all-Schools-Admission-Guidelines-Academic-Year-2020-21-Memo-Rc-155
సెప్టెంబరు 5 నుంచి పాఠశాలల పునఃప్రారంభం?*
*రాష్ట్రంలో సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించనున్నట్లు కేంద్రానికి అధికారులు విన్నవించారు.*
*ఈ నెల 15న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాఠశాలల సురక్షిత ప్రణాళికపై కేంద్ర ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించింది.*
*ఈ సందర్భంగా పాఠశాలలను పునఃప్రారంభించే సమయాలను తెలపాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది.*
*వీడియో కాన్ఫరెన్సులో వెల్లడించిన వివరాల్లో ఏమైనా మార్పులు ఉంటే తెలపాలని శుక్రవారం కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఉత్తర్వులు వచ్చాయి.*
*కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నందున మొదట ప్రకటించినట్లు రాష్ట్రంలో ఆగస్టు 3 నుంచి పాఠశాలల పునఃప్రారంభం ఉండదు.*
స్కూళ్లలో అడ్మిషన్లు చేపట్టండి
విద్యార్థులు రావాల్సిన పనిలేదు
తల్లిదండ్రుల సమ్మతుంటే చాలు
9వ తరగతి వరకు అంతా ప్రమోట్
వలస కూలీల పిల్లలకు టీసీ అక్కర్లేదు
పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
ప్రభుత్వ స్కూళ్లలో 2020-21 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాలని పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీర భద్రుడు ఆదేశాలు జారీ చేశారు.
ప్రాథమిక, ప్రాథమి కోన్నత, ఉన్నత పాఠశాలల్లో కొత్త అడ్మిషన్ల ప్రక్రియను మండల విద్యాశాఖాధికారులు (ఎంఈఓ), ఉప విద్యాశాఖాధికారులు (డీవైఈఓ) పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈఓ), ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు (ఆర్జేడీ) కమిషనర్ సర్క్యులర్లు జారీ చేశారు.
ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు అంతా పాస్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించిందని, ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన ప్రమోషన్ జాబితాలను రూపొందించాలన్నారు.
తదుపరి తరగతిలో వారి పేర్లను నమోదు చేయాలని సూచించారు.
ఇక ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదివిన, యూపీలో ఏడో తరగతి చదివిన విద్యార్థులను యూపీ లేదా హైస్కూళ్లలో చేర్చేందుకు తల్లిదండ్రుల సమ్మతి తీసుకుంటే సరిపోతుందన్నారు.
ఆరు, ఎనిమిది తరగతులలో చేరేందుకు విద్యార్థులు స్కూళ్లకు రావాల్సిన అవసరం లేదని, వారి తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రం తీసుకుంటే సరిపోతుందన్నారు.
వరు ఏ స్కూల్ లో చేరాలను కుంటున్నారో ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం)తెలుసుకుని, ఆ వివరాలను సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు తెలపాలన్నారు.
ప్రక్రియను ప్రాథమిక స్కూళ్లలో ఎంఈఓ, హైస్కూళ్లలో డీవైఈఓ పర్యవేక్షించాలన్నారు.
వలస కూలీల పిల్లలకు ఎలాంటి పత్రాలు లేకున్నా అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించారు.
వారి నుంచి ఎలాంటి టీసీలను అడగవద్దన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం హెచ్ఎంలు టీసీ, స్టడీ సర్టిఫికెట్లను అడగవద్దని స్పష్టం చేశారు.
ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బా బాలికా విద్యాల యాలలో ఆన్లైన్ విధానంలో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీలు ఉన్న ఏడు, ఎనిమిది తరగతులు, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర డైరెక్టర్ కూడా అయిన చినవీరభద్రుడు తెలిపారు.
ఈ నెల 20 నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కేజీబీవీలలో టెన్త్ చదివిన వారు సైతం దరఖాస్తు చేసుకోవాలన్నారు.
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,

