ap-government-providing-emergency-traveling-e-pass-online

ap-government-providing-emergency-traveling-e-pass-online

how-to-get-in-case-of-emergency-police-pass-online

ap-government-providing-travel-pass-for-emergency

లాక్ డౌన్ సమయంలో మీకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడి బయటకు వెళ్లాల్సి వస్తే భయపడాల్సిన పని లేదు.

వివిధ అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణాలు చేయాల్సి వచ్చే వారి కోసం ఏపీ ప్రభుత్వం ఇటీవల ఎమర్జెన్సీ ట్రావెల్ పాస్ లను ప్రవేశ పెట్టింది.

దీని కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రజలకు కొన్ని వాట్సప్ నెంబర్ లను కూడా అందుబాటులో ఉంచింది. హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న ప్రజలు ఎవరైనా ఈ వాట్సాప్ నెంబర్ ను సంప్రదించి ఆన్ లైన్ లో ఈ-పాస్ ను పొందవచ్చు. 

అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు పోలీసుల నుండి వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా పాస్ పొందవచ్చు. ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకునే వారు పూర్తి పేరు, చిరునామా, ఆధార్ నెంబర్, వాహన నెంబర్, ప్రయాణం ప్రారంభించే ప్రదేశం మరియు గమ్యస్థానం, ఈ-మెయిల్ ఐడీ వంటి సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.

కాగా, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారికి, ప్రభుత్వ నిబంధనలు (ఉదయం 6 నుంచి ఉదయం 11 వరకు) అనుసరించి నిత్యావసరాలు కొనేందుకు వెళ్లిన ప్రజలకు, సరుకు రవాణా వాహనాలు నడిపేవారికి, పంటను తరలించే రైతులకు ఈ-పాస్‌లు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్‌క్రిప్టెడ్‌ క్యూఆర్‌ కోడ్‌ రూపంలో ఉండే ఈ-పాస్‌లను తనిఖీ చేసేందుకు చెక్‌పోస్టుల వద్ద ఉండే పోలీసుల వద్ద తగిన మెకానిజం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. పాస్‌లలో ఫోర్జరీ, దుర్వినియోగానికి పాల్పడితే 2005-ఎన్‌ఎండీఏ చట్టం, భారత శిక్షాసృతి ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించింది. నిత్యావసర సరుకుల తయారీ పరిశ్రమలు, వాటి సరఫరా దారులకు ఈ పాస్‌ విధానం మరింత సౌలభ్యం కల్పించనుంది.

అత్యవసర ప్రయాణాలకు పాసులు జారీ చేయనున్న ప్రభుత్వం*

*పాసులు పొందడానికి దరఖాస్తు సమర్పించాల్సిన జిల్లా అధికారుల ఫోన్ నెంబర్లు*

E MAIL IDs & WHATS APP NUMBERS IN ALL 13 DISTRICTS OFFICERS

ONLINE REGISTRATION FORM FOR E-PASS

 తన నెంబర్ కాకుండా వేరే నెంబర్ నుండి దరఖాస్తు సమర్పించినట్లయితే అది తిరస్కరించబడుతుంది.

దీనికి సంబంధించి డీజీపీ కార్యాలయం ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ… దరఖాస్తుదారుడు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డును ప్రయాణ సమయంలో తనతో పాటు ఉంచుకోవాలని, ఏవైనా వివరాలను తప్పుగా ఇస్తే జరిమానా విధించడమే కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో అత్యవసర ఇ-పాస్ పొందడానికి ప్రతి జిల్లాకు కేటాయించిన వాట్సాప్ నెంబర్ల జాబితా:

శ్రీకాకుళం – 6309990933,

విజయనగరం – 9989207326,

విశాఖపట్నం రూరల్ – 9440904229,

విశాఖపట్నం అర్బన్ – 9493336633,

కాకినాడ (తూర్పు గోదావరి) – 9494933233, రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి) – 9490760794,

పశ్చిమ గోదావరి – 8332959175,

ప్రకాశం 9121102109,

నెల్లూరు – 9440796383,

చిత్తూరు – 9440900005,

తిరుపతి సిటీ – 9491074537,

మచిలీపట్నం (కృష్ణా) – 9182990135,

విజయవాడ సిటీ – 7328909090,

గుంటూరు రూరల్ – 9440796184,

కడప – 9121100531,

కర్నూలు – 7777877722,

గుంటూరు అర్బన్ – 8688831568,

అనంతపురం – 9989819191

దేశంలో ఇతర రాష్ట్రాల మాదిరిగానే అత్యసవసర పరిస్థితుల్లో ఉండే ప్రజలు ప్రయాణాలు చేసేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రావెల్ ఇ-పాస్ ల జారీను అమలు పరుస్తుంది. ఈ మేరకు ప్రజలు పైన ఇచ్చిన నెంబర్లను సంప్రదించడం ద్వారా లేదా ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేసి ట్రావెల్ పాస్ ను అప్లై చేసుకోవచ్చు.

E-Pass Book Application Form

Covid-19 Emergency Pass (Andhra Pradesh) ONLINE REGISTRATION FOR

error: Content is protected !!