# Andhra-Bank-90-years-history-1923-to-2020

- Link: https://amaravathiteacher.com/andhra-bank-90-years-history-1923-to-2020/
- Published: 2020-03-31T15:20:51+05:30
- Author: amaravathiteacher

## **Andhra-Bank-90-years-history-1923-to-2020**󠀁[](https://amaravathiteacher.com/andhra-bank-90-years-history-1923-to-2020/)󠁿

### **చరిత్ర పుటల్లోకి ఆంధ్రా బ్యాంక్‌**

### **తెలుగు వారికి గడిచిన 97 సంవత్సారాలుగా బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న ఆర్థిక నేస్తం ఆంధ్రాబ్యాంక్ కాలగర్భంలో కలిసిపోనుంది**

### **తొమ్మిది దశాబ్దాలకుపైగా సేవలు

### **యూనియన్‌ బ్యాంకులో విలీనం **

### **ఆంధ్రా బ్యాంక్‌ కథ నేటితో కంచికి చేరుతోంది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923 నవంబరులో ప్రైవేటు బ్యాంకుగా ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించారు. **

### **డిపాజిట్లు రూ.50 కోట్ల కంటే కొద్దిగా తక్కువగా ఉండడంతో 1969లో జాతీయకరణను తప్పించుకుంది. **

### **ఇందిరా గాంధీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత 1980 ఏప్రిల్‌లో మాత్రం ఆంధ్రా బ్యాంక్‌ జాతీయకరణను తప్పించుకోలేకపోయింది. **

### **బుధవారం (ఏప్రిల్‌ 1) నుంచి మరో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎ్‌సబీ) యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ)లో విలీనమవుతూ తన ఉనికినే కోల్పోతోంది. **

### **ఆంధ్రా బ్యాంక్‌తో పాటు కార్పొరేషన్‌ బ్యాంక్‌ యూబీఐలో విలీనమవుతోంది. **

### **1980లో జాతీయం చేశారీ బ్యాంకును. అయితే.. దేశంలోనే తొలిసారి క్రెడిట్ కార్డులను జారీ చేసిన బ్యాంక్ ఇదే.**

### ** 1981లో క్రెడిట్ కార్డులను జారీ చేసింది. తద్వారా భారత దేశానికి క్రెడిట్ కార్డు వ్యవస్థను పరిచయం చేసింది. **⏎ **ఇక, 2003 నాటికి నూరు శాతం కంప్యూటరీకరణ సాధించింది. **

### **2007లో బయోమెట్రిక్ ఏటీఎంలను ఇండియాకు పరిచయం చేసింది ఆంధ్రా బ్యాంక్. **

### **అలా ఎన్నో రికార్డులను సృష్టించిన ఈ బ్యాాంక్ ఇప్పుడు కనుమరుగు కాబోతోంది. **

### **నేడే ఈ ప్రక్రియ మొదలుకాబోతోంది. ఆంధ్రాబ్యాంకుతో పాటు కార్పొరేషన్‌ బ్యాంకు కూడా యూనియన్ బ్యాంక్‌లో విలీనం అవుతోంది.**

### **ఆంధ్రా బ్యాంక్‌ చరిత్ర **

### **󠀁[APPLICATION FOR EXEMPTiON TO HOME LOAN (ms word file)](https://amaravathiteacher.com/application-for-exemption-to-home-loan-complete-details/)󠁿**

### **󠀁[CHANDAMAMA STORY BOOKS FROM 1947 TO 2013 LINK DOWNLOAD HERE ](https://amaravathiteacher.com/chandamama-telugu-english-magazine-total-1947-to-2012/)󠁿**

 * 
   ### **20-11-1923న నమోదు**
   
 * 
   ### **28-11-1923 నుంచి బ్యాంకింగ్‌ కార్యకలాపాలు**
   
 * 
   ### **1969-1980 మధ్య దేశంలో నెంబర్‌వన్‌ ప్రైవేటు బ్యాంక్‌గా గుర్తింపు**
   
 * 
   ### **15-4-1980లో జాతీయకరణ**
   
 * 
   ### **2019 మార్చి నాటికి 26 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2,885 శాఖలు, 3,798 ఏటీఎంలు**
   
 * 
   ### **1981లో దేశంలో తొలిసారిగా క్రెడిట్‌ కార్డుల వ్యాపారం ప్రారంభం **
   
 * 
   ### **01-04-2020న యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనం**
   

### **ఆస్తులూ అమ్మేస్తాం **

### **విలీనం తర్వాత ఆంధ్రా బ్యాంక్‌కు చెందిన కొన్ని స్థిరాస్తులను అమ్మేయాలని యూబీఐ నిర్ణయించింది. **

### **ఇందుకోసం ఇప్పటికే కొన్ని నివాస, వాణిజ్య సముదాయాల్ని గుర్తించినట్టు యూబీఐ ఎండీ, సీఈఓ రాజ్‌కిర ణ్‌ రాయ్‌ ప్రకటించారు. **

### **ఈ ఆస్తులతో పాటు ఇండి యా ఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, మలేషియాలోని ఇండియా ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌ మలేషియాలో ఉన్న వాటానూ విక్రయించాలని నిర్ణయించింది.**

### **తెలుగు రాష్ట్రాల్లో సుపరిచిత బ్యాంక్‌గా**

### **ఆంధ్రా బ్యాంక్‌ దాదాపు తొమ్మిది దశాబ్ధాలుగా తెలుగు నేలతో పాటు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకింగ్‌ సేవలు అందించింది. **

### **అలాంటి బ్యాంక్‌ పేరు బుధవారం నుంచి చరిత్రలో కలిసిపోతోంది.**

### **󠀁[CMRM DONATIONS 100% INCOME TAX EXEMPTION ONLINE LINK FOR CMRF DONATIONS](https://amaravathiteacher.com/income-tax-exemption-carona-virus-donations-cm-relief-fund-andhra-pradesh/)󠁿**

### **విలీనాల ద్వారా పీఎ్‌సబీల బలోపేతం  పేరుతో తెలుగు ప్రజలతో ముడిపడి రెండు ప్రముఖ పీఎ్‌సబీలను కేంద్ర ప్రభుత్వం ఇతర పీఎ్‌సబీల్లో కలిపేస్తోంది. **

### **స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఇప్పటికే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో కలిసిపోయింది. **

### **ఇప్పుడు తాజాగా ఆంధ్రా బ్యాంక్‌.. యూబీఐలో విలీనమవుతోంది. **

### **ఉద్యోగుల వ్యతిరేకత**

### **కాగా యూబీఐలో విలీనాన్ని ఆంధ్రా బ్యాంక్‌ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. **

### **పీఎ్‌సబీల బలోపేతానికి విలీనాలు పరిష్కారం కాదని, దీనివల్ల ఉద్యోగుల ఉద్యోగ భద్రతకూ ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విలీనం తర్వాత దాదాపు 700 శాఖలను హేతుబద్ధం చేయాల్సి ఉంటుందని యూబీఐ ఎండీ, సీఈఓ ప్రకటించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు.**

### ** కోవిడ్‌-19తో దేశం వణికిపోతున్నా, ప్రభుత్వం మొండి పట్టుదలతో ఆంధ్రా బ్యాంక్‌ను యూబీఐలో విలీనం చేయడాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుపట్టాయి. **

### **ఇక ఏపీ ఎస్‌ఎల్‌బీసీ యూబీఐ **

### **విలీనాలతో ఆయా రాష్ట్రాల స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) కన్వీనర్లు కూడా మారిపోయారు. **

### **ఏప్రిల్‌ 1 నుంచి యూబీఐ ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఎ్‌సబీసీ కన్వీనర్‌గా వ్యవహరిస్తుంది. **

### **ఆర్‌బీఐ ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. **

### **ఇప్పటి వరకు ఆంధ్రా బ్యాంక్‌.. ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌గా వ్యవసహరించింది. **

### **విలీనంతో ఆ బాధ్యత ఇప్పుడు యూబీఐకి వచ్చింది.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
