ap-education-department-survey-results-about-school-students-attendence
కరోనాకు భయబడి!
● విద్యార్థుల హాజరు తగ్గడానికి కారణమిదే
1.30 లక్షల మందిపై సర్వే…
కరోనాకు.. భయబడి!
అముజూరులో బడికి హాజరు కాని విద్యార్థి నుంచి వివరాలు తీసుకుంటున్న ఉపాధ్యాయుడు
కరోనా కొంత కట్టడిలోనే ఉందని… 9, 10, ఇంటర్ తరగతుల వారికి ఈ నెల 2 నుంచి పాఠశాలలు తెరిచినా, హాజరు శాతం 30 లోపే నమోదవుతోంది. దీనిపై రాష్ట్ర విద్యా శాఖ స్పందించింది. అన్ని జిల్లాల్లో సీఆర్పీలు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో సర్వే చేపట్టింది. జిల్లాలో 10,004 మంది ఉపాధ్యాయులు, 865 మంది సీఆర్పీలు సర్వేలో పాల్గొన్నారు. 9, 10, ఇంటర్ తరగతులు చదువుతున్న 1.30 లక్షల మందిని ప్రశ్నించి నివేదిక రూపొందించారు.
వెంటాడుతున్న కలవరం…72%
బోధన లేక బడులు బోసిపోయాయి. తరగతి గది చిన్నబోయింది. నల్ల బల్ల తెల్లబోయింది. పాఠాలు లేవు. ఆటలు అసలే లేవు. కరోనా సృష్టించిన
కల్లోలంతో కనీసం 120 రోజుల బోధన పనిదినాలు లేకపోతే విద్యార్థులకు సంవత్సరిక మూల్యాంకనం చేయకూడదనే నిబంధనల కారణంగా బడులు తెరిచారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తమ పిల్లల్ని బడికి పంపలేమని విద్యార్థుల తల్లిదండ్రులు తేల్చేశారు. చదువెంత ముఖ్యమో తమ పిల్లల ఆరోగ్యం సైతం అంతేనని వారు భావించారు. దీంతో ఉన్నత పాఠశాలల్లో హాజరు శాతం 29లోపు నమోదవుతోంది. సుమారు 72 శాతం మంది కరోనా భయంతోనే తమ పిల్లల్ని బడికి పంపడం లేదని చెప్పారని సర్వే చేసిన ఉపాధ్యాయులు తేల్చారు.
రవాణా లేకనే.. 13%
గ్రామీణ ప్రైవేటు విద్యార్థుల కోసం యాజమాన్యాలు బస్సులు తిప్పడం లేదు. సీటుకొకరినే కూర్చోబెట్టాల్సి రావడంతో వారికి లాభసాటి కాదని భావించి మానేశారు. పల్లె వెలుగు బస్సులను ఓఆర్ సమస్యతో ఆర్టీసీ అధికారులు తాత్కాలికంగా ఆపడం ప్రభుత్వ విద్యార్థులకు ఇబ్బందులు తెచ్చింది. వెరసి 13 శాతం బడికి దూరంగాఉన్నారు.
వరి కోతలు, పొలం పనులు 9%
వ్యవసాయ పనులు, వరికోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పట్టణాల మాటెలా ఉన్నా పల్లెల్లో అధిక సంఖ్యలో రైతులు, వ్యవసాయ కూలీలున్నారు. దీంతో తల్లిదండ్రుల వెంట వారికి సాయంగా పనులకు వెళ్లడమో లేక ఇంటి వద్దనే ఉండిపోతున్నారు. దీంతో 9 శాతం మంది బడికి వెళ్లడం లేదు.
ఇతర కారణాలు
పై కారణాలతో పాటు కుటుంబాల్లోని సమస్యలు, వివాహాలు, విందులు, పెద్దలు పట్టించుకోకపోవడం తదితర కారణాలతో 3 శాతం మంది పాఠశాలలకు రావడం లేదని సర్వేలో తేలింది.
భరోసా నింపుతాం
సర్వే ప్రకారం 72 శాతం మంది కరోనా భయంతోనే రావడం లేదని తేలుతోంది. పాఠశాలల్లో జాగ్రత్తలపై తల్లిదండ్రుల్లో మరింత చైతన్యం తెస్తాం. ఈ నెల 23 నుంచి 6, 7, 8 తరగతుల నేపథ్యంలో మరింత కట్టుదిట్టం చేస్తాం. 9, 10 పిల్లలు సైకిళ్ల మీద రావచ్ఛు 6, 7, 8 వారికి బడి తెరిచాక సమస్య వస్తే నా దృష్టికి వస్తే ఆర్టీసీ అధికారులతో సంప్రదించి మేలు కలిగేలా చూస్తాం. విద్యాశాఖ
నడవట్లేదు..*
*బడి ఎట్లా మాస్టారూ
*♦ఉపాధ్యాయులకు తేల్చి చెప్పిన తల్లిదండ్రులు
*♦విద్యార్థుల గైర్హాజరుపై చేపట్టిన సర్వేలో తేలిన వాస్తవమిది*
కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా మందికి ఉపాధి కరవయ్యింది. ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. గతంలో మాదిరి వారికి విరివిగా పనులు దొరకటం లేదు. దీంతో తమతో పాటే పిల్లలను కూలీ పనులకు తీసుకెళ్లి తొలుత భుక్తికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామని, అందువల్లే పిల్లలు పాఠశాలలకు హాజరుకాలేకపోతున్నారని పలువురు తల్లిదండ్రులు సర్వేలో తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.
ఈ ఏడాది కరోనా తీవ్రత నేపథ్యంలో నవంబరు 2న పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పక్షం రోజులు గడిచినా హాజరు శాతంలో పెద్దగా మార్పు లేదు. పిల్లలు ఎందుకు పాఠశాలలకు రావటం లేదో పాఠశాల విద్యాశాఖ ఇటీవల ఓ సర్వే ద్వారా తెలుసుకుంది.