AP-EAMCET-2020-admissions-councilling-notification-colleges-cut-off-ranks
ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ
23 నుంచి ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన
కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే సర్టిఫికేషన్ వెరిఫికేషన్
జనరల్, బీసీ విద్యార్థులకు రూ. 1200 ప్రాసెసింగ్ ఫీ
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.600 ప్రాసెసింగ్ ఫీ
రాష్ట్రంలో నేటి నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది.
ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ఆద్వర్యంలో ఆన్‌లైన్ ద్వారా సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇందుకుగాను రాష్డ్ర వ్యాప్తంగా 25 హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
గిరిజన విద్యార్థుల సౌకర్యార్ధం తొలిసారిగా పాడేరులో హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ర్యాంకుల వారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు.
ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కొనసాగుతుంది.
కరోనా నేపథ్యంలో విద్యార్థులు నేరుగా హాజరు కావాల్సిన అవసరం లేకుండా ఇళ్ల నుంచే ఆన్‌లైన్ ద్వారా సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కి హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు.
అత్యవసరమైతేనే హెల్ప్‌లైన్ సెంటర్లకి విద్యార్థుల రావాల్సి ఉంటుందని తెలిపారు.
విద్యార్థుల సౌకర్యార్ధం నాలుగు హెల్ప్‌లైన్ నంబర్లు: 8106876345, 8106575234, 7995865456, 7995681678 అందుబాటులో ఉంచారు.
జనరల్, బీసీ విద్యార్థులకు 1200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి 600 రూపాయిలు ప్రాసెసింగ్ ఫీజుగా నిర్ణయించారు.
శుక్రవారం ఒకటో ర్యాంకు నుంచి 20,000 ర్యాంకు వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరగననుండగా 24న 20,001 ర్యాంకు నుంచి 50,000 వరకు, 25న 50,001 ర్యాంకు నుంచి 80,000 వరకు, 26న 80,001 నుంచి 1,10,000 ర్యాంకు వరకు, 27న 1,10,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరగనుంది.
పీహెచ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎన్‌సీసీ కోటా విద్యార్ధులకి విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సిలింగ్ జరగనుంది.
ఉన్నత విద్యలో ముఖ్యంగా ఇంజనీరింగ్, ఫార్మా తదితర కోర్సుల్లో నాణ్యతను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
అందుకు తగ్గట్టుగానే 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
నాణ్యమైన విద్యను అందించేలా కాలేజీల్లోని సదుపాయాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయిస్తోంది.
అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ నియమాలను అనుసరించి సదుపాయాలు ఉన్న కళాశాలలను మాత్రమే కౌన్సెలింగ్‌లో అనుమతించనున్నారు.
ఏఐసీటీఈ అనుమతించిన కాలేజీలు 392
రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏఐసీటీఈ అనుమతించిన కాలేజీల సంఖ్య గతంతో పోలిస్తే ఈసారి భారీగా తగ్గింది.
ఒకప్పుడు రాష్ట్రంలో 467 వరకు ఇంజనీరింగ్, ఫార్మా తదితర కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొనేవి. కానీ ఈసారి వాటి సంఖ్య 392 వరకు మాత్రమే ఉండనుంది.
గత ఏడాది వీటి సంఖ్య 445 కాగా ఈసారి 53 వరకు కాలేజీల సంఖ్య తగ్గడం విశేషం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణాల విషయంలో కఠినంగా ఉండటంతో సదుపాయాలు లేని కాలేజీలను యాజమాన్యాలు స్వచ్ఛందంగా మూసివేశాయి.
ప్రస్తుతం ఈ కాలేజీల గుర్తింపు (అఫ్లియేషన్) కోసం యూనివర్సిటీల తనిఖీలు కూడా లోతుగా సాగుతుండటంతో కౌన్సెలింగ్‌లోకి ఎన్ని కాలేజీలు వస్తాయో పరిశీలన అనంతరమే తేలనుంది.
ప్రమాణాలు పాటిస్తేనే ఫీజు రీయింబర్స్‌మెంట్
నిర్దేశించిన అన్ని ప్రమాణాలూ పాటించే కాలేజీలకు మాత్రమే ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వనుంది.
ఈసారి కాలేజీల సంఖ్య తగ్గినా సీట్ల సంఖ్య పెరుగుతోంది.
ప్రభుత్వం పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంతో సీట్లు పెరుగుతున్నాయి.
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డీప్ లెర్నింగ్, డేటా అనాలసిస్ వంటి కొత్త కోర్సుల్ని దాదాపు 50 శాతం కాలేజీల్లో ప్రారంభిస్తున్నారు.
ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎంసెట్ – 2020 కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు (ఎంపీసీ స్ట్రీమ్) ఈ వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.
ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చొప్పున ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి కౌన్సెలింగ్‌లో పాల్గొనాలి.
ఈనెల 23 నుంచి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవచ్చు.
► ఆన్‌లైన్ ఫీజు చెల్లించాక ప్రింటవుట్ తీసుకోవాలి.
ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు సమయంలో సాంకేతిక కారణాల వల్ల ఫెయిల్యూర్ అని వస్తే మరోసారి చెల్లించి ప్రింటవుట్ తీసుకోవాలి.
తొలుత చెల్లించిన డబ్బులు వారి ఖాతాకు జమ అవుతాయి.
► ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు అనంతరం ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తులో పేర్కొన్న మొబైల్ నంబర్‌కు రిజిస్ట్రేషన్ నంబర్, లాగిన్ ఐడీ నంబర్ వివరాలు ఎస్సెమ్మెస్ ద్వారా అందుతాయి.
ఇలా సమాచారం వస్తే సర్టిఫికెట్ల డేటా పరిశీలన పూర్తయినట్లు.
అసమగ్రంగా ఉంటే హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన చేయించాలనే సందేశం వస్తుంది.
► వెరిఫికేషన్ పూర్తయ్యాక లాగిన్ ఐడీ ద్వారా పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకుని తదుపరి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
► ప్రస్తుతం ధ్రువపత్రాల పరిశీలనకు మాత్రమే షెడ్యూల్ విడుదల చేశారు.
► ఈనెల 23 నుంచి 27 వరకు ర్యాంకుల వారీగా ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
ర్యాంకుల వారీగా ధ్రువపత్రాల పరిశీలన తేదీలు
తేదీ
|
ఏ ర్యాంకు నుంచి ఎంతవరకు?
|
అక్టోబర్ 23
|
1 – 20000
|
అక్టోబర్ 24
|
20,001 – 50,000
|
అక్టోబర్ 25
|
50,001 – 80,000
|
అక్టోబర్ 26
|
80,001 – 1,10,000
|
అక్టోబర్ 27
|
1,10,001 – చివరి ర్యాంకు వరకు
|
► వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు తేదీలను తదుపరి ప్రకటిస్తారు.
► దివ్యాంగులు, స్పోర్ట్స్, గేమ్స్, ఎన్‌సీసీ, ఆంగ్లో ఇండియన్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తారు.
సీఏపీ (చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్‌డ్ పర్సనల్) అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లవచ్చు.
దివ్యాంగులు, సీఏపీ, స్పోర్ట్సు, గేమ్స్, ఎన్‌సీసీ, ఆంగ్లో ఇండియన్, అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన షెడ్యూల్
తేదీ
|
కేటగిరీ
|
ర్యాంకులు
|
అక్టోబర్ 23
|
ఆంగ్లో ఇండియన్
|
1 – చివరి ర్యాంకు వరకు
|
—
|
పీహెచ్‌వీ, పీహెచ్‌హెచ్, పీహెచ్‌ఓ
|
1 – చివరి ర్యాంకు వరకు
|
—
|
ఎన్‌సీసీ
|
1 – 35,000
|
అక్టోబర్ 24
|
సీఏపీ
|
1 – 45,000
|
—
|
ఎన్‌సీసీ
|
35,001 – 70,000
|
—
|
స్పోర్ట్స్,గేమ్స్
|
1 – 45,000
|
అక్టోబర్ 25
|
సీఏపీ
|
45,001 – 90,000
|
—
|
ఎన్‌సీసీ
|
70,001 – 1,05,000
|
—
|
స్పోర్ట్స్,గేమ్స్
|
45,001 – 90,000
|
అక్టోబర్ 26
|
సీఏపీ
|
90,001 – చివరివరకు
|
—
|
ఎన్‌సీసీ
|
1,05,001 – చివరివరకు
|
—
|
స్పోర్ట్స్,గేమ్స్
|
90,001 – చివరివరకు
|