# ap-government-police-providing-emergency-traveling-e-pass-online

- Link: https://amaravathiteacher.com/ap-government-police-providing-emergency-traveling-e-pass-online/
- Published: 2020-05-14T18:27:07+05:30
- Author: amaravathiteacher

## **ap-government-police-providing-emergency-traveling-e-pass-online**

## **how-to-get-in-case-of-emergency-police-pass-online**

### **MAY 23RD, 2020,**

### **ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక పాస్‌లు అక్కర్లేదు**

### **ఏపీ ప్రజలకు పోలీసులు గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లాలంటే పాస్‌లు అవసరం లేదు. అంతర్ జిల్లాల్లో పాస్‌లు లేకుండా తిరగొచ్చంటోంది. శుక్రవారం నుంచి అనుమతి ఇచ్చినట్లు పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలిపారు. **

### **ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రజలు పోలీసులు తాము పొరుగు జిల్లాలకు వెళ్లాలని పెద్ద ఎత్తున అనుమతి కోసం ట్వీట్‌లు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు.. పొరుగు జిల్లాలకు వెళ్లాలంటే పాస్‌లు అవసరం లేదని తేల్చి చెప్పారు.**

### **పాస్‌లు లేకపోయినా కండిషన్స్ అప్లై అంటున్నారు పోలీసులు. **

### **కారుల్లో ముగ్గురికి మించకుండా ప్రయాణించవచ్చన్నారు. అలాగే… మాస్కులు ధరించడం, సోషల్ డిస్టాన్స్ పాటించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా అమలవుతున్నాయని తెలిపారు. ప్రజలు ఇష్టం వచ్చినట్లు తిరగడానికి వీల్లేదని.. ఏదైనా అత్యవసరమైన పనులు ఉంటేనే వెళ్లాలని సూచిస్తున్నారు. **

### **ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. **

### **ఇక రెడ్, ఆరెంజ్ జోన్స్‌.. కంటైన్మెంట్ ప్రాంతాల్లో మాత్రం నిబంధనలు కొనసాగుతాయంటున్నారు. అంతేకాదు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.. తర్వాత ఎవరైనా బయటకు వస్తే చర్యలు తప్పవు.**

### **పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలన్నా.. ఏపీకి రావాలన్నా అనుమతి తప్పనిసరి. ముఖ్యమైన పనులు నిమిత్తం బయటకు వెళ్ళేవారికి మాత్రమే పాస్‌లు జారీ చేయనున్నారు. ఈ మేరకు పోలీస్ శాఖ పలు సూచనలు చేసింది. అత్యవసర వైద్య చికిత్స, కుటుంబంలో మరణం, సామాజిక పనులు, ప్రభుత్వ విధి నిర్వహణ తదితర అత్యవసర పనులపై ప్రయాణించాలనుకునే వారికి ఈ-పాస్‌లు జారీ చేయనున్నట్టు పోలీస్ శాఖ తెలిపింది.**

### **స్పెషల్ పాస్‌లు జారీ, దరఖాస్తు వివరాలిలా**

### **లాక్ డౌన్ సమయంలో మీకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడి బయటకు వెళ్లాల్సి వస్తే భయపడాల్సిన పని లేదు. **

### **వివిధ అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణాలు చేయాల్సి వచ్చే వారి కోసం ఏపీ ప్రభుత్వం  ఎమర్జెన్సీ ట్రావెల్ పాస్ లను ప్రవేశ పెట్టింది. **

### **అత్యవసర ఈ -పాస్ కోసం ప్రత్యేక పోర్టల్,**

### **అత్యవసర వైద్యం, కుటుంబంలో మరణం, సామజిక పనులు, ప్రభుత్య విధినిర్వహణ పనులపై ప్రయాణించే వారో కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ ని ప్రవేశపెట్టినట్లు ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు. **

### **కోవిడ్ -19 అత్యవసర ఈ -పాస్ కోసం పోలీస్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలి.ఈ పాస్ లు ఆమోదిస్తే అత్యవసర ఇ -పాస్ ను మొబైల్ ల, మెయిల్ ఐడి కి పంపుతారు.**

### **అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు పోలీసుల నుండి వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా పాస్ పొందవచ్చు. ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకునే వారు పూర్తి పేరు, చిరునామా, ఆధార్ నెంబర్, వాహన నెంబర్, ప్రయాణం ప్రారంభించే ప్రదేశం మరియు గమ్యస్థానం, ఈ-మెయిల్ ఐడీ వంటి సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.**

### **కాగా, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారికి, ప్రభుత్వ నిబంధనలు (ఉదయం 6 నుంచి ఉదయం 11 వరకు) అనుసరించి నిత్యావసరాలు కొనేందుకు వెళ్లిన ప్రజలకు, సరుకు రవాణా వాహనాలు నడిపేవారికి, పంటను తరలించే రైతులకు ఈ-పాస్‌లు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. **

### ** EMERGENCY VEHICLE PASS(AP POLICE)**

### **https:citizen.appolice.gov.in**

### **AP POLICE MAIN WEBSITE**

### **https:citizen.appolice.gov.in**

### **పాస్ కావాల్సిన వాళ్లు ఈ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి**

### **1) పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో**

### **2) ప్రయాణించేవారి వివరాలు**

### **3) ప్రయాణించే వారి ఐడీ ప్రూఫ్స్**

### **4) మెయిల్ ఐడీ**

### **5) అవసరమైన సంబంధిత డాక్యుమెంట్లు**

### **6) మొబైల్ నంబర్**

### **7) వాహనానికి సంబంధించిన వివరాలు**

### **ఈ ప్రొసెస్‌లో వెరిఫికేషన్ సమయంలో మొబైల్ నంబర్‌కు ఓ ఓటీపీ వస్తుంది. అప్లికేషన్ పెట్టె ముందు పైన ఇచ్చిన అన్ని రెడి చేసుకుని ప్రాసెస్ ప్రారంభించాలని పోలీస్‌శాఖ సూచించింది. **

### **దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత ఓ రిసిప్ట్ వస్తుంది.. అన్ని డాక్యుమెంట్లు పక్కాగా ఉండి.. కారణాలు నిజమైతే ఆ తర్వాత మీకు ఈసారి రూటు పాస్ లభిస్తుంది.**

### **నిత్యావసర సరుకుల తయారీ పరిశ్రమలు, వాటి సరఫరా దారులకు ఈ పాస్‌ విధానం మరింత సౌలభ్యం కల్పించనుంది.**

### **అత్యవసర ప్రయాణాలకు పాసులు జారీ చేయనున్న ప్రభుత్వం\***

### **󠀁[ONLINE REGISTRATION FORM FOR E-PASS(SPANDANA)](https://www.spandana.ap.gov.in/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
