AP 7TH CLASS Telugu Jayamu Jayamu Bharathamatha Rhyme

AP 7TH CLASS Telugu Jayamu Jayamu Bharathamatha Rhyme

 

జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత

 

జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత

ఈ జగాన సాటి ఎవ్వరే ఓ యమ్మ నీకు

గంగ యమున గోదారీ సింధు కృష్ణ కావేరీ

బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతీ నర్మద పెన్నా

పొంగి పొరలె తరంగాలు నీ మెడలో హారాలు

జీవనదుల కన్నతల్లివే ఓయమ్మ నీవు ॥ జయము జయము ॥

హిమ వింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు

దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు

పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు

నిజముగ నువు రత్న గర్భవే ఓయమ్మ నీవు ॥ జయము జయము ॥

లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు

నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు

వేదాలను వెతికితెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు

నిజముగ నీవు జగద్గురువువే ఓయమ్మ నీవు ॥ జయము జయము ॥

error: Content is protected !!