ammavodi-january-9th-schools-reopens-on-november-2nd-2020

ammavodi-january-9th-schools-reopens-on-november-2nd-2020

*అమ్మఒడి పథకం*

*★ అమ్మ ఒడి పథకం క్రింద 2019-20 విద్యా సంవత్సరంనకు రూ 15,000/- జమ కాని వారికి మరో అవకాశం.*

అమౌంట్ జమకాని వారు ఈ form లో వివరాలను పూర్తి చేసి సంబంధిత సచివాలయంలోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు ఇవ్వవలెను.

AMMAVODI APPLICATION FORM PDF

జనవరి 9న ‘అమ్మఒడి’..*

*2 నుంచి బడులు తీద్దామనుకొంటున్నాం*

*అప్పటికి సిద్ధం కావడానికే ఈ కానుకలు..*

*విద్యాకానుక పంపిణీలో సీఎం*

*కృష్ణాజిల్లా పునాదిపాడులో ప్రారంభం..*

*‘నాడు-నేడు’ పనుల పరిశీలన*

రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను ఇంగ్లిష్‌ చదువులకు గట్టి పునాది వేసే వైఎస్సార్‌ ప్రి-ప్రైమరీ పాఠశాలలుగా మారుస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు.

కరోనా వ్యాప్తి రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్నందున వచ్చే నెల 2వ తేదీ నుంచి పాఠశాలలను తెరవాలనుకుంటున్నామన్నారు.

‘జగనన్న విద్యా కానుక’ పేరుతో స్టూడెంట్‌ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆయన ప్రారంభించారు.

ఈ కార్యక్రమం కోసం పాఠశాలలో ఏర్పాటుచేసిన బహిరంగ సభ వేదిక నుంచి సదరు పథకం లక్ష్యాలను, విద్యార్థుల కోసం మునుముందు చేపట్టే పలు కార్యక్రమాల వివరాలను సీఎం జగన్‌ వెల్లడించారు.

కోర్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఇంగ్లిష్‌ మాధ్యమం అంశాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించడం గమనార్హం! ‘‘పుట్టిన బిడ్డకు ఆరేళ్ల వయసు రావడానికి ముందే మెదడు 85 శాతం అభివృద్ధి చెందుతుంది.

ఆ వయసులో పిల్లల మానసిక వికాసానికి గట్టి పునాది పడితే చదువులో బాగా రాణిస్తారు. ప్రస్తుతం ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇంగ్లిష్‌ మీడియం చదువు పేద పిల్లలకు చాలా ఖరీదైన వస్తువుగా మారిపోయింది.

ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థీ చక్కగా ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకుని ప్రపంచంతో పోటీ పడి జయించే పరిస్థితి రావాలి. అప్పుడే పేదరికాన్ని అఽధిగమించి మన తలరాతలను మార్చుకునే పరిస్థితి వస్తుంది’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలో స్కూళ్లు తెరిచేసరికి విద్యార్థులు సర్వసన్నద్ధంగా ఉండాలనే యోచనతో ‘జగనన్న విద్యాకానుక’ను అందిస్తున్నామని చెప్పారు.

BEGUM HAZARATH MINORITY SCHOLARSHIPS LINK & DETAILS

VARADHI WORK BOOKS FROM 1ST CLASS TO 10TH CLASS

8 ప్రధాన పథకాల ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదన్న ఉద్దేశంతోనే అమ్మకడుపులో బిడ్డ పెరుగుదల మొదలైనప్పటినుంచే తల్లీబిడ్డలకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించడంతోపాటు పిల్లల చదువుకు గట్టి పునాదులు వేస్తున్నాం’’ అని చెప్పారు.

ఆర్థికంగా చితికిపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లల చదువులు వారి తల్లిదండ్రులకు భారంగా మారకూడదని ‘అమ్మఒడి’ పథకం తెచ్చి, రూ. 15 వేలు అందజేస్తున్నామన్నారు.

వచ్చే జనవరి 9న (సంక్రాంతి) పండుగ కానుకగా ‘అమ్మఒడి’ పథకం డబ్బులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు.

అంగన్‌వాడీ కేంద్రాలు మొదలుకొని ఉన్నత పాఠశాలల దాకా.. మౌలిక సౌకర్యాలను కల్పిస్తూ వాటి రూపురేఖలనే మార్చేస్తున్నామన్నారు. ‘జగనన్న గోరుముద్ద’ పథకం కింద రోజుకొక మెనూతో విద్యార్థులందరికీ పోషకాహారాన్ని అందజేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో చదువు పూర్తయ్యాక ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ తదితర ఉన్నత చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నామని, హాస్టళ్ల విద్యార్థులకు ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద ఏటా రెండు విడతలుగా రూ. 20 వేలు వారి తల్లిదండ్రులకు అందజేస్తున్నామని తెలిపారు.

అంతకుముందు… ‘నాడు-నేడు’ కార్యక్రమం కింద పునాదిపాడు జడ్పీ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం జగన్‌ పరిశీలించారు.

ENTRANCE TEST FOR IIIT SEATS DETAILS, SYLLABUS & XAM PATTERN

error: Content is protected !!