# ap-mid-day-meal-mdm-decentralized-approach-dec-2019

- Link: https://amaravathiteacher.com/ap-mid-day-meal-mdm-decentralized-approach-dec-2019/
- Published: 2019-12-26T14:59:08+05:30
- Author: amaravathiteacher

## **ap-mid-day-meal-mdm-decentralized-approach-dec-2019**

### **RC.NO.SE02, dated 26/12/2019పాఠశాల విద్యాశాఖ-మధ్యాహ్న భోజన పథకం, గుడ్లు,కందిపప్పు, నూనె సంబంధిత బిల్లుల చెల్లింపు వికేంద్రీకృత విధానం డిసెంబర్-2019 నుండి అమలు పరచడం గురించి పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వారి తదుపరి ఉత్తర్వులు**

### **అందరు మండల విద్యాశాఖాధికారుల కు సూచించునది ఏమనగా, కమీషనరు పాఠశాల,  విద్యా శాఖ వారు,  పై పేర్కొనబడిన ఆదేశాల ద్వారా మద్యాహ్నభోజన పథకంలో సరఫరా చేస్తున్న కోడిగుడ్ల బిల్లుల చెల్లింపు విధానాన్ని వికేంద్రీకరణ చేయడం జరిగింది. **

### **అదే విధంగా ప్రధానోపాధ్యాయులు కోడిగుడ్డు సరఫరా మరియు వినియోగం నమోదు చేయుటకు వీలుగా MDM APP నందు మార్పులు చేయడమైనది. ఈ అంశాలను పాఠశాల స్థాయి వరకు చేరులాగా తగు చర్యలు తీసుకోవలసినదగా కోరడమైనది.**

### **మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లుల కోసం కేంద్రీకృత చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగినది . ఏ . పి . సి . ఎఫ్ . ఎస్ . ఎస్ యొక్క సహకారంతో ఈ విధానములో అన్ని బిల్లులు చెల్లింపు జరుగుతున్నది\***

### **వంట ఖర్చు మరియు గౌరవవేతనానికి సంబంధించిన బిల్లుల చెల్లింపు అధికారాలను జిల్లా విద్యాశాఖ అధికారులకు బదలాయించడం జరిగినది . ఈ విధానంలో బిల్లుల చెల్లింపు విజయవంతముగా జరుగుతున్నది\***

### ** పై విధానములను నిశితముగా పరిశీలించిన పిదప కోడి గుడ్డు బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేయడానికి , గుడ్ల సరఫరాకు సంబంధించి బిల్లుల చెల్లింపు విధానమును కూడా జిల్లా విద్యాశాఖ అధికారులకు బదలాయించుటకు నిర్ణయించడమైనది\***

### **జిల్లా విద్యాశాఖాధికారులందరికీ తెలిజేయునది ఏమనగా ఎన్ . ఐ . సి సహాయంతో ఎం . డి . ఎం పథకం కోసం ఉద్దేశించిన మొబైల్ యాప్ లో కోడి గుడ్ల సరఫరా , వినియోగం మరియు అవసరాలకు సంబంధించిన డేటా సేకరణ కోసం అవసరమైన మార్పులు చేయడం జరిగినది\***

### ** తదనుగుణముగా జిల్లా విద్యాశాఖాధికారులు / మండల విద్యాశాఖాధికారులు / ఉపవిద్యాశాఖాధికారులు / ప్రధానోపాధ్యాయులు ఈ క్రింది . చర్యలను వెంటనే అమలు పరచవలసినదిగా ఆదేశించడమైనది\***

### **\*1. ప్రధానోపాధ్యాయులు యమ్ . డి . యమ్ కోసం ఉద్దేశించిన మొబైల్ అనువర్తనాన్ని వెంటనే అప్లైట్ చేసుకోవాలి . డేటా ఎంట్రీ స్కూల్ యు – డైస్ కోడ్ మరియు ప్రధానోపాధ్యాయులు యొక్క అధీకృత మొబైల్ నంబర్ లో మాత్రమే సాధ్యమవుతుంది\***

### **\*2 . హాజరు , మధ్యాహ్న భోజనం తీసుకున్న పిల్లలు , కోడి గుడ్ల వినియోగం మొదలైన వాటికి సంబంధించిన మొత్తం డేటా మధ్యాహ్న భోజనం అయిన వెంటనే నమోదు చేయాలి . గుడ్లు అందుకున్న డేటాను సరఫరాదారుల నుండి గుడ్లు అందుకున్న సమయంలో నమోదు చేయాలి\***

### ** \*3 . ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ ( ఎపి సిఎఫ్ఎస్ఎస్ ) వారు మధ్యాహ్న భోజన పథకానికి ఉద్దేశించిన మొబైల్ అప్లికేషన్లో హెడ్ మాస్టర్స్ అందించిన డేటా ప్రకారం జిల్లా విద్యాశాఖాధికారి పేరిట బిల్లును తయారు చేస్తారు . అలా తయారు చేసిన బిల్లు ప్రతి నెల 5 వ తేదీలోగా డి . ఇ . ఓకు పంపబడుతుంది\***

### **మనం ప్రతిరోజు MDM తీసుకున్న పిల్లల వివరాలను నమోదు చేసి వారికి ఎంత ఖర్చయింది నెల చివరి రిపోర్టు ఇవ్వవలసి ఉంటుంది. **

### **దీనికిగాను మీరు కింద ఇచ్చిన సాఫ్ట్వేర్లో మీ పాఠశాల వివరాలు ,మీ పిల్లలు అటెండెన్స్ వివరాలను ఇచ్చినట్లయితే బియ్యం ,గుడ్లు కు సంబంధించిన అన్ని ప్రొఫార్మా లు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి.**

### **󠀁[MID DAY MEAL (MDM) BILL SOFTWARE-2020 LATEST BILL](https://amaravathiteacher.com/mid-day-meal-programme-2019-bill-software-latest/)󠁿**

### **󠀁[FOR MORE DETAILS RC.NO.SE02, dated 26/12/2019 ](https://drive.google.com/file/d/1b6xuVTWIC2sQIPliQ-oeF9m-_HZJNggl/view?usp=sharing)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
