all-schools-reopen-september-1st-central-government-guidelines
*🌷సెప్టెంబర్ 1 నుంచి టెన్త్, ఇంటర్, డిగ్రీ క్లాసులు ప్రారంభం.. 1-9 వరకు తరగతులు ఎప్పటి నుంచి అంటే!.. కేంద్రం మార్గదర్శకాలు రెడీ🌷*
*🌴స్కూళ్లు, కాలేజీలు ఎప్పుడు తెరుస్తారనే దానిపైనే అందరి దృష్టిపడింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 14 మధ్య దశల వారీగా పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలను తిరిగి తెరిచే ప్రణాళికను కేంద్రం రూపొందించింది.*
*🌴కోవిడ్ -19 సమయంలో విద్యాసంస్థలు తెరిచే ప్రణాళిక పద్ధతులపై ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ నేతృత్వంలోని మంత్రుల బృందం చర్చించింది.*
*🌴ఆగస్టు 31 తర్వాత మిగిలిన కార్యకలాపాలను తెరవాలని రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేయనుంది.*
*🌴 పాఠశాలలు, విద్యా సంస్థలకు బ్రాడ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP) జారీ చేసింది. పాఠశాల విద్యా శాఖ జూలైలో నిర్వహించిన సమగ్ర సర్వేలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించింది.*
*🌴మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిశీలించిన మార్గదర్శకాల ప్రకారం.. పాఠశాలలను తెరిచి దశలవారీగా నిర్వహించాలని సిఫార్సు చేస్తున్నాయి.*
*🌷మొదటి 15 రోజులు, 10 నుంచి 12వ తరగతి విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాలి.. తరగతిలోని వివిధ విభాగాలు పాఠశాలకు హాజరు కావడానికి నిర్దిష్ట రోజులను ప్రకటించనున్నారు.*
*🌴పాఠశాలలో, 10వ తరగతికి 4 విభాగాలు ఉంటే A,C విభాగాలలో సగం మంది విద్యార్థులు నిర్దిష్ట రోజులలో, మిగిలినవి ఇతర రోజులలో వస్తారు.*
*🌴ఫిజికల్ అంటెండెన్స్ 5-6 నుంచి 2-3 గంటల వరకు గంటల సంఖ్య పరిమితం చేస్తున్నారు.అన్ని పాఠశాలలు షిప్టుల వారీగా నడుస్తాయి.*
*🌴 ఉదయం 8 నుండి 11 వరకు ఒక షిప్ట్ నడిస్తే.. మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు ఒక షిప్ట్ నడుస్తుంది.. ఇక శానిటైజేషన్ కోసం ఒక గంట విరామం తీసుకుంటారు.*
*🌴బోధనా సిబ్బంది, విద్యార్థుల 33% సామర్థ్యంతో పాఠశాలలు నడపాలని సూచించారు.*
*🌴ప్రీ-ప్రైమరీ లేదా ప్రైమరీ స్కూల్ విద్యార్థులను పాఠశాలకు తిరిగి రావాలని సూచిస్తున్నారు.*
*🌴ఆన్‌లైన్ తరగతులతో కొనసాగడానికి ప్రభుత్వం అనుకూలంగా లేదని కార్యదర్శుల బృందంలోని చర్చలు అభిప్రాయపడ్డారు.*
*🌴10 నుండి 12వ తరగతి వరకు భౌతిక తరగతులను ప్రవేశపెట్టాలని చిస్తున్నారు.*
*🌴6 నుంచి 9వ తరగతి వరకు పరిమితం చేసినగంటలతో పాఠశాలలు భౌతిక పాఠశాల విద్యను ప్రారంభించాలని సూచించారు.*
*🌴 ఒక పాఠశాలకు మల్టీపుల్ విభాగాలు ఉంటే, తరగతులు విస్తరించాలని పాఠశాలలకు సూచిస్తున్నారు.*
*🌴సీనియర్ విద్యార్థులను విస్తరించడానికి ప్రాథమిక విభాగాన్ని ఉపయోగించాలని సూచిస్తోంది.*
*🌷 స్విట్జర్లాండ్ వంటి దేశాలు పిల్లలను సురక్షితంగా పాఠశాలకు తీసుకువచ్చిన విధానాన్ని అధ్యయనం చేస్తున్నామని, ఇలాంటి మోడల్ భారతదేశంలో సక్సెస్ అవుతుందని అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు.*
*🌴 ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కొండ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాఠశాలలు, విద్యా సంస్థలను తిరిగి తెరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి.*