AP-Grama-sachivalayam-result-2019-to-be-release-soon-details

AP-Grama-sachivalayam-result-2019-to-be-release-soon-details

సచివాలయ’ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయి.. ఎప్పుడంటే?

AP Grama sachivalayam Recruitment 2019 | గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 21,69,814 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 19,74,588 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.

హైలైట్స్

  • మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడి.

  • ఫలితాల కోసం ఎదురుచూస్తున్న 19.74 లక్షల మంది అభ్యర్థులు

ఏపీలో గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టుల భర్తీకి సెప్టెంబరు 1 నుంచి 8 వరకు ఆరు రోజులపాటు నిర్వహించిన పరీక్షల ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

సెప్టెంబరు 19 లేదా 20 తేదీల్లో ఫలితాలను వెల్లడించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే OMR పత్రాల స్కానింగ్ పూర్తికాగా.. మంగళవారం (సెప్టెంబరు 17) తుది పరిశీలన చేయనున్నారు.

అభ్యర్థుల OMR ఆన్సర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియను నాగార్జున యూనివర్సిటీలో పూర్తిచేశారు.

ఇందుకోసం ప్రభుత్వం 350 మంది ఉద్యోగులు పనిచేశారు.

ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో స్కానింగ్ ప్రక్రియను పూర్తిచేశారు. 19 లక్షలకుపైగా OMR ఆన్సర్ షీట్లను స్కానింగ్ చేశారు.

తుది పరిశీలన అనంతరం సెప్టెంబరు 20న ఫలితాలను వెల్లడించనున్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 1 నుంచి 8 వరకు రాతపరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

మొత్తం 1,26,728 ఉద్యోగాలకు గానూ 21,69,814 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 19.74 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల ఫలితాలను సెప్టెంబరు చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఫిర్యాదుల స్వీకరణకు 1902 కాల్‌సెంటర్‌ నెంబరును ఏర్పాటు చేయనున్నారు.

అభ్యర్థులకు ఏమైనా ఫిర్యాదులుంటే నేరుగా ఈ నెంబరుకు ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు.

సచివాలయ’ పరీక్షల అర్హత మార్కులు తగ్గింపు.. ఎప్పుడంటే?

Andhra Pradesh Grama Sachivalayam Recruitment 2019.

గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలో EWS రిజర్వేషన్లు వర్తించవని అధికారులు స్పష్టం చేశారు.

మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలకు భర్తీ చేయనున్నారు

హైలైట్స్

  • తక్కువ మంది అభ్యర్థులు ఎంపికైతే..

  • అర్హత మార్కులు తగ్గించే యోచనలో ప్రభుత్వం

error: Content is protected !!