అమ్మ ఒడి కి సంబంధించి యూనిక్ మదర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పుగా నమోదు చేయడం వలన రిజర్వు బ్యాంకు నుంచి అమౌంట్ సంబంధిత అకౌంట్లో జమ చేయుటకు ప్రయత్నించినప్పుడు సాధ్యం కాకపోవుటచే అమ్మ వొడి డబ్బులు తిరిగి వెనక్కు వెళ్ళాయి.
అటువంటి విద్యార్థుల వివరాలు ప్రస్తుతం ప్రధానోపాధ్యాయుని లాగిన్ నందు సర్వీసెస్ ట్యాబ్లో *ఫెయిల్యూర్ మదర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్* లింకు ద్వారా ఇవ్వడం జరిగింది
ఈ లింక్ ఓపెన్ చేసినట్లయితే ఆ పాఠశాలకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ తప్పుగా నమోదైన విద్యార్థి వివరాలు మాత్రమే కనిపిస్తాయి.
అప్డేట్ అకౌంట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి సంబంధిత తల్లి యొక్క అకౌంట్ నంబర్ ను సరి చేసి సబ్మిట్ చేస్తే తిరిగి వారికి అమ్మఒడి నగదు జమ చేయుట జరుగుతుంది
దయచేసి గమనించండి తప్పుగా నమోదైన బ్యాంక్ అకౌంట్ నెంబరు కలిగిన వివరాలు మాత్రమే కనిపిస్తాయి.