ap-government-decided-all-schools-colleges-universities-closed-upto-march-31st

ap-government-decided-all-schools-colleges-universities-closed-upto-march-31st

ఏపీలో విద్యాసంస్థల బంద్.. కరోనాపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీలో గురువారం నుంచి అన్ని విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనాపై నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నుంచి అన్ని విద్యాసంస్థలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు సహా అన్ని విద్యాసంస్థలకు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

AP SSC Exams Records Registers to be D.O Maintained by Centre Chief and D.O

కరోనా తీవ్ర దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

దీనిపై సుప్రీం కోర్టుకు సైతం వెళ్లింది. కానీ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల వాయిదాను సుప్రీం కోర్టు సమర్థించింది.

దీంతో ఎన్నికలు సైతం నిర్వహించే పరిస్థితి లేనందున విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ జగన్ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు

*Rc.,92; 18/3/2020* ప్రకారం

*_Close all Govt., ZP/MPP, Municipal, Aided, Private un-aided Schools, Residential Schools and Welfare Institutions under all managements, Teacher Educational Institutions i.e., DIETS, CTES, IASES and Pvt. D.EI.Ed. Colleges till 31st March, 2020 with immediate effect for prevention and management of COVID-19._*

అలాగే కొంతమందికి పాఠశాలల్లో పిల్లలకు మాత్రమే సెలవ లా లేక ఉపాధ్యాయులకు సెలవు లా అనే అనుమానం ఉంది పిల్లలతో పాటు ఉపాధ్యాయులందరికీ సెలవులు.

స్కూలు మూసివేయాలని ఉత్తర్వులు ఇస్తూ పదవతరగతి పరీక్షలు యధావిధిగా జరుగుతాయని కూడా ఉత్తర్వులలో పొందుపరచడమైనది .

కరోనా సెలవులు- ఉపాధ్యాయుల సందేహాలు..*

చైల్డ్ కేర్ లీవ్, మెడికల్ లీవ్ లో ఉన్నవారి సెలవుల పరిస్థితి ఏమిటి?*

సమాధానం:- 

*ఆకస్మికేతర సెలవులో ఉన్నవారు 18.03.2020 వరకు మాత్రమే సదరు సెలవుగా పరిగణిస్తారు. రీ ఓపెనింగ్ తేదీ ఏప్రిల్ 1 న విధుల్లో చేరితే, 19 నుండి 31 వరకు ప్రభుత్వ సెలవులను సఫిక్స్ చేస్తారు.*   

*2.మార్చి 17,18 తేదీల్లో సిఎల్ పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏమిటి?*

సమాధానం:-

*ప్రత్యేక సందర్భం కనుక 18 వరకే సిఎల్ గా పరిగణిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ సెలవుల వినియోగం. 1వ తేదీ విధుల్లో చేరితే సరిపోతుంది.*

* పాఠశాల విద్య సమాచారం:*

★ కోవిద్-19 వైరస్ ను నిలువరించుటకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం  ఆదేశాల ప్రకారం తక్షణమే విద్య సంస్థలు మూసివేత గురుంచి.

★ పాఠశాల విద్య యొక్క అన్ని ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు మరియు జిల్లా విద్యాశాఖాధికారులు మరియు DIETS CTES యొక్క ప్రిన్సిపాల్స్, రాష్ట్రంలోని IASES అన్ని *ప్రభుత్వాలు, ZP / MPP, మునిసిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలలు* , నివాస పాఠశాలలు మరియు సంక్షేమ సంస్థలు, ఉపాధ్యాయ విద్యాసంస్థలు, అంటే, DIETS, CTES, IASES మరియు Pvt.  D.EI.Ed.మొదలగు విద్య సంస్థలు అన్నియు *మార్చి 19 నుంచి 31, 2020 వరకు   మూసివేయవలెను అని అదేశించడమైనది.*

★ గమనిక అన్ని బోర్డు మరియు ప్రవేశ పరీక్షలు ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించబడతాయి. 

★ బోర్డు మరియు ప్రవేశ పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఉన్న అన్ని సంక్షేమ హాస్టళ్ళు మరియు నివాస పాఠశాలలు పనిచేస్తూనే ఉంటాయి. 

 అయితే, ఇతర విద్యార్థుల కోసం పనిచేయుచున్న అన్ని హాస్టళ్లను వెంటనే  మూసివేయవలెను.

Rc.,92; 18/3/2020* HOLIDAYS FROM 19TH TO 31ST MARCH PROCEEDINGS

error: Content is protected !!