Amaravati-Balotsvam-starts-January-2nd-2019-Vijayawada-బాలోత్సవం
జనవరి 2, 3, 4వ తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మూడు రోజులు కార్యక్రమాలు జరుగుతాయి.
విజయవాడ పటమటలోని చిగురుపాటి శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రాంగణంలో జరుగును.
బాలోత్సవానికి 200 పాఠశాలలు..*
*♦ఆరు వేల మంది విద్యార్థులు*
*♦చిన్నారుల ఆలోచనల ప్రపంచం*
*♦జనవరి 2, 3, 4వ తేదీల్లో నిర్వహణ*
*?చిన్నారులకు చదువొక్కటే ప్రధానం కాదు.. వారి పరిపూర్ణ మానసిక వికాసానికి అవసరమైన ఆటలు, పాటలు, కళలు ఎంతో అవసరం. భాషపై పట్టు సాధించడం.. నైతిక విలువలను పెంపొందించుకోవడం.. వారిలో దాగి ఉన్న సహజసిద్ధ నైపుణ్యాలను వెలికితీసేలా విద్యను అందించడం.. వంటివి చాలా అవసరం. కానీ.. ప్రస్తుత విద్యావిధానంలో ఈ విషయాన్ని విస్మరిస్తుండడం ఆందోళనకర పరిణామం. మార్కులు.. ర్యాంకుల గోలలో పడి.. చిన్నారుల బంగారు భవిష్యత్తును తీవ్ర ఒత్తిడిమయం చేస్తున్న సమయమిది. అందుకే.. చిన్నారుల్లో దాగి ఉండే నిగూఢ నైపుణ్యాలను వెలికితీసేందుకు.. వారిలో విద్యపై ఆసక్తిని పెంచేందుకు అమరావతి రాజధాని పరిధిలోని పలువురు విద్యా, సాహితీవేత్తలు, ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక కార్యక్రమానికి రూపకల్పన చేశారు.*
[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
ఏడాదికోసారి విద్యార్థుల్లో ఉండే ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలను నిర్వహించి.. ప్రోత్సహించాలని నిర్ణయించారు. ప్రైవేటు, కార్పొరేటు, ప్రభుత్వ, నగరపాలక సంస్థ.. పాఠశాలలన్నింటిలో చదివే విద్యార్థులందరినీ.. ఒక్కచోటికి చేర్చేలా.. ‘అమరావతి బాలోత్సవం’ పేరిట గత ఏడాది నుంచి పిల్లల పండుగను నిర్వహిస్తున్నారు. అమరావతి బాలోత్సవం 2018ను జనవరి 2, 3, 4వ తేదీల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గత ఏడాది తొలిసారి నిర్వహించిన అమరావతి బాలోత్సవం 2017లో.. సీఆర్డీఏ పరిధిలోని 143 పాఠశాలల నుంచి 49 విభాగాలలో నాలుగు వేల మంది పిల్లలు పోటీపడ్డారు. ఈసారి 200 పాఠశాలల నుంచి ఆరు వేల మంది పిల్లలు నమోదు చేసుకున్నారు.
ఒకేసారి ఆరు వేదికలపై
జనవరి 2, 3, 4వ తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మూడు రోజులు కార్యక్రమాలు జరుగుతాయి. విజయవాడ పటమటలోని చిగురుపాటి శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రాంగణంలో జరిగే ఈ పిల్లల పండుగలో.. ఒకేసారి ఆరు వేదికలపై చిన్నారులకు సాంస్కృతిక విభాగంలో పోటీలు జరుగుతాయి. మరో 15 గదుల్లో అకడమిక్ ఈవెంట్ల పోటీలు నిర్వహిస్తారు. రోజూ ఉదయం వచ్చి పాల్గొని సాయంత్రం ఇళ్లకు వెళ్లిపోయేలా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆరు వేల మంది పిల్లలు, వారిని తీసుకొచ్చే గురువులు, న్యాయనిర్ణేతలు అందరికీ మూడు రోజులు అల్పాహారం, భోజనం ఉచితంగా అందిస్తున్నారు.
విద్యార్థుల్లో తారతమ్యాలు లేకుండా..
చదువు ఒక్కటే ధ్యేయంగా పెట్టుకుని అన్ని పాఠశాలల్లోనూ విద్యావిధానం సాగుతోంది. అందుకే అన్ని రంగాల్లోనూ పిల్లలు ఎదగాలంటే.. వారిలోని సహజసిద్ధ నైపుణ్యాలను ప్రోత్సహించాలి. ఆ ఉద్దేశంతోనే అమరావతి బాలోత్సవం కమిటీ ఆవిర్భవించింది. పిల్లలంతా సమానమేననే భావన పెంపొందించడమే బాలోత్సవం ప్రధాన ఉద్దేశం. ఈ పిల్లల పండుగలోని పోటీల్లో పాల్గొనే విద్యార్థులెవరూ వారి పాఠశాల దుస్తుల్లో రాకూడదు. వారి పేరు, పాఠశాల, ఊరి పేరు కూడా చెప్పకూడదు. పోటీల్లో పాల్గొనే ప్రతి విద్యార్థికి ఓ కోడ్నంబరు ఇస్తారు. దానిని మాత్రమే చెప్పాల్సి ఉంటుంది.
Amaravati-Balotsvam-starts-January-2nd-2019-Vijayawada-బాలోత్సవం
నాలుగు విభాగాలుగా పోటీలు..*
ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకూ విద్యార్థులను నాలుగు విభాగాలుగా చేసి పోటీలు నిర్వహిస్తున్నారు. ఎల్కేజీ, యూకేజీ, ఒకటో తరగతి విద్యార్థులకు బేబీ జూనియర్ల విభాగంలో పోటీలు పెడుతున్నారు. 2, 3, 4వ తరగతి విద్యార్థులు సబ్జూనియర్ల విభాగంలో పోటీ పడతారు. ఈ రెండు విభాగాలకూ ఫ్యాన్సీ డ్రెస్, రైమ్స్, కథలు చెప్పడం మూడు రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. 5, 6, 7వ తరగతి వాళ్లు జూనియర్ల విభాగంలో, 8, 9, 10 విద్యార్థులు సీనియర్ల విభాగంలో పోటీ పడతారు. ఈ రెండు విభాగాలకూ అకడమిక్ ఈవెంట్స్‌లో భాగంగా.. చిత్రలేఖనం, వ్యాసరచన (తెలుగు, ఆంగ్లం), తెలుగులో మాట్లాడడం, కథారచన, వక్తృత్వం (తెలుగు, ఆంగ్లం), కార్టూన్, స్పెల్‌బి, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, సైన్స్ ఎగ్జిబిషన్, వార్తా రచన, పద్యం భావం, మట్టితో బొమ్మలు, మెమొరి టెస్ట్, క్విజ్, కథా విశ్లేషణ, కవితా రచన పోటీలను వేర్వేరుగా నిర్వహిస్తారు. కల్చరల్ విభాగంలో.. ఏకపాత్రాభినయం, విచిత్ర వేషధారణ, మూకాభినయం, షార్ట్‌ఫిల్మ్ విశ్లేషణ, క్లాసికల్ డాన్స్, మిమిక్రీ, దేశభక్తి గీతాలాపన, జానపద నృత్యం, లఘునాటిక బృందం, కోలాటం పోటీలను నిర్వహిస్తున్నారు.
[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,
