&H తేది:11-08-1976)

పురుష ఉద్యోగులకు భార్య ప్రసవించినపుడు 15 రోజుల పితృత్వ సెలవు మంజూరుచేస్తారు.

(G.O.Ms.No.231 తేది:16-09-2005)

ప్రభుత్వ గుర్తింపు కలిగి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం గల ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలకు చెందిన జిల్లా ప్రధాన బాధ్యులకు సంఘ కార్యకలాపములకు  హాజరగు నిమిత్తం అదనంగా 21 రోజుల స్పెషల్ క్యాజువల్ సెలవు మంజూరు సదుపాయం కలదు.

(G.O.Ms.No.470 GAD తేది:16-09-1994)

(G.O.Ms.No.1036 GAD తేది:29-11-1995).

SURRENDER LEAVES & EARNED LEAVES DETAILS CLICK HERE

ALL TYPE OF LEAVE RULES CLICK HERE

ALL RETIREMENT BENIFITS FOR EMPLOYEEES

USEFUL FOR TEACHERS ALL TYPE OF DDO COVERING LETTERS & APPLICATIONS, G.Os

error: Content is protected !!