AP 1ST CLASS Telugu JEJELU – ANAMDAM – TAARAMGAM – THAYILAM -ACHULA GEYAM – HALLULA GEYAM – BALAGEYALU
జేజేలు
జేజేలు
అమ్మకు జేజే
నాన్నకు జేజే
బంగరు భారత
భూమికి జేజే
చదువులు నేర్పే
గురువుకు జేజే
అన్నం పెట్టే
రైతుకు జేజే
ఆనందం – ఆనందం
ఆనందం – ఆనందం
ఆనందం ఆనందం
ఆటలె పిల్లలకానందం
ఆనందం ఆనందం
పాటలె పిల్లలకానందం
ఆనందం ఆనందం
ఆటలు, పాటలె ఆనందం
ఆనందం ఆనందం
అల్లరె పిల్లలకానందం.
తారంగం – తారంగం
తారంగం – తారంగం
తారంగం తారంగం
తాండవ కృష్ణ తారంగం
వేణునాథా తారంగం వేంకట రమణ తారంగం
వెన్నదొంగా తారంగం
చిన్ని కృష్ణా తారంగం
తాయిలం
తాయిలం
ఆటలు ఆడీ పాటలు పాడీ
అలసీ వచ్చానే
తియ్యాతీయని తాయిలమేదో
తెచ్చీపెట్టమ్మా
గూటీలోని బెల్లం ముక్క
కొంచెం పెట్టమ్మా
చేటాలోని కొబ్బరికోరూ
చారెడు తియ్యమ్మా
అటకామీదీ అటుకులకుండా
అమ్మా దింపమ్మా
తియ్యతియ్యని తాయిలమేదో
తీసీ పెట్టమ్మా
అచ్చుల గేయం
అచ్చుల గేయం
అమ్మ మొదటి దైవం
అమ్మ మొదటి దైవము
ఆవు పాలు మధురము
ఇటుక గోడ మందము
ఈల పాట విందము
ఉడుత తోక అందము
ఊయలూగు చుందము
ఎలుక వల్ల నష్టము
ఏనుగెక్కుటిష్టము
ఐస్క్రీం చల్లన
ఒంటె నడక మెల్లన
ఓడ నీట తేలును ఔటు భలే పేలును
హల్లుల గేయం
హల్లుల గేయం
అక్షరాల జల్లులు
హల్లులోయ్ హల్లులు
– అక్షరాల జల్లులు
క, ఖ, గ, ఘ, ఙ
– కలిసీ మెలిసీ ఆడేద్దాం
చ, ఛ, జ, ఝ, ఞ
– చక్కగ పాటలు పాడేద్దాం
ట ఠ డ ఢ ణ
– టక్కున జవాబు చెప్పేద్దాం .
త, థ, ద, ధ, న
తగవులు లేక కలిసుందాం
ప, ఫ, బ, భ, మ
– పెద్దల మాటలు పాటిద్దాం
య, ర, ల, వ, శ, ష, స
ఎల్లరి మనసులు గెలిచేద్దాం
హ, ళ, క్ష, ఱ
హాయిహాయిగా చదివేద్దాం