AP 6TH CLASS TELUGU AMMAVODI RHYME
అమ్మ ఒడి చదువుల బడి మా
యమ్మ ఒడి నా కొక గుడి
అమ్మ చూపును ఒరవడి, దై
వమ్ము కంటెను త్వరపడి
అమ్మ చెప్పిన సుద్దులు, అని
శమ్ము ఒప్పిన బుద్ధులు
అమ్మ పెదవుల హాసము ని
త్యమ్ము మాకు వికాసము
అమ్మ మంజుల భాషణం, శ్రా
వ్యమ్ము వీనుల భూషణం
అమ్మ హృది అనురాగము, ది
వ్యమ్ము భవ్యము యోగము
అమ్మ చల్లని కరములు దా
నమ్మునకు ఆకరములు
అమ్మ చరణ తలమ్ములు క్షే
మమ్ము పండు పొలమ్ములు
అమ్మ కన్నుల కాంతులు లో
కమ్మునకు సుఖశాంతులు
అమ్మయే నా సర్వము ధై
ర్యమ్ము బలమూ గర్వము