గ్యాస్ బుక్ చేసుకునేవారికి గుడ్ న్యూస్.. అదిరిపోయే క్యాష్‌బ్యాక్..!
గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేవారికి గుడ్ న్యూస్. ఇప్పటివరకు ఫోన్ కాల్, ఆన్లైన్, పేటీఏం, వాట్సాప్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకునే సౌలభ్యం ఉండగా…
Gas Cylinder Booking: గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేవారికి గుడ్ న్యూస్.
ఇప్పటివరకు ఫోన్ కాల్, ఆన్లైన్, పేటీఏం, వాట్సాప్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకునే సౌలభ్యం ఉండగా… ఇప్పుడు తాజాగా వీటితో పాటు మరో కొత్త ఆప్షన్ వినియోగదారులకు వెసులుబాటులోకి వచ్చింది.
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా ఈజీగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు.
ఇండేన్, భారత్, హెచ్‌పీ గ్యాస్ సిలిండర్లను అమెజాన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా దీనికి క్యాష్‌బ్యాక్ కూడా పొందే ఛాన్స్ ఉంది.
మొదటిసారి బుక్ చేసుకున్నవారికే ఈ సౌకర్యం ఉంటుంది.
ఆగస్ట్ 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండగా.. తొలిసారి అమెజాన్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకున్నవారు రూ.50 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
అమెజాన్ పే ద్వారా బిల్లు చెల్లిస్తే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
అమెజాన్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకోండిలా…
మొదటిగా అమెజాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
ఆ తర్వాత అమెజాన్ పే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
నెక్స్ట్ రీచార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ బటన్‌పై నొక్కాలి.
అక్కడ ఎల్‌పీజీ సిలిండర్‌పై క్లిక్ చేసి గ్యాస్ ఏజెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి.. బిల్లు చెల్లించాలి.