amazon-great-indian-festival-sbi-offer-10&-from-September-29th

amazon-great-indian-festival-sbi-offer-10&-from-September-29th

ఎస్‌బీఐ కార్డు ఉందా? అమెజాన్ సేల్‌లో రూ.10,000 బెనిఫిట్స్ పొందండి ఇలా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్, క్రెడిట్ కార్డులతో ఏం కొన్నా 10% ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు.

కనీసం రూ.3,000 షాపింగ్ చేయాల్సి ఉంటుంది.

మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉందా?

అయితే మీకు శుభవార్త. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఈ సేల్ సెప్టెంబర్ 28న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది.

ఈ సేల్‌లో మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్, క్రెడిట్ కార్డులతో ఏం కొన్నా 10% ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు.

కనీసం రూ.3,000 షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఈఎంఐలపైనా ఈ ఆఫర్స్ పొందొచ్చు.

రూ.50,000 లోపు షాపింగ్ చేస్తే ఒక కార్డుపై గరిష్టంగా రూ.2,000 మాత్రమే తగ్గింపు లభిస్తుంది.

రూ.50,000 కన్నా ఎక్కువ షాపింగ్ చేస్తే ఆ తర్వాత ప్రతీ రూ.10,000 అదనంగా బోనస్ ఆఫర్ కింద రూ.2,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

AMAZON OFFERS WITH SBI CARD DETAILS

Amazon-SBI offers: అమెజాన్ సేల్‌లో ఎస్‌బీఐ ఆఫర్స్ పొందండి ఇలా…

ఉదాహరణకు మీరు రూ.5,000 షాపింగ్ చేస్తే 10% ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ రూ.500 తగ్గింపు లభిస్తుంది.
మీరు రూ.35,000 షాపింగ్ చేస్తే ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ రూ.2,000 మాత్రమే లభిస్తుంది.

మీరు రూ.80,000 షాపింగ్ చేస్తే ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ రూ.2,000 + ఎస్‌బీఐ బోనస్ క్యాష్‌బ్యాక్ రూ.6,000 లభిస్తుంది.
మీరు రూ.1,10,000 షాపింగ్ చేస్తే ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ రూ.2,000 + ఎస్‌బీఐ బోనస్ క్యాష్‌బ్యాక్ రూ.8,000 లభిస్తుంది.

రూ.50,000 కన్నా ఎక్కువ షాపింగ్ చేసేవాళ్లు రూ.8,000 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
అంటే ఒక కార్డుపై మీరు గరిష్టంగా రూ.2,000 తగ్గింపుతో పాటు రూ.8,000 క్యాష్‌బ్యాక్ కలిపి మొత్తం రూ.10,000 బెనిఫిట్స్ పొందొచ్చు.
మీరు ఒకవేళ ఏవైనా ఆర్డర్స్ క్యాన్సిల్ చేసినా, రిటర్న్ చేసినా, తిరస్కరించిన ఈ ఆఫర్ వర్తించదు.
మీరు వస్తువు కొనే ముందే ఈ ఆఫర్ వర్తిస్తుందో లేదో ఓసారి సరిచూసుకోవాలి.
ఎస్‌బీఐ డెబిట్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌కు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్ వర్తించదు.
క్యాష్‌బ్యాక్ 2020 జనవరి 5 లోగా మీ బ్యాంక్ అకౌంట్ లేదా కార్డ్ స్టేట్‌మెంట్‌లో క్రెడిట్ అవుతుంది.

అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందడి మొదలైంది. అక్టోబర్ 4 వరకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరగనుంది.

ఈ సేల్‌లో స్మార్ట్‌‌ఫోన్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్లపై 40% వరకు డిస్కౌంట్ పొందొచ్చు, సాంసంగ్, రియల్‌మీ, ఒప్పో, హానర్ లాంటి బ్రాండ్ల మొబైల్స్‌పై భారీ ఆఫర్లున్నాయి. 

OFFERS ON SBI CREDIT/DEBIT CARDS DETAILS

AMAZON OFFERS WITH SBI CARD DETAILS

error: Content is protected !!