ap-government-implemented-twinning-programme-schools-2020

ap-government-implemented-twinning-programme-schools-2020

విజ్ఞానం పంచుకునే ‘ట్విన్నింగ్‌’

పాఠశాలల మధ్య టీచర్లు, విద్యార్థుల మార్పిడి

వారం పాటు ఇతర స్కూళ్లలో గడిపే అవకాశం

ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు

పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకునేలా కేంద్రం తలపెట్టిన ‘ట్విన్నింగ్‌’ కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ఏపీ సమగ్ర శిక్ష నిర్ణయించింది.

పార్ట్‌నర్‌షిప్, టీచర్‌ ఎక్స్చేంజ్‌ ప్రోగ్రాం కింద ఎంపిక చేసిన 50 పాఠశాలల్లో దీన్ని అమలు చేయనున్నారు. 

► ట్విన్నింగ్‌ ద్వారా గ్రామీణ, గిరిజన ప్రాంతాల పాఠశాలలను పట్టణ, సెమీ అర్బన్‌ పాఠశాలలతో పరస్పరం అనుసంధానిస్తారు.

ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య విజ్ఞానాన్ని  పంచుకోవడం అనుసంధానం లక్ష్యం.  

► విద్యార్థులు ఇతర పాఠశాలల్లో వారం రోజులు గడపడం ద్వారా అక్కడ అనుసరిస్తున్న విధానాలను పరిశీలించేందుకు అవకాశం కల్పిస్తారు.  

► సెకండరీ, సీనియర్‌ సెకండరీ విద్యార్థులు, టీచర్లకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు.

ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని సమగ్ర శిక్షా ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్లను ఆదేశించారు. కార్యక్రమం అమలు తేదీ తర్వాత ప్రకటిస్తారు.  

► ఇతర పాఠశాలలను సందర్శించడం ద్వారా విద్యార్థులకు బోధనా ప్రక్రియ, నాణ్యత, సమస్యలు, స్పెషల్‌ ఇన్నోవేటివ్‌ ప్రాజెక్టులు, సైన్స్‌ ఫెయిర్‌ లాంటివి పరిశీలించే అవకాశం కలుగుతుంది.  

► కళలు, చేతివృత్తులు, సాంస్కృతిక, సాహిత్య, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు (ఎన్‌సీసీ, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌) లైఫ్‌ స్కిల్స్‌ లాంటివి పెంపొందించుకునే అవకాశం కలుగుతుంది. 

► పాఠశాల నిర్వహణలో సమాచార వ్యవస్థ, కమిటీల పాత్ర, పనితీరు గురించి తెలుస్తుంది.  

TEACHERS TRANSFER GREEN SIGNAL DETAILS

ACADEMIC YEAR 2020-21 STARTING PROCESS ADMISSIONS DETAILS

నిర్వహించాల్సిన అంశాలు . . . 

క్రీడలు , ఆర్ట్ , క్రాఫ్ట్ , జానపద సంగీతం , జీవన నైపుణ్యాలు , స్థానిక జీవనశైలి , వృత్తులు ( వ్యవ సాయం , పరిశ్రమలు , చేతివృ త్తులు ) , దర్శనీయ ప్రదేశాలు , పండుగల పరిశీలన .

ఆశిస్తున్న ప్రయోజనాలు . . . . 

జ్ఞానం , నైపుణ్యాలను పెంచుకో వటం , గొప్ప ఆలోచనలు , నూతన విధానాలు , సమున్నత అవకాశాలను కల్పించి విద్యార్థులను స్పూర్తిదాయ కంగా తీర్చిదిద్దడం వంటివి పర స్పరం రెండు పాఠశాలల్లోనూ జరు గుతాయి . విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే విధంగా విలువలు , నాణ్యత , నైపుణ్యాలు , సామర్థ్యాలు పెంపొందించటమే లక్ష్యంగా కృత్యాలు రూపొందిస్తారు . విలు వలు , సంస్కృతి , సంప్రదాయాలపై గౌరవం , క్రమశిక్షణ , జీవన నైపుణ్యా లపై అవగాహన కల్పిస్తారు .

విద్యార్థుల ఎంపికకు . . . 

విద్యార్థుల్లో ఉత్సాహం , ఆరోగ్యం , సంస్కారం , తెలివిగల వారిని ప్రోత్సహించాలి . వేరే పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బంది లేనివారిని తల్లిదండ్రుల్ని సంప్ర దించిన తరువాత ఎంపిక చేయాలి . ప్రతిభా పాటవాలతో పాటు నిర్దేశించిన విషయాలపై అవగాహన ఉన్న వారిని గుర్తించాలి . ఆర్థికంగా , సామా జికంగా , బడుగు , బలహీన , పేద విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలి . క్రీడలు , సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభావంతు లను ప్రోత్సహించాలి . 

పాఠశాలల ఎంపికకు ప్రామాణికాలు ఇవే

గ్రామీణ , నగర ప్రాంతాల్లో మౌలిక వసతులు , తాగునీరు , మరుగుదొడ్లు , ఆధునిక వస తులు ( కంప్యూటర్ , డిజిటల్ తరగతి ) , బోధనోపకరణాలు , ఆట స్థలం , క్రీడా పరికరాలు , పచ్చదనం , శుభ్రత ఉన్న పాఠ శాలల్ని ఎంపిక చేయాలి . విజ యాలు , నూతన విధానాలు , బోధనలో నవ్యత , నాణ్యత , క్రీడలకు ప్రాముఖ్యత వంటి అంశాలను ప్రామాణికంగా తీసు కుంటారు . పాఠశాలల్లో బహు ముఖ పరిజ్ఞానం , నైపుణ్యం గల సిబ్బందిని ప్రోత్సహిం చాలి . అక్కడికి విద్యార్థులు వెళ్లేందుకు ప్రయాణ సౌకర్యం , ఉండేందుకు వసతి సౌకర్యాలు ఉండాలి .

భాగస్వామ్య పాఠశాలలో . . . 

జిల్లా , మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలి . జిల్లా ఎస్ఎస్ఏకు ఎస్పీడీ విడుదల చేసిన నిధులను కలె క్టర్ అనుమతితో మండలాలకు విడుదల చేస్తారు .

ఏఎంవోకు పర్యవేక్షక బాధ్య తను అప్పగించారు . మండల స్థాయిలో ఎమ్యీవో , భాగస్వామ్య పాఠశాలల ప్రధా నోపాధ్యాయులు కార్యక్రమ నిర్వహ ణలో భాగస్వాములుగా ఉంటారు .

పరస్పరం జ్ఞానాభివృద్ధే లక్ష్యం 

పాఠశాలల ఉపాధ్యాయులు , విద్యార్ధులు పరస్పర కలయికతో ఈ కార్యక్రమాన్ని చేప ట్టాలి . సమాచారాన్ని , శాస్త్ర సాంకేతికను పంచుకోవటం , సహాయ సహకారాలతో ప్రాజెక్టులు నిర్వహించాలి . తోటి వారితో భాగస్వాములై పరస్పరం సహకరించుకుని జ్ఞాన సముపార్జన చేసుకోవాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం .

error: Content is protected !!