amazon-prime-netflix-hotstar-services-for-free-on-all-telecom-providers

amazon-prime-netflix-hotstar-services-for-free-on-all-telecom-providers

సినిమాలు చూడాలా? అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5 ఫ్రీగా పొందండి ఇలా

కరోనా వైరస్ లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. మరి మీకు ఇంట్లో బోర్ కొడుతోందా?

అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూడాలనుకుంటున్నారా?

మీ మొబైల్ కనెక్షన్‌ను బట్టి ఈ సర్వీసుల్ని ఉచితంగా పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

మీరు అమెజాన్ ప్రైమ్‌లో సినిమాలు చూస్తుంటారా?

నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌కు సబ్‌స్క్రైబ్ చేశారా?

ఇలాంటి ఓటీటీ సర్వీసులకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగా యాక్సెస్ చేసే అవకాశం ఉందని మీకు తెలుసా? ఈ విషయం తెలిస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు

హాట్‌‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ కోసం ఏడాదికి రూ.365 చెల్లించాలి.

ఒకవేళ హాట్‌స్టార్ ప్రీమియం అయితే నెలకు రూ.299, ఏడాదికి రూ.999 చెల్లించాలి.

అమెజాన్ ప్రైమ్‌కు నెలకు రూ.129, ఏడాదికి రూ.999 ఛార్జీలు తప్పవు.

నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ రూ.499 నుంచి ప్రారంభమవుతుంది

ఇలా జీ5, సోనీ లివ్, సన్ నెక్స్‌ట్ లాంటి ఓటీటీ సర్వీసులన్నింటికీ ఛార్జీలు ఉంటాయి.

అయితే మీరు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 లాంటి ఓటీటీ సర్వీసుల్ని ఫ్రీగా పొందాలనుకుంటే మీ మొబైల్ ప్లాన్స్ మార్చుకుంటే సరిపోతుంది

ONLINE WEBSITE FOR IT STUDENTS

ONLINE FEE COURSES AT HOME CLICK HERE

టెలికాం కంపెనీలు కొన్ని రీఛార్జ్ ప్లాన్స్‌పై ఓటీటీ సేవల్ని ఉచితంగా అందిస్తున్నాయి.

కొన్ని కంపెనీలు పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌పై ఓటీటీ సేవల్ని ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాయి

Reliance Jio: మీరు రిలయెన్స్ జియో ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌ పెయిడ్ ప్లాన్ తీసుకుంటే జియో టీవీ, జియో సినిమా ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు.

జియో టీవీ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో ఉంది.

ఇందులో 500 లైవ్ ఛానెల్స్, 60 హెచ్‌డీ ఛానెల్స్ చూడొచ్చు.

అన్ని భారతీయ భాషల్లో ఛానెల్స్ ఇందులో యాక్సెస్ చేయొచ్చు.

మ్యూజిక్, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, న్యూస్ ఇలా ఎవరికి కావాల్సిన కంటెంట్ వారికి ఉంటుంది

Reliance Jio: జియో సినిమా యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ప్లాట్‌ఫామ్స్‌లో ఉపయోగించుకోవచ్చు. జియో సినిమాలో సన్‌ నెక్స్‌ట్ కంటెంట్ కూడా లభిస్తోంది

Airtel: ఎయిర్‌టెల్ కూడా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. పోస్ట్‌పెయిడ్ యూజర్లకు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ రివార్డ్స్‌లో భాగంగా ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం వీడియో స్ట్రీమింగ్ యాప్, జీ5, ప్రైమ్ వీడియో లాంటి సేవల్ని అందిస్తోంది. రూ.249 ప్రీపెయిడ్ రీఛార్జ్ పైన కూడా ఎయిర్‌టెల్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ ఉంది

Airtel: ఎయిర్‌టెల్‌లో రూ.499 కన్నా ఎక్కువ ప్లాన్స్ తీసుకునేవారికి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఏడాది ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్, జీ5 ప్రీమియం కంటెంట్ పొందొచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో 10,000 పైగా సినిమాలు ఉన్నాయి. జీ5, హంగామా, ఎరోస్ నౌవ్, హుక్, షేర్ ఇట్, యూట్యూబ్ ప్రీమియం కంటెంట్ ఇందులో ఉంటుంది

WHAT IS LOCK DOWN? PUBLIC DOS AND DONT’S READ

Airtel: ఎయిర్‌టెల్ ఎక్స్‌‌స్ట్రీమ్ సబ్‌స్క్రిప్షన్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ.129 నుంచి ప్రారంభమౌతాయి. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ అందించే ప్లాన్స్ రూ.349 నుంచి ప్రారభమవుతాయి

Vodafone: వొడాఫోన్ కూడా రూ.499 కన్నా ఎక్కువ ప్లాన్‌పై అమెజాన్ ప్రైమ్, వొడాఫోన్ ప్లే, జీ5 సేవల్ని ఉచితంగా అందిస్తోంది. నెలకు రూ.999 వొడాఫోన్ రెడ్ఎక్స్ ప్రీమియం పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ కూడా పొందొచ్చు. అన్ని వొడాఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో వొడాఫోన్ ప్లే, జీ5 సబ్‌స్క్రిప్షన్స్ ఉన్నాయి

Vodafone: వొడాఫోన్ ప్లే యాప్‌లో 450 లైవ్ టీవీ ఛానెళ్లు, 15,000 పైగా మూవీస్ చూడొచ్చు. వొడాఫోన్ ప్లే యాప్‌లో జీ5, సోనీలివ్, ఎరోస్ నౌ, సన్ నెక్స్‌ట్ లాంటి యాప్స్‌కు చెందిన కంటెంట్, మూవీస్ ఉంటాయి. ఇవన్నీ యాక్సెస్ చేయాలంటే కనీసం రూ.399 వొడాఫోన్ రెడ్ ప్లాన్ తీసుకోవాలి

SWAYAM WEBSITE FOR ONLINE COURSES

error: Content is protected !!