AP-Intermediate-1st-2nd-year-Results-2020-march
ఇంటర్ పరీక్ష ఫలితాలు నేడే*
సాయంత్రం 4 గంటలకు విడుదల*
ఫస్టియర్‌కు సబ్జెక్టు వారీగా మార్కులు*
సెకండియర్‌కు గ్రేడ్ పాయింట్లు*
ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి.
విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తారు.
*గ్రేడింగ్ విధానం రద్దు*
కొద్ది సంవత్సరాలుగా గ్రేడింగ్ విధానంలో ఫలితాలు విడుదల చేస్తున్న ఇంటర్ బోర్డు ఆ విధానాన్ని రద్దు చేసింది.
ఈ సారి సబ్జెక్టుల వారీ మార్కులతోనే ఫస్టియర్ ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఇక సెకండియర్ రెగ్యులర్ అభ్యర్థుల ఫలితాలను మాత్రం సబ్జెక్టుల వారీ గ్రేడ్ పాయింట్లతో ఇస్తారు. వారి ఫస్టియర్ ఫలితాలను గత ఏడాది గ్రేడ్ పాయింట్లతో ఇచ్చినందున ఇప్పుడు కూడా గ్రేడ్ పాయింట్‌లు ఇస్తున్నారు.
షార్ట్ మార్కుల మెమోలను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో ఈ నెల 15 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు సెక్రెటరీ వి.రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా క్లౌడ్ సర్వీస్ ద్వారా ముందస్తుగా రిజిస్టర్ చేసుకున్న వెబ్‌సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉండేలా ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది.
ఇంటర్ ఫలితాలు – వెబ్ సైట్లు