ఏపీ డీఎస్సీ-2018 పరీక్షలు డిసెంబరు 24 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు.
తొలిదశలో జరగనున్న స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ), పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్, మ్యూజిక్, ఆర్ట్, డ్రాయింగ్, క్రాఫ్ట్, భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పరీక్షలకు 2,62,106మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
ఈ పరీక్షలు 24న ప్రారంభమై జనవరి 4వ తేదీతో ముగియనున్నాయి.
మొత్తం 7,902 పోస్టులకు 6,08,159 అభ్యర్థులు దరఖాస్తుచేసుకున్న విషయం తెలిసిందే. అత్యల్పంగా ఎస్ఏ ఒడియాకుముగ్గురు, కన్నడ భాషాపండిత పోస్టులకు నలుగురు అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
జనవరి 18 నుంచి ఎస్జీటీ
రెండో దశలో సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) పరీక్షలు జనవరి 18 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి.
ఈ పరీక్షలకు మొత్తం 3,46,053 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆన్లైన్ పరీక్షలను రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు.
|