ammavodi-latest-updates-January-5th-2020-objections-all-certificates

ammavodi-latest-updates-January-7th-2020-objections-all-certificates

 ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం ప్రారంభం

సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా, నిరుపేదలకు అండగా దేశంలోనే వినూత్న కార్యక్రమం

ఈ ఏడాది బడ్జెట్లో రూ. 6500 కోట్లు కేటాయింపు

నేరుగా తల్లులకు నగదు బదిలీ

తల్లి మరణిస్తే సంరక్షుడికి నగదు

రేపు చిత్తూరులో ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

పూర్తి సంతృప్తస్థాయిలో పథకం.. దాదాపు 43 లక్షల మంది తల్లులకు లబ్ది

హామీ ఇచ్చిన దానికంటే మిన్నగా పథకం అమలు

ఇంటర్మీడియట్‌ చదవుతున్న విద్యార్థుల తల్లులకూ వర్తింపు

అన్ని ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్, ప్రభుత్వ, ప్రైవేటు  పాఠశాలలు, కాలేజీలకు వర్తింపు

ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కాలేజీలకూ వర్తింపు

ఘనంగా అమ్మ ఒడి పథకం కార్యక్రమం ప్రారంభానికి ఏర్పాట్లు

 రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జగనన్న అమ్మఒడి’ కార్యక్రమాన్ని గురువారం చిత్తూరులో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు

అమ్మ ఒడి’ నిధుల విడుదలకు అనుమతులు

అమ్మ ఒడి పథకం కోసం రూ.6,400* *కోట్లు* *కేటాయించామని తెలిపారు. ఈ నెల 9న చిత్తూరులో అమ్మఒడి పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.*

* దేశంలో అమ్మఒడి పథకం అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని పేర్కొన్నారు. 5వ తేదీ వరకు ఎంతమంది లబ్ధిదారులను గుర్తిస్తే అంత మందికి ఈ పథకం వర్తిస్తుందన్నారు.* 

 *ముందుగా ఒక్క రూపాయి ఖాతాల్లో వేసి లబ్ధిదారుల ఖాతాలను తనిఖీ చేస్తారు.

 *9న ఒకేసారి రూ.15వేలు జమ* *చేస్తారు.

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అమ్మ ఒడి’ పథకం నిధుల విడుదలకు పాలనా అనుమతులు మంజూరయ్యాయి. వివిధ శాఖల నుంచి ఈ పథకానికి రూ.6,109 కోట్ల నిధుల విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది.

బీసీ కార్పోరేషన్‌ నుంచి రూ.3,432 కోట్లు, కాపు కార్పోరేషన్ నుంచి రూ.568 కోట్లు, మైనారిటీ సంక్షేమశాఖ నుంచి రూ.442 కోట్లు, గిరిజనశాఖ ఎస్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.395 కోట్లు, ఎస్సీ కార్పోరేషన్‌ నుంచి రూ.1,271 కోట్లు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.

ఈ పథకం కింద 1 నుంచి ఇంటర్మీడియట్‌ వరకు పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15వేల ఆర్థిక సాయం అందించనున్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో సంబంధం లేకుండా కనీసం 75శాతం హాజరు ఉన్న ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకం వర్తించనుంది.

విద్యార్థుల పేర్లు అమ్మఒడి లో రాకుంటే కారణాలు..వాటికి పరిష్కార మార్గాలు*

*మండల విద్యాశాఖ అధికారులు మరియు  ఎం‌ఆర్‌సి సిబ్బంది అందరికీ అమ్మ ఒడి పథకం సూచన*

➡అమ్మ ఒడి పథకం కింద రెండు , మూడవ జాబితాలో వచ్చిన తల్లి  లేదా సంరక్షకుని  వివరాలు క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా పంపించినవి.  వాటిని ఎవరైనా ఈ పథకం కింద అర్హులమని గాని లేదా తమ పేర్లు జాబితాలో చోటు చేసుకోలేదని కానీ, వారి వివరాలలో తగిన ధ్రువపత్రాలను సేకరించి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో 5-1-2020 సాయంకాలం 5 గంటల లోపు అందజేయాలి.

SUGGETIONS ON LIST-2 REMARKS DOWNLOAD PDF

➡  ఈ విధంగా అందజేసిన అర్హులైన ప్రతి ఒక్క తల్లి లేదా సంరక్షకులు ఈ కార్యక్రమం కింద తప్పనిసరిగా లబ్ధి పొందగలరు అని రాష్ట్ర కార్యాలయం తెలియజేసింది.

➡  కాబట్టి జనవరి 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు మన౦ వివరాలు అప్లోడ్ చేయుటకు  తుది సమయం .

కాబట్టి ప్రతి మండల విద్యాశాఖ తమ పరిధిలోని  సిబ్బందితో సమన్వయం చేసుకొని ఈ తదుపరి కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తి చేసి మరియు అప్లోడ్ చేయవలసి ఉన్నది. 

➡రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన జగన్ అమ్మ ఒడి అర్హతలు దారిద్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన తల్లి లేదా సంరక్షకులు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు ఎకౌంటు మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ కలిగి ఉండాలి 

➡ తెల్ల రేషన్ కార్డు లేని కుటుంబాల విషయంలో వారు నిరుపేద లేదా అర్హత కలిగిన కుటుంబాలకు చెందినవారు అవునో కాదో ఆరు అంకెల పరిశీలన ద్వారా అర్హతను నిర్ణయించి కూడా లబ్ధి చేకూరుతుంది.

➡  స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలలో చదువుతున్న ఆడపిల్లల మరియు వీధి బాలలకు ఈ పథకం వర్తిస్తుంది .

➡ అర్హత కలిగిన తల్లుల లేదా సంరక్షణ పిల్లల కనీస హాజరు డెబ్భై అయిదు శాతం పరిశీలించి ధృవీకరించు కావాల్సి ఉంటుంది.

➡ ఒక తల్లి కి ఎంతమంది పిల్లలు ఉన్నా తో సంబంధం లేకుండా ఏ తల్లిని లేదా సంరక్షకుని మాత్రమే లబ్ధిదారులుగా గుర్తిస్తారు . 

➡ కొత్త రేషన్ కార్డు పొందడానికి నూతన అర్హతలు అమ్మవొడికి కూడా ఉంటాయి.  అవి క్రింది విధంగా ఉన్నాయి .

➡ ఆదాయ పరిమితి : నెలవారి ఆదాయం గ్రామాలలో  10000,  అర్బన్ ప్రాంతాల్లో 12,000.

➡  కుటుంబం యొక్క మొత్తం ల్యాండ్ హోల్డింగ్ (భూమి కలిగి ఉండటం) : ( ఈ రాష్ట్రం మొత్తం ఒకే క్రైటీరియా తీసుకోబడుతుంది) :  మాగాణి భూమి మూడు ఎకరాలు కన్నా తక్కువ ఉండాలి,  మెట్ట భూమి 10 ఎకరాలు కన్నా తక్కువ ఉండాలి,  ఈ రెండూ కలిపి కూడా 10 ఎకరాలు కన్నా ఎక్కువ ఉండరాదు.

➡  ఎలక్ట్రిసిటీ వినియోగం (విద్యుత్ వినియోగం):  ఒక కుటుంబము యొక్క విద్యుత్ వినియోగం 6 నెలల  యావరేజ్ గా తీసుకున్నప్పుడు నెలకు  300 యూనిటీ ల కన్నా తక్కువ ఉండవలెను .

➡ అన్ని ప్రభుత్వ  ఉద్యోగస్తులు మరియు పెన్షనర్స్ కు ఈ పథకం వర్తించదు.

➡  నాలుగు చక్రాల వాహనం ఉన్న వారికి ఈ పథకం వర్తించదు.

➡  ఈ పథకంలో టాక్సీ ట్రాక్టరు మరియు ఆటో ఉన్నవారిని మినహాయింపు ఉంటుంది .

➡ ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఈ పథకం వర్తించదు.

➡  మున్సిపల్ ఏరియాలో 750 స్క్వేర్ ఫీట్  కన్నా తక్కువ ఆస్తి కలిగి ఉన్నవారికి మాత్రమే పథకాన్ని కూడా వర్తిస్తాయి.

➡ కొత్త రేషన్ కార్డు నిమిత్తము  కుటుంబాలకి అర్హత ఉద్దేశించబడింది అవే అమ్మ ఒడి పథకానికి కూడా వర్తిస్తాయి.

List-2 required re verification లో supporting documents తీసుకోనే విధానము :

➡ List-2&3ల లో ఏవైనా grievances ఉంటె  5 లోపు MRC లో submit చేయవలెను.

ఆ తరువాత వచ్చినవి అనుమతించబడవు. కావున ఏ రోజుకారోజు grievances MRC లో submit చేయవలెను

SUGGETIONS ON LIST-2 REMARKS DOWNLOAD PDF

➡  ఏ ఏ కారణముకి ఏమి జత చేయాలో చూడండి.

➡1. Electricity ఎలక్ట్రిసిటీ వినియోగం (విద్యుత్ వినియోగం):  : ఇందులో రెండు రకాల సమస్యలు ఉన్నవి. అవ

➡ a) service no. వారికి సంబందించినదే కానీ అంత వాడకము లేదు: ఈ case లో ఆ service no. తో ఉన్నటువంటి చివరి 6 నెలల current బిల్లుల xerox లేదా AE గారి సంతకము గల నివేదిక కాని జత చేయాలి.

➡ b) service no. వారికి సంబందించినదే కాదు: ఈ case లో service no. వీరి కుటుంబముకి చెందినది కాదు అని AE గారు certify చేసినది జత చేయాలి. అసలు కరెంట్ లేకపోతే సంబంధిత అధికారి నుండి కనెక్షన్ లేదనే ధృవీకరణ పత్రము అప్లోడ్ చేయాలి.

➡ 2. Ration Card లేదు: ఈ case లో లబ్దీదారుకి ration card లేదు అని ఆ గ్రామ VRO గారు certify చేసినది జత చేయాలి.

➡ 3. Student Aadhar లేదు: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.

➡ 4. Four wheeler: ఈ case లో చూపించబడిన number గల వాహనము వీరిది కాదు అని సంబందిత అధికారి (RTO/MVI) certify చేసినది లేదా (ఈ లిస్ట్ లో టాక్సీ ట్రాక్టరు మరియు ఆటో ఉన్నవారిని వివరాలు ఉంటే ఆ వాహనం నంబరు ఫోటో తీసి ) లేదా online లోని నివేదిక తో పాటుగా self declaration జత చేయాలి. .

➡ 5. Govt Employee/ Pensioner: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.

➡6. Land details: ఈ case లో గ్రామములో లబ్దీదారు కుటుంబమునకి wet land: …….. (విస్తీర్ణము)dry land: ……. (విస్తీర్ణము) ఇంత ఉంది అని సంబందిత VRO గారు certify చేసినది, వారి కుటుంబ సభ్యుల భూమి వివరముల పట్టాదారు పుస్తకము xerox లు(భూమి ఉన్నవారికి మాత్లమే) మరియు మా కుటుంబములో వారికి ఈ గ్రామములలో (గ్రామముల పేర్లు రాయాలి)తప్ప మరెక్కడా భూములు లేవని self declaration. ఇవన్నీ జతచేయాలి.

➡ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అని పొరపాటుగా నమోదుచేస్తే డిక్లరేషన్ మరియు వెరిఫికేషన్ పత్రాలు అప్లోడ్ చేయాలి.  

కావున ఈ విషయములో వెంటనే పై మార్గదర్శకాలు అనుగుణంగా  పని చేయవలసిందిగా కోరుచున్నాము.

అమ్మవడి పథకం కోసం రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు లేనివారు ఈ ఫామ్స్ పూర్తిచేసి మీ గ్రామానికి సంభందించిన VRO గారిచేత అటెస్టడ్ చేపించి మీ వాలంటరీ ద్వారా గ్రామ సచివాలయంలో ఇవ్వండి అమ్మవడికి అర్హత వస్తుంది.

NO AADHAR CARD DECLARATION CERTIFICATE

ATTENDENCE CERTIFICATES FOR AMMAVODI

NO RATION CARD DECLARATION CETIFICATE

error: Content is protected !!