AP MODEL SCHOOLS 2017-2018 ADMISSIONS

*A.P.MODEL SCHOOLS*

*ఆదర్శ ప్రవేశం…. భవిత బంగారం…. *

*దరఖాస్తుల స్వీకరణ : ఫిబ్రవరి 4 వరకు*

*ప్రవేశ పరీక్ష : మార్చి 5*

*ఆదర్శ (మోడల్‌ స్కూల్‌) పాఠశాలల్లో ఆరోతరగతి ప్రవేశాలకు ప్రభుత్వ ప్రకటన వెలువడింది.*
 గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన పేద పిల్లలకు ఆంగ్లమాధ్యమంలో విద్య అందించేందుకు ఈ పాఠశాలల్లో ప్రవేశం పిల్లల భవితకు చక్కని అవకాశంగా తల్లిదండ్రులు భావిస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో రూ.వేలకు వేలు ఫీజులు చెల్లించలేని పేద కుటుంబాల పిల్లలకు ఉచితంగా ఆంగ్లమాధ్యమ విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం 2013లో ఆదర్శ పాఠశాలలను నెలకొల్పింది. జిల్లాలో 33 పాఠశాలలున్నాయి. ఒక్కో పాఠశాలల్లో 80 మందికి ప్రవేశం కల్పిస్తారు.

 *పరీక్ష రాసేందుకు అర్హతలు *

    ప్రభుత్వ పాఠశాలల్లో 4,5 తరగతులు చదివిన వారు.. 
*వయసు :*
ఓసీ, బీసీలు 01.09.2005 నుంచి 31.08.2007 మధ్య…
 ఎస్సీ, ఎస్టీలు 01.09.2003 నుంచి 31.08.2007 మధ్య జన్మించి ఉండాలి…
2015-16, 2016-17 విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4,5 తరగతులు విధిగా చదివి ఉండాలి

*దరఖాస్తు చేసుకోవాలి ఇలా.. *

దరఖాస్తులను ఏపీ.ఆన్‌లైన్‌ లేదా మీ సేవా కేంద్రాల్లోనే వెబ్‌సెట్‌ www.cse.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. 

6TH CLASS ENTRANCE TEST ONLINE APPLICATION

*ఫీజు :*
ఓసీ, బీసీలు రూ.100.
 ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 
ఏపి.ఆన్‌లైన్‌,మీ సేవా కేంద్రాల్లో చెల్లించాలి. దరఖాస్తును పూరించి ఆధార్‌, కులం, ఆదాయం ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుతో పాటు ఆయా మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఇవ్వాలి. ఫిబ్రవరి 4 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 *రిజర్వేషన్లు *

15 శాతం ఎస్సీలకు, 
6 శాతం ఎస్టీలకు, 
29 శాతం బీసీలకు కేటాయిస్తారు.
 బీసీలకు కేటాయించిన సీట్లలో
బీసీ-ఏ 7, 
బీసీ-బికి 10, 
సీ-కి 1, 
డీ- 7, 
ఈ- 4 శాతం సీట్లు కేటాయించారు. 
వికలాంగులకు 3 శాతం, బాలికలకు 33.33 శాతం సీట్లను కేటాయించారు.
నిర్దేశించిన విభాగాల్లో అభ్యర్థులు లేక పోతే ఇతర గ్రూపుల నుంచి భర్తీ చేస్తారు. మిగిలిన 50 శాతం సీట్లను ఇతర కులాలకు నిర్ధేశించారు.

 *రాత పరీక్ష *

మార్చి 5న ప్రవేశ పరీక్ష ఆయా మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో తెలుగు,ఆంగ్ల మాధ్యమాల్లో రాత పరీక్షలు ఉంటాయి. 5 తరగతి సామర్థ్యాల స్థాయికి అనుగుణంగా తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం, ఆంగ్ల విషయాలపై 25 మార్కుల చొప్పున ఐచ్చిక తరహాలో ప్రశ్నలు ఉంటాయి. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఓసీ,బీసీలకు కనీస అర్హత మార్కులు 50, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 35 మార్కులు తప్పక సాధించాలి.

*ALL THE BEST MY DEAR STUDENTS*

error: Content is protected !!