*మార్చి చివరిలో ఇంటర్ పరీక్షలు
*అకడమిక్ క్యాలెండరు విడుదల*
ఇంటర్మీడియట్ చివరి పరీక్షలను 2021 మార్చి చివరి వారంలో నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది.
2020-21 విద్యాసంవత్సరం క్యాలెండరును బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ సోమవారం అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్ కు పంపించారు. ఈ విద్యా సంవత్సరం పనిదినాలు 173 రోజులుగా నిర్ణయించారు. వీటిల్లో సెలవులు 36 రోజులు పోగా, 138 రోజులు తరగతులు ఉంటాయి.
నవంబరు 2 నుంచి 2021 జనవరి 10 వరకు మొదటి దశగా, జనవరి 11 నుంచి ఏప్రిల్ 23 వరకు రెండో దశగా విభజించారు. ప్రాక్టీకల్ పరీక్షలు మార్చి మొదటి వారంలో, పబ్లిక్ పరీక్షలు మార్చి చివరి వారంలో ఉంటాయి.
2021 ఏప్రిల్ 24 చివరి వర్కింగ్ డే అని ప్రకటించారు. ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు వేసవి సెలవులుగా నిర్ణయించారు. 2021 జూన్ 1 నుంచి కళాశాలలు పునప్రారంభమవుతాయి.