PSR DIGITAL 10TH CLASS ALL SUBJECTS NOTE BOOKS REVISED SYLLABUS 2020-21 ACCORDING AP CSE DELETED SYLLABUS.
ap-all-schools-from-november-2nd-to-april-30th-details
*️విద్యాసంస్థలు ఓపెన్… షెడ్యూల్ విడుదల
All High Schools Re open on November 2nd , 2020 ACADEMIC CALANDER RELEASED.
రాష్ట్రంలోని పాఠశాల విద్య యొక్క అన్ని ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు మరియు జిల్లా విద్యాశాఖాధికారుల దృష్టిని 2 వ ఉదహరించిన సూచనకు ఆహ్వానించి, కొంతమంది ఉపాధ్యాయులు 02.11.2020 న స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, AP ని కలుసుకున్నారు.
వారు పాఠశాలకు ఎందుకు వెళ్లలేదని వారు తెలియజేశారు, 50% మంది ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలకు వెళ్లవలసి ఉంది. ఈ సందర్భంలో, GORt.No.216 లో, స్కూల్ ఎడ్యుకేషన్ (Prog.II) డిపార్ట్మెంట్, Dt: 01.11.2020 లో, ఉపాధ్యాయులందరూ ప్రతిరోజూ పాఠశాలలకు హాజరుకావాలని స్పష్టంగా పేర్కొనబడింది (అనగా , ఉదయం సెషన్ తరగతి గది సూచన: మధ్యాహ్నం సెషన్ ఆన్‌లైన్ తరగతులు).
ఉన్నత పాఠశాలలు, యుపి పాఠశాలలు మరియు ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ పాఠశాలలకు హాజరు కావాలని మరియు వారి బయో మెట్రిక్ హాజరును తప్పకుండా గుర్తించాలని అన్ని క్షేత్రస్థాయి అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేయాలని వారు అభ్యర్థించారు. యుపి పాఠశాలలు మరియు ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఉదయం అవసరమైన వర్క్‌షీట్లు మరియు బోధనా సామగ్రిని తయారు చేసి మధ్యాహ్నం ఆన్‌లైన్ తరగతులకు హాజరుకావాలి.
ఇంకా, తరగతి గదికి 16 మంది విద్యార్థుల ప్రమాణం దృష్ట్యా, పదవ తరగతి మరియు తొమ్మిదవ తరగతికి మరిన్ని విభాగాలు తెరవడం అవసరం మరియు అదనపు విభాగాలకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు హాజరు కావాలంటే, సమీపంలోని యుపి పాఠశాలలు మరియు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను నియమించాలి వారి పాఠశాలలు తిరిగి తెరవబడే వరకు ఉన్నత పాఠశాలల్లో పని చేయండి.
*ఏటా నిర్వహించే నాలుగు ఫార్మేటివ్ పరీక్షలను రెండుకు, 2 సమ్మేటివ్ పరీక్షలను ఒకటికి కుదించారు. బేస్‌లైన్ పరీక్షలను నవంబర్ మొదటి వారంలో, ప్రాజెక్టు ఆధారిత పరీక్షలను నవంబర్ చివరి వారంలో, ఫార్మెటివ్-1 పరీక్షలను డిసెంబర్ చివరి వారంలో, ఫార్మేటివ్-2 పరీక్షలను ఫిబ్రవరి చివరి వారంలో, సమ్మేటివ్ పరీక్షలను ఏప్రిల్ చివరి వారంలో నిర్వహిస్తారు.*
*నెలవారీగా పని దినాలు, పాఠశాల, ఇంటి పని దినాల విభజన ఇలా..*
నెల, మొత్తం పని దినాలు, పాఠశాల పని దినాలు, ఇంటివద్ద పని దినాలు
నవంబర్ 29 25 4
డిసెంబర్ 31 25 6
జనవరి 31 23 8
ఫిబ్రవరి 28 24 4
మార్చి 31 25 6
ఏప్రిల్ 30 21 9
మొత్తం 180 143 37
తరగతి గదిలో 16 మందే
కోవిడ్ నేపథ్యంలో 2వ తేదీ నుంచి స్కూళ్ల ప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు
విద్యార్థులు, టీచర్లకు ఇబ్బంది కలగకుండా చర్యలు
ఒక్కో విద్యార్థి మధ్య దూరం 6 అడుగులు
టెన్త్ మినహా తక్కిన విద్యార్థులకు రోజు విడిచి రోజు తరగతులు
FA 1, FA 2 & SA 1 Exams:
FA 1 will be conducted in December last week.
FA 2 will be conducted in February last week
SA 1 will be conducted in April last week
Schools working days as follows
-
25 days in November,
-
25 days in December,
-
23 days in January,
-
24 days in February,
-
25 days in March,
-
21 days in April.
టీచర్లు రోజూ స్కూళ్లకు రావలసిందే
రాష్ట్రంలో నవంబర్ 2 నుంచి స్కూళ్ల ప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించింది.
కోవిడ్–19 నేపథ్యంలో విద్యార్థులకు, టీచర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
ఒక్కో తరగతి గదిలో 16 మందికి మించకుండా ఉండాలని నిర్ణయించారు.
ఒక్కో విద్యార్థికి మధ్య దూరం 6 అడుగులు ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. రోజువిడిచి రోజు తరగతుల నిర్వహణ, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బోధన తదితర అంశాలను మార్గదర్శకాల్లో పొందుపరిచారు.
నవంబర్ నెలంతా హాఫ్ డే స్కూళ్లే
► నవంబర్ నెలంతా స్కూళ్లు హాఫ్‌డే మాత్రమే (ఉదయం 9 నుంచి 1.30 వరకు) ఉంటాయి. మధ్యాహ్న భోజనం ముగిశాక పిల్లలను ఇళ్లకు పంపిస్తారు.
► విద్యార్థులు రోజు విడిచి రోజు తరగతులకు హాజరయ్యేలా ఏర్పాట్లు.
► ప్రారంభంలో 9వ తరగతికి ఒకరోజు పెడితే మరునాడు 10వ తరగతి పిల్లలకు తరగతులు పెట్టాలి
► నవంబర్ 23 నుంచి 8 తరగతులకు ఒకరోజు, 9 తరగతులకు మరునాడు తరగతులు నిర్వహించాలి.
► డిసెంబర్ 14 నుంచి 1, 3, 5, 7, 9 తరగతులకు ఒకరోజు, 2, 4, 6, 8 తరగతులకు మరుసటిరోజు తరగతులు పెట్టాలి.
► టెన్త్ విద్యార్థులకు ప్రతి రోజూ తరగతులు నిర్వహించాలి.
► ఏ స్కూలులో అయినా 750 మందికి మించి విద్యార్థులున్నట్లయితే వారిని మూడు బ్యాచులుగా చేసి మూడేసి రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలి.
► టీచర్లు రోజూ స్కూళ్లకు హాజరవ్వాలి.
ఉదయం తరగతుల బోధన, మధ్యాహ్నం ఆన్‌లైన్ బోధనలో పాల్గొనాలి.
హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్వహణ ఇలా..
► హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను అక్కడి వసతిని బట్టి నిర్ణీత నిబంధనలను పాటిస్తూ 9–12 తరగతుల పిల్లలతో నవంబర్ 2వ తేదీనుంచి ప్రారంభించవచ్చు.
► నిబంధనలకు అనువుగా తగినంత వసతి లేని పక్షంలో నవంబర్ 23 నుంచి ప్రారంభించాలి.
► అప్పటివరకు ఆ విద్యార్థులు సమీపంలోని ప్రభుత్వ స్కూళ్లలోని తరగతులకు హాజరవ్వడం లేదా ఆన్‌లైన్ తరగతుల ద్వారా ఆయా పాఠ్యాంశాలు నేర్చుకొనేలా చూడాలి.
► 3 నుంచి 8వ తరగతి పిల్లలకు సంబంధించి నిబంధనలు తరువాత విడుదల చేస్తారు.
అప్పటివరకు ఈ విద్యార్థులు సమీపంలోని స్కూళ్లలోని తరగతులకు హాజరై అక్కడ మధ్యాహ్న భోజనం తీసుకోవచ్చు.
అకడమిక్ క్యాలెండర్ ఇలా..
► రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన అకడమిక్ క్యాలెండర్‌ను అన్ని పాఠశాలలు అనుసరించాలి.
► నవంబర్ 2 నుంచి 2021 ఏప్రిల్ 30 వరకు మొత్తం 180 రోజులకు తగ్గట్టుగా క్యాలెండర్ ఉంటుంది.
► ఆదివారాలు, సెలవు దినాల్లో స్కూళ్లు మూసిఉన్న రోజుల్లో పిల్లలు ఇంటినుంచే చదువుకొనేలా ప్రణాళిక ఉంది.
► తల్లిదండ్రుల కమిటీలతో సంప్రదించి ప్రతి రోజూ స్కూళ్లను పరిశుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలి.
► పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగేందుకు తగిన పౌష్ఠికాహారం మధ్యాహ్న భోజనం ద్వారా అందించాలి. మధ్యాహ్న భోజనం అమలులో కోవిడ్ జాగ్రత్తలు పూర్తిగా తీసుకోవాలి. మూడో వంతు మంది చొప్పున విడతల వారీగా పంపాలి.
► ప్రతిఒక్కరూ మాస్కు ధరించేలా, సామాజిక దూరం పాటించేలా చూడాలి.
► ఉదయం స్కూళ్లు తెరవగానే కోవిడ్ ప్రతిజ్ఞ చేయించి జాగ్రత్తలపై 15 నిమిషాలు బోధించాలి.
8TH CLASS SYLLABUS
10TH CLASS SYLLABUS
9TH CLASS SYLLABUS
ఈ ఏడాదికి ఒకే సమ్మెటివ్ పరీక్ష
*పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను సిద్ధం చేసింది.
పాఠ్యాంశాలను మూడు విభాగాలుగా విభజించింది.
వాటిని తరగతి గదిలో బోధించేవి, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు చదువుకునేవి, విద్యార్థులే ఇంటి వద్ద చదువుకునేవిగా వర్గీకరించింది.
తప్పనిసరి పాఠ్యాంశాలను ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధిస్తారు.*
*కొన్ని పాఠ్యాంశాలను వాట్సప్ లేదా తరగతికి వచ్చిన సమయంలో ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు చదువుకోవాల్సి ఉంటుంది.
అభ్యాసన ప్రక్రియలో భాగంగా వర్క్‌బుక్స్ వంటివి ఉంటాయి.
ఈ విధానంలో పాఠ్యాంశాల బోధన 30-50% వరకు తగ్గనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు పాఠశాలలు కొనసాగుతాయి.*
*ఈ ఏడాది సమ్మెటివ్ పరీక్ష ఒక్కటే ఉంటుంది. ఫార్మెటివ్‌లు రెండు ఉంటాయి.*
*ఇంటర్‌కు సంబంధించి ఇప్పటికే 30% పాఠ్యాంశాలను తగ్గించారు.
రెండో ఏడాది ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతుండగా… మొదటి ఏడాది ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నారు.*
*10 రోజులకోసారి విద్యార్థుల మార్పు
*డిగ్రీ, ఇంజినీరింగ్ మొదటి ఏడాది మినహా అన్నీ నవంబరు 2 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.*
*ఇంజినీరింగ్ మొదటి ఏడాది డిసెంబరు 1, డిగ్రీ తరగతులు అదే నెల మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి.*
*ఉన్నత విద్యా సంస్థల్లో కొంత ఆన్‌లైన్, మరికొంత ఆఫ్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తారు.*
*కళాశాల విద్యార్థులలో 1/3 వంతు చొప్పున విడతల వారీగా 10 రోజులపాటు తరగతుల్లో పాఠాలు బోధిస్తారు.
ఆ తర్వాత మొదటి బ్యాచ్‌కు ఆన్‌లైన్‌లో పాఠాలు ఉంటాయి. మరో బ్యాచ్ 1/3 విద్యార్థులు తరగతులకు హాజరవుతారు.*
*మొత్తం ఒక సెమిస్టర్‌కు సంబంధించిన 90 రోజుల్లో 30 రోజులపాటు విద్యార్థులకు తరగతులు ఉంటాయి.*
*వసతి గృహాలను ఇదే విధానంలో కేటాయిస్తారు. తరగతులకు వచ్చిన వారికి వసతి గృహం సదుపాయం కల్పిస్తారు. విద్యార్థులు విడతల వారీగా మారుతూ ఉంటారు.*
*వంద కిలోమీటర్ల కంటే దూరం నుంచి వచ్చే విద్యార్థులకు మాత్రం సెమిస్టర్ మొత్తం వసతి కల్పిస్తారు.*
*ఏదైనా తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే రెండు గ్రూపులుగా విభజిస్తారు.*
*సీట్ల మధ్య ఆరు అడుగుల దూరం ఉంటుంది*
పటిష్టంగా కోవిడ్ రక్షణ చర్యలు*
రోజువిడిచి రోజు పాఠశాలల్లో తరగతులు*
* కరోనా వైరస్ కారణంగా మూతపడ్డ పాఠశాలలు, కాలేజీలు నవంబర్ 2 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి.*
* పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.*
* కోవిడ్ వ్యాపించకుండా అన్నరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను వివరించారు.*
*నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి.*
*నవంబర్ 2 నుంచి 9,10,11/ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ,12 / ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు నడపనున్నారు. హాఫ్‌డే మాత్రం నిర్వహిస్తారు.*
*హయ్యర్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అన్ని కాలేజీలకూ కూడా నవంబర్ 2నుంచే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్ పద్ధతిలో ఈ తరగతులను నిర్వహిస్తారు.*
*నవంబర్ 23 నుంచి 6,7,8 క్లాసులకు బోధన ప్రారంభం అవుతుంది. రోజు విడిచి రోజు, హాఫ్ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు.*
*డిసెంబర్ 14 నుంచి 1,2,3,4,5 తరగతులను ప్రారంభిస్తారు. రోజువిడిచి రోజు, హాఫ్ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు.*
*అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలకు అన్నింటికీ కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది.*
నవంబర్ 2 నుండి స్కూల్స్ తెరిచి నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. వానిలో కొన్ని ముఖ్యమైనవి.*
*1). 1, 3, 5, 7 తరగతులు ఒక రోజు, 2, 4, 6, 8 తరగతులు ఒక రోజు, 9, 10 తరగతులకు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటలవరకు తరగతులను నిర్వహించాలి.*
*2. పిల్లలు స్కూల్ లోనికి వచ్చేటప్పుడు థర్మల్ స్క్రీనింగ్ చేసి లోపలికి అనుమతించాలి.*
*3. మాస్క్ లేకపోతే అనుమతించ రాదు.*
*4. క్లాస్ లో పిల్లలు 20 మంది లోపే ఉండాలి.*
*5. స్కూల్ లోని తరగతి గదులను ప్రతిరోజు శానిటేషన్ చేయించాలి.*
*6. 1st పీరియడ్ లో మరియు లాస్ట్ పీరియడ్ లో ప్రతిరోజూ 10 నిమిషాలు Covid 19 పై పిల్లలకు అవగాహన కల్పించాలి.*
*7. స్కూల్ ఎంట్రెన్స్ లో, తరగతి గదులలో, ముఖ్యమైన ప్రదేశాలలో Covid19 నివారణకు తీసుకోవలసిన స్లొగన్స్ ను ప్రదర్శించాలి.*
*అవి.*
*A) మాస్క్ లేదు, ప్రవేశం లేదు.*
*B) 6 అడుగులు బౌతిక దూరం పాటిద్దాము.*
*C) తరసూ చేతుల సబ్బు నీటితో కడుగుకుందాం. మోడల్ పోస్టర్ లను M E O లు ప్రతి స్కూల్ కి ఒకటి ఇస్తారు.*
*8. పిల్లలు బుక్స్ కాని పెన్నులు కాని ఒకరివి మరొకరు మార్చుకోకుండా చూడాలి.*
*9. ప్రతి విద్యార్థి నోట్స్ కరెక్ట్ చేయకుండా బోర్డు పై వ్రాసి Self కరెక్షన్ ప్రోత్సహింస వలయును.*
*10. పేరెంట్స్ నుండి Willing లెటర్ కచ్చితంగా తీసుకోవాలి.*
*11. Staff అందరు ఆరోగ్యసేతు అప్ డౌన్లోడ్ చేసుకోవాలి.*
*12. స్కూల్ లో ఒక Isolation రూమ్ ఏర్పాటు చేసుకో వాలి.*
*13. పిల్లలు చేతులతో ముక్కు, నోరు, కళ్ళు ఎక్కువగా తాకవద్దని తెలియచేయాలి.*
*14. పిల్లలలో కాని, టీచర్ లలో కాని Covid లక్షణాలు ఉంటే వారిని స్కూల్ లోపలకి అనుమతించ కూడదు.*
*15. పిల్లల ఇంటిలో కుటుంబ సభ్యుల లో ఎవరికైనా Covid ఉంటే వారిని స్కూల్ లోపలికి అనుమతించ కూడదు.*
*16. స్కూల్ లో యాక్టివ్ గా ఉంటూ 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఒక టీచర్స్ ను Covid Resource Person గా నియమించాలి.*
*17. అతనికి పిల్లలందరి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు, ఆ ప్రాంతములోని ANM ల ఫోన్ నంబర్లు ఇవ్వాలి.*
*18. పిల్లలను, టీచర్లను అతను గమనిస్తూ ఉండాలి. ఎవరైనా నీరసంగా గాని ఉంటే వారిని Pulse Oxy meter తో oxygen లెవెల్ ను చెక్ చేయాలి.*
Oxygen level 90 *కంటే (సాధారణంగా 94శాతం ఉండాలి ) తక్కువగా ఉంటే ఆ పిల్లలను isolation రూమ్ లో ఉంచి తల్లిదండ్రులను పిలిచి వారికీ అప్పగించ వలయును.*
*19. ప్రతి స్కూల్ కి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ స్కూల్స్ కి కూడా ఒక Pulse Oxymeter అందజేస్తామని కలెక్టర్ గారు తెలియచేసారు.*
*20. ప్రతి టీచర్ Covid కి సంబందించిన నియమాలను పాటిస్తూ పిల్లలు కూడా పాటించేలా చూడాలి.*
*21. మొదటి వారం రోజులు పిల్లలకు Covid నిబంధనలను విస్తృతంగా వివరిస్తే తరువాత వారు అలవాటు పడతారని అలా చేయాలనీ తెలియచేసారు.*
*22. స్కూల్ Busses లో తక్కువ మంది పిల్లలు ఉండేటట్లు చూసుకోవాలి.*
*23. బస్ లను రోజు శానిటేషన్ చేయించాలి.*
*24. హాస్టల్ ల విషయం గురించి అడుగా ఈవిషయం చెప్పకుండా దాటవేశారు.*
*25. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను, అకడమిక్ క్యాలెండరు ప్రకటిస్తుందని, దానిని తప్పకుండా పాటించాలని తెలియచేసినారు.*
*పైన తెలిపిన నిబంధనలను పాటిస్తూ పిల్లలు మరియు టీచర్స్ ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇస్తూ అత్యంత జాగర్తగా పాఠశాలలను నిర్వహించ వలసినదిగా తెలియజేసారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నవంబర్ 2 నుంచి పాఠశాలలు ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి తెలిపారు. విద్యా సంవత్సరం వృధా కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నవంబర్ 2 నుండి పాఠశాలలు ప్రారంభిస్తాం.
విద్యార్థులకు ప్రతీ రోజూ కరోనా క్లాసులు చెప్తాం. విద్యార్థులకు ఇప్పటికే విద్యాకానుకలో మాస్కులు ఇచ్చాం.
సెలవులు, సిలబస్ని తగ్గించాల్సి ఉంటుంది. మొదటి నెల రోజులు ఒక్క పూట పాఠశాలలు నిర్వహిస్తాం.
తరువాత సమీక్షించి భవిష్యత్ ప్రణాలిక ప్రకటిస్తాం.
ప్రతీ విద్యార్థి రోజు తప్పించి రోజు వచ్చేలా తరగతులు.
1,3,5,7,9 తరగతులు ఒకరోజు నిర్వహిస్తాం.
2,4,6,8,10 తరగతులు ఇంకోరోజు నిర్వహిస్తాం.
ఉపాధ్యాయులందరికీ రోజూ డీఎంహెచ్‌ఓ ద్వారా అవగాహన కల్పిస్తాం.
ప్రతీ పాఠశాలకు వైద్య సిబ్బందిని, పీహెచ్‌సీలో డాక్టర్ని అందుబాటులో ఉంచుతా’’మన్నారు.
సగం పాఠాలే !
నవంబరు 2 నుంచి ఏప్రిల్ 30 వరకు బడులు.
టీచర్ల సెలవులపైనా పరిమితి
రాష్ట్రంలోని పాఠశాలలను నవంబరు 2 నుంచి తెరిచేందుకు పాఠశాల విద్యాశాఖ అకడమిక్ కేలండర్‌ను సిద్ధం చేస్తోంది.
సాధారణ పరిస్థితుల్లో 220 పనిదినాలు రావాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఇప్పటివరకు తరగతులే ప్రారంభం కాలేదు.
దీంతో పనిదినాల సంఖ్యకు అనుగుణంగా పాఠ్యాంశాలు (సిలబస్) తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది.
టెన్త్‌కు రెగ్యులర్ తరగతులు – అభ్యసన ఫలితాల సాధనకు వీలుగా సిలబస్*
– *ఏప్రిల్ 30 వరకు స్కూళ్లు.. సంక్రాంతి సెలవుల కుదింపు*
*– 2 ఫార్మేటివ్‌లు, ఒక సమ్మేటివ్‌కు పరీక్షలు తగ్గింపు*
కోవిడ్19 కారణంగా రాష్ట్రంలో పాఠశాలలు నవంబర్ 2 నుంచి తెరవనున్న నేపథ్యంలో తరగతుల నిర్వహణ, ప్రత్యామ్నాయ పాఠ్య ప్రణాళికపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయిస్తోంది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఆధ్వర్యంలో విద్యా రంగ నిపుణులతో ఈ కసరత్తు కొనసాగుతోంది.
ఈ నెల 25 నాటికి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్‌పై ప్రతిపాదనలు అందించనున్నారు.
రానున్న రోజుల్లో పని దినాలను అనుసరించి విద్యార్థుల్లో అభ్యసన ఫలితాల సాధనకు వీలుగా పాఠ్యాంశాల నిర్ణయం, తరగతుల నిర్వహణ అంశాలపై దృష్టి సారించారు.
పాఠశాల తరగతులను 18 వరకు ఒక విభాగంగా, 9, 10 తరగతులను మరో విభాగంగా రూపొందిస్తున్నారు.
18 తరగతుల వారికి తరగతుల నిర్వహణకు రెండు మూడు మార్గాలను ప్రతిపాదిస్తున్నా, 10వ తరగతి విద్యార్థులకు మాత్రం రెగ్యులర్ తరగతులు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
విద్యార్థుల సంఖ్యను అనుసరించి తరగతులు :
కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి విద్యార్థులను అనుమతించనున్నారు. ఎక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లలో ఉదయం కొన్ని తరగతులు, మధ్యాహ్నం కొన్ని తరగతులు నిర్వహించనున్నారు.
లేదంటే కొన్ని రోజులు కొన్ని తరగతులు, మరికొన్ని రోజులు మరికొన్ని తరగతులు పెట్టనున్నారు. తొలుత తల్లిదండ్రుల కమిటీలతో సమావేశాలు పెట్టి పాఠశాలలకు పిల్లలను పంపడంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించనున్నారు.
మధ్యాహ్న భోజనం సమయంలో భౌతిక దూరం పాటించేలా టీచర్లకు బాధ్యతలు అప్పగిస్తారు. స్కూలులో చెబితేనే నేర్చుకోగలుగుతారనే అంశాలు పాఠ్యాంశాలుగా ఉంటాయి. ఇంటిదగ్గర నేర్చుకొనే వాటికి సంబంధించి వీడియో, ఆడియోల రూపంలో విద్యార్థులకు అందిస్తారు. అదనంగా నేర్చుకొనే అంశాల గురించి వివరిస్తారు. ఈ మేరకు పాఠ్య ప్రణాళిక రూపొందిస్తున్నారు.
180 పనిదినాలు : ఏప్రిల్ 30 వరకు పాఠశాలలు కొనసాగించేలా పాఠ్య ప్రణాళిక రూపొందుతోంది. సంక్రాంతి సెలవులను కుదించడం ద్వారా 180 పని దినాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.
అభ్యసన ఫలితాల సాధనకు వీలుగా అన్ని అంశాలు బోధించేలా ప్రణాళిక ఉంటుందని ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. ఈసారి పరీక్షలు రెండు ఫార్మేటివ్, ఒక సమ్మేటివ్ ఉండేలా చూస్తున్నారు.
పాఠ్యప్రణాళిక ప్రకారమే పరీక్షలు :
ప్రస్తుతం పరిస్థితిని అనుసరించి రూపొందిస్తున్న పాఠ్య ప్రణాళికనే టెన్త్ పరీక్షల నిర్వాహకులకు అందిస్తారు.
దాని ఆధారంగానే ప్రశ్నపత్రాల రూపకల్పన, జవాబుల మూల్యాంకన జరిగేలా చూస్తారు. టెన్త్ పరీక్షలు ఏటా మార్చి 24 లేదా 26వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 10 వరకు జరుగుతుంటాయి. ఈసారి తరగతులు ఆలస్యమైనందున ఏప్రిల్ 15 నుంచి ప్రారంభించి, ఆ నెలాఖరులోగా పూర్తి చేస్తారు.
జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సగం పాఠ్యాంశాలు తగ్గించే యోచనలో ఉన్నందున ఇదే విధానాన్ని పాటించాలని భావిస్తోంది.
పండుగల సెలవులనూ తగ్గించనున్నారు. తరగతుల నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఉపాధ్యాయులపైనా పరిమితి విధిస్తూ సంచాలకులు చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీచేశారు.
నవంబరు 2 నుంచి ఏప్రిల్ 30 వరకు పాఠశాలలు పనిచేస్తాయి.
* పండుగల సెలవులు కుదింపు. వారానికి ఆరు పనిదినాలు.
* సంక్రాంతికి మూడురోజులే సెలవులు.
* ఉపాధ్యాయులు నెలకు రెండున్నర చొప్పున నవంబరు, డిసెంబరుల్లో ఐదు రోజులే సాధారణ సెలవులు (సీఎల్) వినియోగించుకోవాలి.
* ఏప్రిల్‌లో పదోతరగతి పరీక్షల నిర్వహణ
హాజరుపట్టీలో కులమతాలు వద్దు
పాఠశాల హాజరుపట్టీలో విద్యార్థుల కులం, మతం వివరాలు రాయొద్దని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చినవీరభద్రుడు ఆదేశాలు జారీచేశారు.
బాలికల పేర్లను ఎర్రసిరాతో రాయకూడదని, అందరిపేర్లూ ఒకేలా ఉండాలని పేర్కొన్నారు.
ఈ విషయాల్లో ఇప్పటివరకు ఉన్న విధానాలను నిలిపివేయాలని ఆదేశించారు.