AP 3rd Class Telugu – Adevo Telugu Thalli Rhyme – అదెవో తెలుగుతల్లి
అదెవో తెలుగుతల్లి
అదెవో తెలుగుతల్లి
అందాల నిండు జాబిల్లి
ఆనందాల కల్పవల్లి
అదే నీ తెలుగుతల్లి
పదవోయి తెలుగోడా
అదె నీ తెలుగు మేడ
సంకెళ్ళు లేని నేల
సంతోష చంద్రశాల
కనవోయి తెనుంగు రేడా
అదె నీ అనుంగు నేల
అదిగో సుదూర నేల
చనవోయ్ తెలుగు వీరా!
పదవోయి నిర్భయంగా
పదవోయి నిశ్చయంగా
కదలవోయ్ ఆంధ్ర కుమారా
నిద్ర వదలవోయ్ నవ యుగం
నిర్మింపగ సాగవోయ్
కదలవోయ్ ఆంధ్ర కుమారా!
తల్లీ భారతి వందనము
పల్లవి : తల్లీ భారతి వందనము
నీ ఇల్లే మా నందనము
మేమంతా నీ పిల్లలమూ
నీ చల్లని ఒడిలో మల్లెలమూ
||తల్లీ భారతి||
చరణం: చదువులు బాగా చదివెదమమ్మా
జాతి గౌరవం పెంచెదమమ్మా
తల్లిదండ్రులను గురువులను
ఎల్లవేళలా కొలిచెదమమ్మా
॥తల్లీ భారతి॥
చరణం : కుల మత భేదం మరిచెదము
కలతలు మాని మెలిగెదము
మానవులంతా సమానమంటూ
మమతను సమతను పంచెదము
||తల్లీ భారతి||
చరణం: తెలుగు జాతికి అభ్యుదయం
నవ భారతికి నవోదయం
భావి పౌరులం మనం
మనం భారత జనులకు జయం జయం
||తల్లీ భారతి॥