ammavodi-Rs.1,000-refund-for-toilets-cleaning-charges-guidelines

ammavodi-Rs.1,000-refund-for-toilets-cleaning-charges-guidelines

అమ్మఒడి’ విరాళానికి విధి విధానాలు*
*జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బ్యాంకు ఖాతా*

*దానికే జమ చేయాలి.

  • జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతా నుండి జిల్లా విద్యాశాఖాధికారి ప్రతి నెలా రూ. 4,000/- చొప్పున పాఠశాలలోని పారిశుద్ధ్య గదులను శుభ్రం చేస్తున్న ఆయాకు గౌరవ వేతనం చెల్లించేందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిర్వహిస్తున్న తల్లిదండ్రుల కమిటీ బ్యాంకు ఖాతాకి ఆన్లైన్ ద్వారా జమ చేయవలెను.

  • ఆ విధంగా పాఠశాల తల్లిదండ్రుల కమిటీ బ్యాంకు ఖాతాకి జమ చేయబడిన డబ్బును పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాఠశాల పారిశుద్ధ్య గదులను శుభ్రపరుస్తున్న ఆయా యొక్క బ్యాంకు ఖాతాకు జమ చేయవలెను.

  • పాఠశాల పారిశుద్ధ్య గదులను శుభ్రపరుస్తున్న ఆయాలకు వాటి పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన సామగ్రి అనగా బ్రష్టులు, చీపుళ్ళు, ఫినాయిలు వగైరా సమకూర్చుకోవడానికి అయ్యే వ్యయం కొరకు నెలకు రూ.2000/- చొప్పున పాఠశాలకిచ్చే కాంపొజిట్ గ్రాంటులనుండి సమకూర్చాలి.

  • ఆ విధంగా పాఠశాలల్లో పారిశుద్ధ్యం సక్రమంగా అమలవుతున్నదీ లేనిదీ ప్రతిరోజూ ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించి ఫొటో ద్వారా తెలియపర్చాలి. ఇందుకు అవసరమైన డిజిటల్ టూల్ రూపొందించడం జరుగుతున్నది.

  • తల్లిదండ్రుల కమిటీలో ఉన్న సభ్యుల నుండి ముగ్గురిని తల్లిదండ్రుల సబ్ కమిటీగా ఏర్పాటు చేయవలెను. ఆ సబ్ కమిటీ వారు పాఠశాల ఆవరణలో ఉన్న పారిశుద్ధ్య గదుల నిర్వహణను ప్రతి రోజు స్వయంగా పర్యవేక్షించి అందులో లోటుపాట్లను ప్రధానోపాధ్యాయునికి దృష్టికి మరియు తల్లిదండ్రుల కమిటీ దృష్టికి తీసుకురావలెను.

• అదే విధంగా గ్రామ సచివాలయంలోని విద్య-సంక్షేమ సహాయకుడు వారానికి మూడుసార్లు పాఠశాల ఆవరణలో ఉన్న పారిశుద్ధ్యపు గదుల నిర్వహణను స్వయంగా పరిశీలించి ఫొటో తీసి ఆన్ లైన్లో పొందుపరచాలి.

  • ప్రతి మూడు నెలలకు ఒకసారి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా అమలు జరుగుతున్నదీ లేనిదీ స్వతంత్ర సంస్థ ద్వారా పర్యవేక్షణ చేపట్టాలి. ఇందుకు గ్రామంలోని స్వయం సహాయక బృందాల సహకారం తీసుకోవడం జరుగుతుంది.

  • పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా అమలు జరిగేలా చూడటంలో విద్యార్థుల పాత్ర కూడా ముఖ్యమైనది. ఇందుకు గాను విద్యార్థులకు తాము పారిశుద్ధ్యపుగదుల్ని వినియోగించిన తరువాత వాటిని తప్పనిసరిగా శుభ్రంగా ఉంచడం గురించి తప్పనిసరిగా తెలియపరచాలి.

  • పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ గురించి ప్రతినెలా తల్లిదండ్రుల కమిటీ సమావేశంలో తప్పనిసరిగా సమీక్షించాలి. లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని మెరుగుపర్చుకోవడం కోసం తగిన చర్యలు చేపట్టాలి.

  • పారిశుద్ధ్య నిర్వహణలో నీటి వినియోగం గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా, నీళ్ళు వృథా చెయ్యకుండా చూసేటట్లు కూడా సూచనలు ఇస్తుండాలి.

  • సమగ్ర శిక్షా జిల్లా కార్యాలయంలో ఉన్న కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసరుకు ఈ సూచనలు అమలు పరచవలసిన బాధ్యత అప్పగించాలి.

4.  ఈ అంశం మీద తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కలగడం కోసం మరియు పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ తప్పనిసరిగా (01-02-2020 నుండి అమలు జరిగేటట్లు తగిన చర్యలు చేపట్టాలి.

5.   జిల్లాలోని విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు, మండల విద్యాశాఖాధికారులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు మొత్తం పాఠశాల్ని సందర్శించి పాఠశాల సిబ్బందిని, తల్లిదండ్రుల కమిటీలని జాగరూకుల్ని చెయ్యడం కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి.

6 .   ఈ ఆదేశాలమీద తీసుకున్న చర్యను ప్రతి రోజూ కమిషనర్ కార్యాలయానికి ఎప్పటికప్పుడు నివేదించాలి.

FOR MORE DETAILS PROCEEDINGS CLICK HERE FOR DOWNLOAD PDF

error: Content is protected !!