AP Grama Sachivalayam 2020 | గ్రామసచివాలయ ఫలితాలను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు రాసిన అభ్యర్థులకు శుభవార్త.
పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.
2020 సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు 14 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
మొత్తం 16,208 పోస్టులకు ఈ పరీక్షల్ని నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సుమారు 10 లక్షలకు పైగా అభ్యర్థులు ఈ పరీక్షల్ని రాశారని అంచనా.
వారంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు ఫలితాలు విడుదలయ్యాయి. http://gramasachivalayam.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.
అభ్యర్థులు ముందుగా http://gramasachivalayam.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో EXAMINATION RESULTS పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అభ్యర్థుల అడ్మిట్ కార్డ్, ఇతర వివరాలు ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. ఫలితాల కాపీని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.
ఫలితాలను ప్రకటించడంతో ఎంపికైన వారికి సమాచారం అందిస్తుంది ప్రభుత్వం.
జిల్లా కలెక్టర్ మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఎంపికలో రిజర్వేషన్ రూల్స్ పాటిస్తారు. ఏ రోజున రిపోర్ట్ చేయాలో వెల్లడిస్తారు.
ఎంపికైన వారు అదే రోజున రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల్లో మొదటి విడత లక్షకు పైగా పోస్టుల్ని భర్తీ చేశారు.
అప్పుడు ఉద్యోగాల్లో చేరినవారు మానెయ్యడం, ఉద్యోగాల్లో చేరకపోవడం లాంటి కారణాల వల్ల 16,208 ఖాళీలు ఏర్పడ్డాయి.
ప్రస్తుతం 16,208 పోస్టుల్ని భర్తీ చేస్తుండగా అందులో గ్రామ సచివాలయాల్లో 14,062 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 2,166 పోస్టులున్నాయి.
ఓపెన్, బీసీ కేటగిరీలో అత్యధికంగా 111 మార్కులు రాగా.. ఎస్సీలో 99.75, ఎస్టీ కేటగిరీలో అత్యధికంగా 82.75 మార్కులు వచ్చాయి.*
ప్రస్తుతం 18వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. మెరిట్ లిస్ట్ నుంచి కేటగిరీ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు.*
కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ ఓ భారీ ఉద్యోగ నియామక ప్రక్రియలో కీలక దశను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది.
సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల ప్రాథమిక ‘కీ’ని అధికారులు విడుదల చేశారు.
మొత్తం 14 రకాల రాతపరీక్షలకు సంబంధించిన కీ వివరాలను గ్రామ సచివాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
ప్రతి ఒక్క పరీక్షకు నాలుగు రకాల టెస్ట్ బుక్‌లెట్ సిరీస్ కోడ్ వారీగా కీలను విడుదల చేశారు.
వీటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. అభ్యర్ధులు ఈనెల 29వ తేదీ వరకు వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అభ్యంతరాలను నిపుణులు పరిశీలించి, తుది కీ ని సాధ్యమైనంత త్వరగా విడుదల చేస్తామని తెలిపారు. ప్రశ్నపత్రం, కీ సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్‌లో చూడవచ్చు.
► మొత్తం 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఈ నెల 20వ తేదీ మొదలైన రాతపరీక్షలు శనివారం సాయంత్రం ముగిశాయి. ఈ పరీక్షలకు 72.73 మంది అభ్యర్ధులు హాజరైనట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
► రాత పరీక్షల కోసం 10,57,355 మంది అభ్యర్థులకు హాల్ టిక్కెట్లు జారీ చేయగా.. వీరిలో 9,51,016 మంది వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నారు. అందులో 7,69,034 మంది పరీక్షలు రాశారు.
ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీని సెప్టెంబర్ 26న విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-APPSC. అయితే సాంకేతిక కారణాల వల్ల సెప్టెంబర్ 26న విడుదల చేసిన కీని వెనక్కి తీసుకుంటున్నామని, మరోసారి కీని విడుదల చేస్తామని, అభ్యర్థులు తమ అభ్యంతరాలు తెలిపేందుకు మూడు రోజులు గడువు ఇస్తామని ఏపీపీఎస్‌సీ తెలిపింది.
ఇదిలా ఉండగా, సచివాలయ ఉద్యోగాల కోసం ఇన్ సర్వీస్ అభ్యర్ధులుగా దరఖాస్తు చేసుకున్న వారు వెయిటేజ్ మార్కులు పొందాలంటే గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల వెబ్‌సైట్ నుంచి ధ్రువపత్రాన్ని తీసుకుని, వారి వారి శాఖాధిపతులతో దానిపై ధ్రువీకరణ చేయించుకొని.. ఆ పత్రాలను తిరిగి వెబ్‌సైట్‌లో ఈ నెల 30వ తేదీలోగా అప్ లోడ్ చేయాలని అధికారులు సూచించారు.
అభ్యర్థులు కీ చెక్ చేసి ప్రశ్నలకు తాము సరైన సమాధానాలు రాశామో లేదో చెక్ చేసుకోవచ్చు. అంతే కాదు… అసలు పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నల్లోనే ఏవైనా తప్పులు ఉన్నట్టైతే పరీక్ష నిర్వహించిన ఏజెన్సీ దృష్టికి తీసుకురావొచ్చు.
తమ అభ్యంతరాలు నిజమేనని నిరూపించే ఆధారాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఆన్సర్ కీ పైన అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన పూర్తైన తర్వాత తుది కీ విడుదలవుతుంది. ఒకవేళ ప్రశ్నలే తప్పైతే ఆ ప్రశ్నల్ని తొలగించడమో లేదా వాటికి గ్రేస్ మార్క్స్ ఇవ్వడమో సాధారణంగా జరిగే ప్రక్రియ.
NOTE : LAST DATE FOR OBJECTIONS ON INITIAL KEYS 03-10-2020*