AP 2ND CLASS TELUGU CHETTUTHORRA – THATHA BURRA – PAPALLARA RARANDI – YEDI MELU – NAVA – THUVVAYI – ANDAM ABHINAVA GEYALU
చెట్టుతొర్ర – తాతబుర్ర
చెట్టుతొర్ర – తాతబుర్ర
చింత చెట్టు తొర్రలోన చిలుక ఉన్నది
తాత బోడి బుర్ర మీద పిలక ఉన్నది
చిలుక ముక్కు తాతపిలక తీరుగున్నది
తాతమాట చిలుకపలుకు లాగ నున్నది
తాత కాళ్ళకున్న జోడు కిర్రుమన్నది
చింత తొర్రలోన చిలుక తుర్రుమన్నది.
పాపల్లారా రారండి
పాపల్లారా రారండి
చక్కటి రంగులు చూడండి
గులాబి పువ్వును నేనండి
ఎరుపు రంగు నాదండీ.
సంపెంగ పువ్వును నేనండి
పచ్చరంగు నాదండీ.
మల్లెపువ్వును నేనండి
తెలుపు రంగు నాదండీ.
ఆకాశమంత నేనండి
నీలిరంగు నాదండీ.
ఏది మేలు?
ఏది మేలు?
ఊరులన్నిటి లోన ఏ ఊరు మేలు!
పాడి పంటలు గలుగు మా ఊరు మేలు!!
వీధులన్నింటిలోన ఏ వీధి మేలు!
మంచివారున్నట్టి మా వీథి మేలు!!
అరుగులన్నింటిలోన ఏ అరుగు మేలు!
పండితులు కూర్చుండు మా అరుగు మేలు!!
గడపలన్నింటిలోన ఏ గడప మేలు!
మహలక్ష్మి ఉన్నట్టి మా గడప మేలు!!
నావ
నావ
అదిగదిగో ఒక్కనావ
ఆ నది లో పోతున్నది.
అందంగా అలలపైన
భలే భలే సాగుతోంది.
తరుల మధ్య గిరుల మధ్య
తళతళమని మెరుస్తోంది.
తామరలతో మీనములతో
కలసి మెలసి కదులుతోంది
తువ్వాయి
తువ్వాయి
తువ్వాయి తువ్వాయి ఏమి తువ్వాయి
తువ్వాయి తువ్వాయి మా మంచి తువ్వాయి
తువ్వాయి మెళ్ళోన ఏమి ఉన్నాయి?
తువ్వాయి మెళ్ళోన మువ్వలున్నాయి.
తువ్వాయి కాళ్ళలో ఏమి ఉన్నాయి?
తువ్వాయి కాళ్ళలో పరుగులున్నాయి.
తువ్వాయి నోట్లోన ఏమి ఉన్నాయి?
నోట్లోన తొలిపాల నురుగులున్నాయి.
తువ్వాయి తువ్వాయి ఎవరి తువ్వాయి?
ఆవుగారి తువ్వాయి అసలు మాతువ్వాయి.
అందం
అందం
విరిసినపూలు చెట్టుకు అందం
కిలకిల పలుకులు చిలుకకు అందం
కమ్మని పాటలు కోకిలకందం
ఆకాశాన జాబిలి అందం.
నేలతల్లికి పైరులు అందం
దీపపు వెలుగులు చీకటికందం
వానలమబ్బులు చేలకు అందం
చిట్టి పాపలు ఇంటికి అందం.