AP 5TH CLASS Telugu YE DESAMEGINA RHYME

AP 5TH CLASS Telugu YE DESAMEGINA RHYME

 

ఏదేశమేగినా, ఎందుకాలిడిన

 

ఏదేశమేగినా, ఎందుకాలిడిన

ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనిన

పొగడరా నీ తల్లి భూమి భారతిని!

నిలుపరా నీజాతి నిండు గౌరవము!

 

ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో

జనియించినాడవీ, స్వర్గ ఖండమున

ఏ మంచి పూవులన్, ప్రేమించినావో

నిను మోచె ఈ తల్లి, కనక గర్భమున!

 

లేదురా ఇటువంటి, భూదేవి యెందు

లేరురా మనవంటి, పౌరు లింకెందు

సూర్యుని వెలుతురుల్, సోకు నందాక

ఓడల జెండాలు ఆడు నందాక!

 

అందాక గల ఈ, యనంత భూతలిని

మన భూమి వంటి, చల్లని తల్లి లేదు

పాడరా నీ తెన్గు, బాల గీతములు

పాడరా నీ వీర, భావ భారతము!

error: Content is protected !!