amma-vodi-programme-class-1st-to-Inter-Rs.15000-All-schools

amma-vodi-programme-class-1st-to-Inter-Rs.15000-All-schools

ప్రభుత్వ విధానం ప్రకారం విద్యార్ధులంతా బడికి వెళ్ళేలా నిర్ణయం తీసుకున్నారు.

జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

ఆ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఈ పథకం కింద ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది.

పిల్లలను బడికి పంపినందుకు గాను తల్లిదండ్రుల/ విద్యార్థి బ్యాంకు ఖాతాకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున ప్రభుత్వ ప్రోత్సాహకంగా ఇస్తామని సీఎం జగన్‌ పాదయాత్ర సందర్భంగా ప్రకటించిన విషయం విధితమే.

ఈ పథకం వల్ల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.

అమ్మ ఒడి’ ఒకరికే*?

 *?కుటుంబంలో పిల్లలెందరున్నా తల్లికే..*

*?బడ్జెట్‌లో 6455.80 కోట్లు కేటాయింపు*

*?ఒకటి నుంచి పది, ఇంటర్‌ కలుపుకొని*

*?43 లక్షలమందికి రూ.15వేలు చొప్పున*

*?తెల్ల రేషన్‌ కార్డు ఉండటం తప్పనిసరి*

అమ్మ ఒడి’కి ప్రభుత్వ ఆమోదం

 ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు పేద విద్యార్థులను పాఠశాల, కళాశాలలకు పంపే తల్లులకు జగనన్న అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేయడాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.Edu news

అక్టోబర్ 30నముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో జగనన్న అమ్మ ఒడి పథకంపై కీలక నిర్ణయాలు తీసుకోబడ్డాయి.

మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీ పిల్లలకు అమ్మఒడి
జగనన్న అమ్మ ఒడి పథకానికి దారిద్య్రరేఖకు దిగువనున్న ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలందరూ అర్హులు.

అర్హులైన పిల్లల తల్లులకు ఏటా జనవరిలో రూ.15 వేలు అందించనున్నారు.

తల్లిదండ్రులు లేకపోతే సంరక్షకులకు వర్తింపజేస్తారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు సహా ప్రభుత్వ, ప్రైయివేటు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న పిల్లల తల్లులకూ ఈ పథకం వర్తిస్తుంది.

తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. పేదరికంలో ఉండి తెల్లరేషన్‌కార్డు లేని వారు దరఖాస్తు చేసుకుంటే దానిపై విచారించి, అర్హత ఉంటే పరిగణనలోకి తీసుకుంటారు.

దరఖాస్తు చేసుకునేందుకు పాఠశాల విద్య కమిషనర్ నేతృత్వంలో ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేస్తారు. జగనన్న అమ్మ ఒడికి ఈ సంవత్సరంలో రూ.6,455 కోట్లు వ్యయం చేయనున్నారు.

Documents Required While Applying For Amma Vodi Scheme

  • Aadhaar Card

  • Address Proof

  • Bank Account Details (Mother)

  • White Ration Card

AMMAVODI APPLICATION FORM CLICK HERE FOR DOWNLOAD

MOTHERS ACCOUNT PROFORMA FOR AMMAVODI

error: Content is protected !!