AP DSC Final Selection List 2025 Download
AP DSC Final Selection List 2025 Download
AP DSC Final Selection List 2025 Download
రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీ రాజ్, మునిసిపల్ శాఖల పరిధిలోని ఉపాధ్యాయ ఖాళీలతో పాటు గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ, మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ, అలాగే మోడల్ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, దివ్యాంగుల పాఠశాలలు, జువెనైల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలోని పాఠశాలలలో ఉపాధ్యాయ ఖాళీలతో కలిపి మొత్తం (16,347) ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 20.04.2025న మెగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్ విడుదల చేసింది.
అభ్యర్థుల నుండి 20.04.2025 నుండి 15.05.2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించగా, మొత్తం 3,36,300 మంది అభ్యర్థుల నుండి 5,77,675 దరఖాస్తులు అందాయి. అనంతరం 06.06.2025 నుండి 02.07.2025 వరకు ప్రతిరోజూ రెండు షిఫ్టులలో కఠినమైన భదత్తా చర్యల మధ్య కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో పరీక్షలు నిర్వహించారు.
పరీక్షల నిర్వహణ అనంతరం 05-07-2025 తేదీన ప్రాథమిక కీలకాంశాలు విడుదలచేయడం జరిగింది. వాటిపై 12-07-2025 వరకు అభ్యర్థుల నుండి అభ్యంతరాలను స్వీకరించడం జరిగింది, వాటిని నిపుణుల బృందంతో విశ్లేషించి 01-08-2025 తేదీన తుది కీలకాంశాలు విడుదల చేయడం జరిగింది. అనంతరం టెట్ ప్రామాణిక అభ్యంతరాలను/ మార్గాలను సరిచేసుకోవడానికి 17-08-2025 నుండి 21-8-2025 వరకు అభ్యర్థులకు అవకాశం కల్పించడం జరిగింది.
పరీక్షల సంఖ్య, అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం వలన ఒకటి కన్నా ఎక్కువ షిఫ్టులలో నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు సమన్వయం చేయడానికి వీలుగా అంతర్జాతీయంగా అమలు చేస్తున్న నైర్మలైజేషన్ విధానాన్ని అనుసరించడం జరిగినది.
అభ్యర్థుల టెట్ స్కోరు (20%) మరియు డీఎస్సీ స్కోరు (80%) లకు వెయిటేజీ ఇచ్చి, అధ్యక్షులు మరియు అన్ని కేటగిరీల ప్రకారు మెరిట్ జాబితాలు రూపొందించడం జరిగినది.
అనంతరం, జిల్లా వారీగా 50 మంది అభ్యర్థులకు ఒక బృందం చొప్పున సర్టిఫికేట్ పరిశీలన బృందాలను ఏర్పాటు చేసి, 28.08.2025 నుండి 13.09.2025 వరకు 7 రౌండ్లలో ఎంపిక పరిధిలోని అభ్యర్థుల దస్తావేజులను జాగ్రత్తగా పరిశీలించారు.
బ్లైండ్, హియరింగ్ ఇంపేయర్డ్, ఆర్థో, ఎం.ఆర్ విభాగాలకు సంబంధించిన దస్తావేజుల పరిశీలనలో వైద్యశాఖ అధికారుల సహకారం తీసుకోవడం జరిగింది.
ఎంపిక పరిధిలోకి వచ్చిన అభ్యర్థుల దస్తావేజులను సవివరంగా పరిశీలించి, మేనేజ్మెంట్ వారీగా, పోస్ట్ వారీగా తుది ఎంపిక జాబితాలను రూపొందించడం జరిగినది. ఈ తుది ఎంపిక జాబితాలను సెప్టెంబర్ 15, 2025న విడుదల చేయ నున్నారు. తుది ఎంపిక జాబితాలను సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నందు మరియు జిల్లా కలక్టర్ గారి కార్యాలయం నందు ప్రదర్శించడం జరుగుతుంది.