ap-open-school-ssc-inter-admissions-2018-2019-aposs

ap-open-school-ssc-inter-admissions-2018-2019-aposs

ఏ వయస్సు వారైనా చదువుకొనేందుకే ఓపెన్ స్కూల్.

14 ఇయర్స్ నిండిన వారు 10వ తరగతి లో ప్రవేశంనకు, 15 ఇయర్స్ నిండిన వారు ఇంటర్మీడియట్ లో ప్రవేశం నకు అర్హులు.

దరఖాస్తు తో పాటు date of birth సర్టిఫికేట్ లేదా స్కూల్ రికార్డు షీటు, టి.సీ zerox ఇవ్వాలి.

ఇంటర్మీడియట్ దరఖాస్తు దారులు గుర్తింపు పొందిన SSC సర్టిఫికెట్, తాజాగా జారీ చేసిన నివాస,కుల దృవీకరణ పత్రాలు ఇవ్వాలి.

 ఈ సర్టిఫికేట్ ను ఉన్నత చదువుల కి, వృత్తి విద్యా కోర్సులకి use చేసుకోవచ్చు.

 ఇంటర్ సైన్సు గ్రూప్ లో చేరేవారు జూనియర్ కళాశాల స్టడీ సెంటర్లలో మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు.

 ఈ కోర్సులు తెలుగు,ఇంగ్లీషు, ఉర్దూ మాధ్యమాల్లో అందుబాటులో ఉంటాయి.

*పరీక్షల ఫీజు వివరాలు*

10వ తరగతి కి ప్రతి సబ్జెక్టు కి 100రూ, practicles కి 50రూ, టి.ఓ.సి ఫీజు 100రూ చెల్లించాలి.

ఇంటర్మీడియట్ లో ప్రతి సబ్జెక్టు కి పరీక్ష ఫీజు 150రూ,practicle ఫీజు 100రూ,టీ. ఓ.సీ ఫీజు 150రూ, మైగ్రేషన్ సర్టిఫికేట్ ఫీజు 100రూ చెల్లించాలి.

గతంలో SSC, INTER నుండి పాస్ ఐన 2 సబ్జెక్టు మార్కుల ను 10, ఇంటర్ ఓపెన్ స్కూల్ సర్టిఫికేట్ కి బదలాయించుకొనే అవకాశం ఉంది.

ఓపెన్ స్కూల్లో రిజిస్ట్రేషన్ చేసుకొన్న నాటి నుండి 5 ఏళ్ళు బాటు ప్రవేశం చెల్లుబాటు అవుతుంది.

 ఒక సబ్జెక్టు కి 1000రూ చెల్లించి SSC మరియు 600రూ చెల్లించి ఇంటర్ జవాబు పత్రాల రీకౌంటింగ్,వెరిఫికేషన్ చేఇ0చుకోవచ్చు.

*అడ్మిషన్ ఫీజు వివరాలు*

పురుషులు 10కి 1500రూ లు, ఇంటర్ కి 1700రూ చెల్లించాలి.

 స్త్రీలు, SC, ST, BC,మైనారిటీ, PH, మాజీ సైనికుల పిల్లలు 10కి 1100రూ లు, ఇంటర్ కి 1400రూ లు చెల్లించాలి.

*దరఖాస్తు చేసే విధానం*

జిల్లాలో 90 ఓపెన్ స్కూల్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో దరఖాస్తు ఫ్రీ గా ఇస్తారు.

 సంబంధిత వివరాలు మీ-సేవా కేంద్రాలు ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

 ఫోటో, సంతకం స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి.

 వీటినన్నింటిని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ లో ఇవ్వాలి.

 అనంతరం స్టడీ సెంటర్ వారు అడ్మిషన్ నంబర్,గుర్తింపు కార్డు ఇస్తారు.

 స్టడీ మెటీరియల్ ను కూడా ఫ్రీ గా ఇస్తారు.




 

AP OPEN SCHOOL NOTIFICATION & PROSPECTUS CLICK HERE

AP OPEN SCHOOL ONLINE REGISTRATION FORM CLICK HERE

MAIN WEBSITE CLICK HERE

error: Content is protected !!