# ap-government-implemented-twinning-programme-schools-2020

- Link: https://amaravathiteacher.com/ap-government-implemented-twinning-programme-schools-2020/
- Published: 2020-09-16T08:57:37+05:30
- Author: amaravathiteacher

## **ap-government-implemented-twinning-programme-schools-2020**

### **విజ్ఞానం పంచుకునే ‘ట్విన్నింగ్‌’**

### **పాఠశాలల మధ్య టీచర్లు, విద్యార్థుల మార్పిడి**

### **వారం పాటు ఇతర స్కూళ్లలో గడిపే అవకాశం**

### **ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు**

### **పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకునేలా కేంద్రం తలపెట్టిన ‘ట్విన్నింగ్‌’ కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ఏపీ సమగ్ర శిక్ష నిర్ణయించింది. **

### **పార్ట్‌నర్‌షిప్, టీచర్‌ ఎక్స్చేంజ్‌ ప్రోగ్రాం కింద ఎంపిక చేసిన 50 పాఠశాలల్లో దీన్ని అమలు చేయనున్నారు. **

### **► ట్విన్నింగ్‌ ద్వారా గ్రామీణ, గిరిజన ప్రాంతాల పాఠశాలలను పట్టణ, సెమీ అర్బన్‌ పాఠశాలలతో పరస్పరం అనుసంధానిస్తారు. **

### **ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య విజ్ఞానాన్ని  పంచుకోవడం అనుసంధానం లక్ష్యం.  **

### **► విద్యార్థులు ఇతర పాఠశాలల్లో వారం రోజులు గడపడం ద్వారా అక్కడ అనుసరిస్తున్న విధానాలను పరిశీలించేందుకు అవకాశం కల్పిస్తారు.  **

### **► సెకండరీ, సీనియర్‌ సెకండరీ విద్యార్థులు, టీచర్లకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. **

### **ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని సమగ్ర శిక్షా ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్లను ఆదేశించారు. కార్యక్రమం అమలు తేదీ తర్వాత ప్రకటిస్తారు.  **

### **► ఇతర పాఠశాలలను సందర్శించడం ద్వారా విద్యార్థులకు బోధనా ప్రక్రియ, నాణ్యత, సమస్యలు, స్పెషల్‌ ఇన్నోవేటివ్‌ ప్రాజెక్టులు, సైన్స్‌ ఫెయిర్‌ లాంటివి పరిశీలించే అవకాశం కలుగుతుంది.  **

### **► కళలు, చేతివృత్తులు, సాంస్కృతిక, సాహిత్య, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు (ఎన్‌సీసీ, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌) లైఫ్‌ స్కిల్స్‌ లాంటివి పెంపొందించుకునే అవకాశం కలుగుతుంది. **

### **► పాఠశాల నిర్వహణలో సమాచార వ్యవస్థ, కమిటీల పాత్ర, పనితీరు గురించి తెలుస్తుంది.  **

### **󠀁[TEACHERS TRANSFER GREEN SIGNAL DETAILS ](https://amaravathiteacher.com/teachers-transfers-government-green-signal-complete-details/)󠁿**

### **󠀁[ACADEMIC YEAR 2020-21 STARTING PROCESS ADMISSIONS DETAILS](https://amaravathiteacher.com/academic-year-2020-21-starting-process-to-take-admissions-all-classes-further-instructions/)󠁿**

### **నిర్వహించాల్సిన అంశాలు . . . **

### **క్రీడలు , ఆర్ట్ , క్రాఫ్ట్ , జానపద సంగీతం , జీవన నైపుణ్యాలు , స్థానిక జీవనశైలి , వృత్తులు ( వ్యవ సాయం , పరిశ్రమలు , చేతివృ త్తులు ) , దర్శనీయ ప్రదేశాలు , పండుగల పరిశీలన .**

### **ఆశిస్తున్న ప్రయోజనాలు . . . . **

### **జ్ఞానం , నైపుణ్యాలను పెంచుకో వటం , గొప్ప ఆలోచనలు , నూతన విధానాలు , సమున్నత అవకాశాలను కల్పించి విద్యార్థులను స్పూర్తిదాయ కంగా తీర్చిదిద్దడం వంటివి పర స్పరం రెండు పాఠశాలల్లోనూ జరు గుతాయి . విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే విధంగా విలువలు , నాణ్యత , నైపుణ్యాలు , సామర్థ్యాలు పెంపొందించటమే లక్ష్యంగా కృత్యాలు రూపొందిస్తారు . విలు వలు , సంస్కృతి , సంప్రదాయాలపై గౌరవం , క్రమశిక్షణ , జీవన నైపుణ్యా లపై అవగాహన కల్పిస్తారు .**

### **విద్యార్థుల ఎంపికకు . . . **

### **విద్యార్థుల్లో ఉత్సాహం , ఆరోగ్యం , సంస్కారం , తెలివిగల వారిని ప్రోత్సహించాలి . వేరే పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బంది లేనివారిని తల్లిదండ్రుల్ని సంప్ర దించిన తరువాత ఎంపిక చేయాలి . ప్రతిభా పాటవాలతో పాటు నిర్దేశించిన విషయాలపై అవగాహన ఉన్న వారిని గుర్తించాలి . ఆర్థికంగా , సామా జికంగా , బడుగు , బలహీన , పేద విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలి . క్రీడలు , సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభావంతు లను ప్రోత్సహించాలి . **

### **పాఠశాలల ఎంపికకు ప్రామాణికాలు ఇవే**

### **గ్రామీణ , నగర ప్రాంతాల్లో మౌలిక వసతులు , తాగునీరు , మరుగుదొడ్లు , ఆధునిక వస తులు ( కంప్యూటర్ , డిజిటల్ తరగతి ) , బోధనోపకరణాలు , ఆట స్థలం , క్రీడా పరికరాలు , పచ్చదనం , శుభ్రత ఉన్న పాఠ శాలల్ని ఎంపిక చేయాలి . విజ యాలు , నూతన విధానాలు , బోధనలో నవ్యత , నాణ్యత , క్రీడలకు ప్రాముఖ్యత వంటి అంశాలను ప్రామాణికంగా తీసు కుంటారు . పాఠశాలల్లో బహు ముఖ పరిజ్ఞానం , నైపుణ్యం గల సిబ్బందిని ప్రోత్సహిం చాలి . అక్కడికి విద్యార్థులు వెళ్లేందుకు ప్రయాణ సౌకర్యం , ఉండేందుకు వసతి సౌకర్యాలు ఉండాలి .**

### **భాగస్వామ్య పాఠశాలలో . . . **

### **జిల్లా , మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలి . జిల్లా ఎస్ఎస్ఏకు ఎస్పీడీ విడుదల చేసిన నిధులను కలె క్టర్ అనుమతితో మండలాలకు విడుదల చేస్తారు . **

### **ఏఎంవోకు పర్యవేక్షక బాధ్య తను అప్పగించారు . మండల స్థాయిలో ఎమ్యీవో , భాగస్వామ్య పాఠశాలల ప్రధా నోపాధ్యాయులు కార్యక్రమ నిర్వహ ణలో భాగస్వాములుగా ఉంటారు .**

### **పరస్పరం జ్ఞానాభివృద్ధే లక్ష్యం **

### **పాఠశాలల ఉపాధ్యాయులు , విద్యార్ధులు పరస్పర కలయికతో ఈ కార్యక్రమాన్ని చేప ట్టాలి . సమాచారాన్ని , శాస్త్ర సాంకేతికను పంచుకోవటం , సహాయ సహకారాలతో ప్రాజెక్టులు నిర్వహించాలి . తోటి వారితో భాగస్వాములై పరస్పరం సహకరించుకుని జ్ఞాన సముపార్జన చేసుకోవాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం .**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
