AP 4TH Class Telugu Gandhi Mahathmudu Bayaluderaga – THENELA THETALA MATALOTHO Rhyme

AP 4TH Class Telugu Gandhi Mahathmudu Bayaluderaga – THENELA THETALA MATALOTHO Rhyme

గాంధీ మహాత్ముడు బయలుదేరగా

ప॥ గాంధీ మహాత్ముడు బయలుదేరగా

కలకల నవ్విందీ జగత్తు- కలకల నవ్వింది.

గాంధీ మహాత్ముడు చకచక నడువగ

కంపించి పోయిందీ భూదేవి కంపించి పోయిందీ

గాంధీ మహాత్ముడు బయలుదేరగా

కలకల నవ్విందీ జగత్తు కలకల నవ్వింది.

గాంధీ మహాత్ముడు కన్నువిప్పగా

గడగడ వణికిందీ అధర్మము గడగడ వణికిందీ

గాంధీ మహాత్ముడు బయలుదేరగా

కలకల నవ్విందీ జగత్తు- కలకల నవ్వింది

గాంధీ మహాత్ముడు – నవ్వు నవ్వగా

కన్నుల గట్టిందీ – స్వరాజ్యం కన్నుల గట్టిందీ

గాంధీ మహాత్ముడు బయలుదేరగా

కలకల నవ్విందీ జగత్తు-కలకల నవ్వింది.

గాంధీ మహాత్ముడు  గొంతు విప్పగా

గణగణ మ్రోగిందీ – ప్రణవము గణగణ మ్రోగింది!

గాంధీ మహాత్ముడు బయలుదేరగా

కలకల నవ్విందీ జగత్తు-కలకల నవ్వింది

గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా

కరముల దొరికిందీ మోక్షము కరముల దొరికిందీ!

గాంధీ మహాత్ముడు బయలుదేరగా

కలకల నవ్విందీ జగత్తు కలకల నవ్వింది

 

తేనెల తేటల మాటలతో

పల్లవి :

తేనెల తేటల మాటలతో

మన దేశమాతనే కొలిచెదమా

భావం భాగ్యం కూర్చుకుని

ఇక జీవనయానం చేయుదమా

||తేనెల||

సాగరమేఖల చుట్టుకొని

సురగంగ చీరగా మలచుకొని

గీతాగానం పాడుకొనీ

మనదేవికి యివ్వాలి హారతులు

గాంగ జటాధర భావనతో

హిమశైల రూపమే నిలబడగా

గలగల పారే నదులన్నీ

ఒక బృందగానమే చేస్తుంటే

ఎందరొ వీరుల త్యాగఫలం

మన నేటి స్వేచ్ఛకే మూలధనం

వారందరినీ తలచుకొని

మన మానస వీథిని నిలుపుకొని

error: Content is protected !!