ammavodi-programme-guidelines-instructions-for-MEOs-HMs

ammavodi-programme-guidelines-instructions-for-MEOs-HMs

అమ్మ ఒడి కి సంబంధించి సూచించిన ముఖ్య అంశాలు:

INSTRUCTIONS FOR ALL MEOs AND HIGH SCHOOL HEADMASTERS

1. అన్ని  యాజమాన్య పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు అందరూ తమ పాఠశాలలో చదువుతున్న అందరి విద్యార్థుల వివరాలను కచ్చితంగా చైల్డ్ ఇన్ఫో లో నమోదు చేయాలి. 

2.ఇంకనూ నమోదు చేయని విద్యార్థుల వివరాలను 18.11.2019 కల్లా చైల్డ్ ఇన్ఫో లో నమోదు చేసుకోవచ్చు.

3.19.11.2019 తేదీన ఉన్న విద్యార్థులను మాత్రమే  “అమ్మ ఒడి “కోసం ప్రత్యేకంగా రూపొందించబడుతున్న ప్రత్యేక వెబ్ సైట్ లోకి డేటాను పంపించబడుతుంది.

4. ఈ విద్యార్థుల ఆధార్ నెంబర్ ఆధారంగా రేషన్ కార్డ్ లేదా పల్స్ సర్వే లోని డేటాతో సరిపోల్చి విద్యార్థుల తల్లుల మరియు బ్యాంక్ అకౌంట్ల వివరాలను సంగ్రహిస్తారు.

5. అమ్మఒడి ప్రత్యేక వెబ్ సైట్ నుండి అందరు ప్రధానోపాధ్యాయులు స్కూల్ లాగిన్ లో వివరాలను చెక్ చేసుకుని పేరెంట్స్ కమిటీ తో సంప్రదించి,ఆ వివరాలను గ్రామ సచివాలయం లో పనిచేస్తున్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు అందిస్తారు.

6. ఈ గ్రామ సచివాలయం లో అసంపూర్తిగా ఉన్న విద్యార్థుల వివరాలను వలంటీర్ల సహకారంతో డేటాను కలెక్ట్ చేసి  గ్రామ సచివాలయంలో డిస్ప్లే చేస్తారు

7. ఆ తరువాత వచ్చిన లిస్టులను గ్రామ సచివాలయం లోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అందిస్తారు.

8. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సచివాలయం ద్వారా వచ్చిన అమ్మ ఒడి విద్యార్థుల లిస్టును మరొక్కసారి చెక్ చేసుకుని సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ద్వారా మండల విద్యాశాఖ అధికారి వారికి ఆమోదం కోసం పంపించాలి.

ఇందులో గమనించవలసిన ముఖ్య అంశం ఏమిటంటే ప్రధానోపాధ్యాయులు మరియు పేరెంట్స్ కమిటీ ఈ పథకానికి పూర్తి బాధ్యత వహిస్తారు.

9. మండల విద్యాశాఖ అధికారి తదుపరి ఆమోదం కోసం జిల్లా విద్యాశాఖ అధికారి వారి ద్వారా కలెక్టర్ గారికి సమర్పించిన తరువాత మాత్రమే అమ్మ ఒడి నిధులు విడుదల అవుతాయి.

FORM-1 (ANNEXURE-A) ABOUT AMMAVODI

ప్రధానోపాధ్యాయులు ద్రువికరించదలసిన సర్టిఫికేట్

CHILD INFO WEBSITE CLICK HERE

FORM-2 (ANNEXURE-2) ABOUT AMMAVODI

అన్నీ ప్రభుత్వ పాఠశాలల,మరియు ప్రైవేట్ పాఠశాలల HMs కు తెలియజేయునది ఏమనగా!*

*ఈరోజు జరిగిన వీడియో కాన్ఫెరెన్సులో తెలిపిన విషయాలు*

*1.అమ్మ ఒడి పథకం జనవరి 9,2020 న మన CM గారు ప్రారంభించెదరు.

అదే రోజు తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ అగును.*

*2.ఇందుకు కావాల్సిన పత్రాలు* 

*తల్లి ఆధారకార్డు*

*బ్యాంక్ ఖాతా*

*IFSC code*

3. *పిల్లలు చేరినదగ్గరనుండి 31.12.2019 నాటికి హాజరు 75%ఉండాలి.(CSWN వారికి ఇది వర్తించదు)*

*4.ఒకవేళ 75% హాజరులేనిచో ఆ పిల్లల తల్లిదండ్రులకు, PMC సభ్యులకు సమాచారం ఇవ్వాలి.అలా హాజరు లేనిచో డబ్బులు రావని తెలపాలి*

*5.ఏపిల్లవానికైనా రేషన్ కార్డులేకపోతే 6 steps proform పూర్తి చేసి HM కు ఇచ్చినచో దాన్ని గ్రామ వాలంటీర్ సర్వే చేసి BPL కుటుంబమని నిర్ధారణ చేస్తారు.*

6  *పాఠశాలల్లో భౌతికంగా లేకుండా child info లో పేరు ఉంటే వెంటనే వారి పేర్లను drop box లో చేర్చాలి.*

7.  *బడికి వస్తూ ఇంకా చైల్డ్ info లో పేర్లు లేకపోతే నవంబర్ 17,18,19,తేదీ లోపల update చేయించాలి.19 వతేది సాయంత్రం site మూసివేయబడును.*

8.   *20 వ తేదీనుండి ap Cfms site కు పిల్లల data మొత్తం బదిలీ అవుతుంది.*

9. *consolidated data site నుండి సేకరించి 25 నుండి 30 మధ్యలో గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తారు.

10. *డిసెంబర్ 1 న provisional list తయారుచేసి,దాని ప్రకారమే అమ్మ ఒడి డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడతాయి.*

పైన తెలిపిన యావత్తు కార్యక్రమం *HMsపర్యవేక్షణలోPMC సభ్యులు,గ్రామవాలంటీర్ లతో కలసి నిర్వహించాలి. అర్హతలు కలిగిన పిల్లలు ఎవరూ అమ్మ ఒడి పథకం కోల్పోకూడదు అని తెలిపిరి.*

 *ఇది CM గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం.*

*కాబట్టి అందరూ HMs, ఉపాధ్యాయులు సమిష్టిగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడమైనది.*

FORM-3 (ANNEXURE-3) ABOUT AMMAVODI

AP SSA INSTRUCTIONS CLICK HERE FOR DOWNLOAD

AMMAVODI TIME LINE DATES SCHEDULE

AMMAVODI GUIDELINES IN TELUGU

How to Verify Student Enrolment in your School

error: Content is protected !!