AP PARENTS COMMITTEE -PC ELECTIONS 2021 FREQUENTLY ASKED QUESTIONS

తరుచు స్మరించే ప్రశ్నలు – పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్.ఎమ్.సి)

1 ప్ర) పాఠశాల యాజమాన్య కమిటీ అంటే ఏమిటి ?

జ) విద్యా హక్కు చట్టం 2009 లోని సెక్షన్ – 21(1) అమలులో భాగంగా పాఠశాల నిర్వహణ, యాజమాన్యలను చూసుకోడానికి పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీని పాఠశాల యాజమాన్య కమిటీ అంటాం.

2. ఎస్.ఎమ్.సి బాధ్యత ఏమిటి ?

జ) పాఠశాల సక్రమంగా నడిచేలా అజమాషీ చేయడం, కావలసిన సదుపాయాలను కల్పిస్తూ పాఠశాలను అభివృద్ధి చేయడం దీని ప్రధాన భాద్యత.

3 ప్ర) ఎస్.ఎమ్.సి ప్రధాన పాత్రదారులు ఎవరు ?

జ) ఎస్.ఎమ్.సి కమిటిలో ప్రధాన పాత్రదారులు విద్యార్థుల తల్లిదండ్రులు

4 ప్ర) ఎస్.ఎమ్.సిని ఏఏ పాఠశాలల్లో ఏర్పాటు చేయాలి ?

జ) ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ సహాయంతో నడిచే పాఠశాలలు (ఎయిడెడ్ పాఠశాలలు) తప్పనిసరిగా పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేయాలి.

5ప్ర) ఒక పాఠశాలలో ఎన్ని కమిటీలను ఏర్పాటు చేయాలి ?

జ) ప్రాధమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలకు ఒకే కమిటీని ఏర్పాటు చేయాలి ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత తరగతులకు విడిగా ఎస్.ఎమ్.సిని ఏర్పాటు చేసుకోవాలి దీనినే ప్రాథమికోన్నత పాఠశాల యాజమాన్య కమిటీ అంటారు.

6ప్ర) ఒక తరగతిలో వేరు వేరు మీడియములు ఉంటే వేరు వేరు తరగతులగా భావించవచ్చా?

జ) ఒక తరగతిలో ఎన్ని మీడియములు, సెక్షన్లు ఉన్నా అన్నింటిని ఒకే తరగతిగా భావించాలి.

7 ఎస్.ఎమ్.సి పదవికాలము ఎంత ?

జ) ఒకసారి ఏర్పాటు అయిన పాఠశాల యాజమన్యా కమిటీ వ్యవస్థ నిరంతంగా కొనసాగుతుంది (ఎమ్.ఇ.ఓ మరియు డి.ఇ.ఓ చే రద్దు లేక విలీనము చేయడబడినప్పుడు తప్పు) కమిటీ సభ్యుల పదవీకాలం MAX 2YEARS

85) ఎస్.ఎమ్.సి సభ్యులను ఏ విధంగా ఎన్నుకోవాలి?

జ) ఒక్కో తరగతి నుండి ఎన్నిక కావలసిన సభ్యులు మొత్తం ముగ్గురు (అన్ని సెక్షన్లు మరియు మాద్యమాలలో చదువుతున్న పిల్లలు తల్లిదండ్రులు) ముగ్గురులో సామాజికంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాల వారి నుండి కనీసం ఒకరు (ఎస్.సి, ఎస్.టి, ఆనాధులు, వీధిబాలలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, హెచ్.ఐ.వి బాధిత పిల్లలు మొ|| వారు తల్లిదండ్రులు/సంరక్షకులు) బలహీన వర్గాలకు చెందిన వారి నుండి ఒకరు (బి.సి మైనార్జి మరియు ఆదాయం 60 వేలకు మించిన ఓ.సి కుటుంబాలు పేరంట్స్/గార్డెయన్)

జనరల్ కేటగిరి నుండి ఒకరు ఈ ముగ్గురు సభ్యులలో ఇద్దరు తప్పని సరి మహిళలు ఉండాలి.

9ప్ర) ప్రాధమిక మరియు ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో సభ్యులు ఎంతమంది ఉంటారు.

జ ) ప్రాధమిక పాఠశాల (1 – 5వ తరగతి) – 15 (10 మంది మహిళలు తప్పనిసరిగా ఉండాలి)

ప్రాథమికోన్నత పాఠశాల (1- 7వ తరగతి) – 21 (14 మంది మహిళు సరిగా ఉండాలి)

ప్రాధమికోన్నత పాఠశాల (1-8వ తరగతి) –  24 (16 మంది మహిళలు తప్పని సరిగా ఉండాలి).

ఉన్నత పాఠశాల (6 -8వ తరగతి) – 9(6 మంది మహిళలు తప్పని సరిగా ఉండాలి)

10 ప్ర) ఎస్.ఎమ్.సి సభ్యుల ఎన్నికలను ఎవరు నిర్వహించాలి ?

జ) పాఠశాల ప్రధానోపాధ్యాయుడు

11 ప్ర) ఎస్.ఎమ్.సి ఎన్నికలు నిర్వహించడానికి ఎంత మంది హాజరు కావాలి?

జ) కనీసం 50 శాతం మంది తల్లిదండ్రులు/సంరక్షకులు

12 ప్ర) ఎస్.ఎమ్.సి ఎన్నికలు నిర్వహించడానికి ఎటువంటి విధానాన్ని పాటించాలి ?

జ) నోటి మాటతో గాని చేతులు ఎత్తడం ద్వారా గాని రహస్య బ్యాలెట్ విధానము ద్వారా కానీ ఎన్నికలు జరిపించాలి.

13 ప్ర) తరగతిలోని కమిటీ సభ్యుల ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఎవరికి ఉంటుంది ? జ) తరగతిలోని పిల్లల తల్లిదండ్రులలో ఎవరోఒకరికి మాత్రమే కమిటీ సభ్యుల ఎన్నికల్లో ఓటువేసే అర్హత

14 ప్ర) ఒకటి కన్నా ఎక్కువ తరగతులో చదువుకునే పిల్లలున్న తల్లిదండ్రులకు ఆయా తరగతుల

ఎన్నికలలో పాల్గొనే అవకాశం ఉంటుందా ?

జ) ఉంటుంది.

15 ప్ర) సభ్యుని కుమారుడు/కుమారై పాఠశాలలను వదిలి వెళ్లినట్లైతే ఆ సభ్యుని పదవీకాలము ఏది?

జ) ముగిసిపోతుంది.

16 ప్ర) సభ్యులు ఖాళీలను పూరించడానికి ఏమి చేయాలి ?

జ) ప్రతి సంవత్సరం కమిటీలోని ఖాళీలను పూరించడానికి ప్రవేశ తరగతులలో ఎన్నికలు నిర్వహించాలి

17 ప్ర) ఎస్.ఎమ్.సి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను ఎవరు ఎన్నుకుంటారు ?

జ) తల్లిదండ్రుల/సంరక్షకుల వర్గ సభ్యులు, వారిలో నుండి అధ్యక్షులు మరియు ఉపాధ్యాక్షులను ఎన్నుకుంటారు. వీరిలో ఒకరు తప్పక ప్రతికూల వర్గాలు లేదా బలహీన వర్గాలకు చెందినవారై ఉండాలి. వీరిలో కనీసం ఒకరు మహిళ ఉండాలి.

18 ప్ర) ఎస్.ఎమ్.సి మెంబర్ కన్వీనర్ ఎవరు ?

జ. ప్రధానోపాధ్యాయులు/ఇన్ చార్జీ ప్రధానోపాధ్యాయులు

19 ప్ర) ఎస్.ఎమ్.సి లో ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఎవరిని నియమించాలి ?

జ) 1. ప్రధానోపాధ్యాయులు/ఇన్చార్జీ ప్రధానోపాధ్యాయులు

2. మండల విద్యాశాఖాధికారి చేత నామినేట్ చేయబడిన పాఠశాల ఉపాధ్యాయుడు (హెడ్ టీచర్) పురుషుడు అయితే ఉపాధ్యాయునులు నుండి ఎంపిక చేస్తారు. హెడ్ టీచర్ స్త్రీ అయితే పురుషునికి

3. సంబంధిత వార్డు మెంబర్ కౌన్సిలర్

4. అంగన్వాడీ వర్కర్/వర్కర్లు

5. మాల్టి పరజ్ హెల్త్ వర్కర్ మహిళ (ఎ.ఎన్.ఎమ్)

6. స్థానిక మహిళా సమాఖ్య అధ్యక్షురాలు

20 ప్ర ఎస్.ఎమ్.సి లో కో ఆపరేటడ్ మెంబర్గా ఎవరిని నియమించాలి ?

జ) పేరొందిన విద్యావేత్త, దాత, స్థానిక స్వచ్చంద సంస్థ ప్రతినిధి, పాఠశాల పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి సహకరించే వారికి నుండి ఇద్దరిని ఎస్.ఎమ్.సి సభ్యులు కో ఆప్ట్ చేసుకుంటారు.

21 ప్ర) గ్రామ సర్పంచ్/పురపాలక అధ్యక్షులు ఎస్.ఎమ్.సిలో నిర్వహించవలసిన పాత్ర ఏమిటి?

జ) సంబంధిత గ్రామ సర్పంచ్/పురపాలక అధ్యక్షులు వారు ప్రాంతంలో జరిగే ఎస్.ఎమ్.సి సమావేశాలకు

ఎప్పుడైనా వారి ఇష్ట ప్రకారం హాజరు కావచ్చును.

22 ) గ్రామ సర్పంచ్, ఎస్.ఎమ్.సి చైర్మన్ ఒకరేనా ?

జ) కాదు ఎస్.ఎమ్.సి సభ్యులు ఎవరిని ఎన్నుకుంటే వారే ఎస్.ఎమ్.సి చైర్మన్ 23 ప్ర) పాఠశాలలో ఎస్.ఎమ్.సి ఏర్పాటు చేయకపోతే ఏమవుతుంది ?

జ) పాఠశాలలో ఎస్.ఎమ్.సిని తప్పనిసరిగా ఏర్పాటుచేయబడాలి ఎస్.ఎమ్.సి ఏర్పాటు చేయకపోతే 25 ప్ర ఎస్.ఎమ్.సి తీర్మానం లేకుండా పాఠశాల ఆర్థిక లావాదేవీలు నిర్వహించచ్చా ?

పాఠశాలలకు విడుదల చేయబడిన గ్రాంట్లు విడుదల కావు.

24 ) పాఠశాల బ్యాంకు అకౌంట్ ఎవరెవరు నిర్వహించాలి ?. జ) ఎస్.ఎమ్.సి చైర్మన్ మరియు ప్రధానోపాధ్యాయులు (మెంబర్ కన్వీనర్)

జ) నిర్వహించకూడదు

26 ప్ర) పాఠశాలకు మంజూరు చేయబడిన అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యం

మొ॥వి ఎవరు నిర్మించాలి ?

జ) పాఠశాల మెజారిటీ ఎస్.ఎమ్.సి సభ్యులు సూచించిన తీర్మానించిన వ్యక్తి

27 ప్ర) ఎస్.ఎమ్.సి చైర్మన్ పై సర్పంచ్ అజమాయిషీ చేయు అధికారము ఉందా ?

జ) లేదు.

28 ప్ర) సర్పంచ్ ఎస్.ఎమ్. సిలో సభ్యునిగా చైర్మన్ గా ఉండవచ్చా ?

జ) సర్పంచ్ పిల్లలు పాఠశాలలో చదువుతూ ఉన్నప్పుడు మరియు తల్లిదండ్రులు అతనిని సభ్యునిగా చైర్మన్

గా ఎన్నుకొనవచ్చును.

29 ప్ర) పాఠశాల మంజూరు చేయబడిన అదనపు తరగతి గదులు నిర్మాణానికి సంబంధించిన తీర్మాణంపై ఎస్.ఎమ్.సి చైర్మన్ ఒక్కరు సంతకము పెడితే చెల్లుబాటు అవుతుందా ?

జ) చెల్లుబాటు కాదు ఎందుకంటే మెజార్జి ఎస్.ఎమ్.సి సభ్యులు సూచించిన వ్యక్తికి తీర్మాణం చేయవలసి

30 కె.జి.బి.వి పాఠశాలల్లో కూడా ఎస్.ఎమ్.సి ఏర్పాటు చేయాలా ?

జ) చేయాలి

31 ప్ర) ఎస్.ఎమ్.సి సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి ?

జ) ఎస్.ఎమ్.సి సమావేశాలు కనీసం రెండు నెలలకు ఒక సారి తప్పక నిర్వహించాలి మరియు ఏదైనా విధాన నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు నిర్వహించాలి.

32 ప్ర) ఎస్.ఎమ్.సి సమావేశాలు నిర్వహించే బాధ్యత ఎవరిది ?

జ) పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.

33) గత విద్యా సం||ము 2013-14లో ఎస్.ఎమ్.సి ఎన్నిక జరిగినది అప్పటి 8వ తరగతి విద్యార్థి తల్లి/ తండ్రి చైర్మెన్/మెంబర్గా ఎన్నిక అయినారు ప్రస్తుతం ఆ విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. కావున అ విద్యార్థి తల్లి/తండ్రి చైర్మన్/మెంబర్గా కొనసాగించవచ్చా?.

జ) పాఠశాల యాజమాన్య కమిటీ అనేది ప్రాథమిక స్థాయి విద్యకు సంబంధించినది. కావున ప్రాధమిక స్థాయి విద్య 1 నుండి 8 తరగతులకు సంబంధించినది. కావున యాజమాన్య కమిటీ సభ్యులందరు తప్పక 1 నుండి 8వ తరగతి చదువుతున్న విద్యార్ధి/విద్యార్ధిని యెక్క తల్లి, తండ్రి మరియు సంరక్షకులు మాత్రమే అయి ఉండాలి.

34). పాఠశాల యాజమాన్య కమిటీకు ఎన్నికైన సభ్యుని పదవికాలం రెండు సం॥రాలు కానీ ఎప్పుడైన ఆ సభ్యుని కుమారుడు/కుమారై పాఠశాలలను వదిలి వెళ్లినట్లయితే ఆ సభ్యుని పదవీ కాలం కూడా ముగిసిపోతుందా?

జ) పాఠశాల యాజమాన్య కమిటీకు ఎన్నికైన సభ్యుని పదవికాలం రెండు సం॥రాలు కానీ ఎప్పుడైన ఆ సభ్యుని కుమారుడు/కుమారై పాఠశాలలను వదిలి వెళ్లినట్లయితే ఆ సభ్యుని పదవీ కాలం కూడా ముగిసిపోతుంది.

35) ప్రతి సంవత్సరము విద్యార్థులు పై తరగతులకు చేరుతూ ఉంటారు అప్పుడు క్రింది తరగతులలో ఖాళీలు ఏర్పడతాయి ఆ ఖాళీలను భర్తీ చేయడానికి ఏమి చేయాలి ?

జ) ప్రతి సంవత్సరము తరగతిలోని పిల్లలు పై తరగతిలకు పోతు ఉంటారు అప్పుడు ఆ పిల్లలు యొక్క తల్లిదండ్రులు సభ్యులు స్థానాలలో ఖాళీలు ఏర్పడతాయి. అలాగే ఆయా తరగతులు లో కొత్త పిల్లలు చేరుతారు వారి తల్లిదండ్రులకు కమిటీలో స్థానం కల్పించవలసి వస్తుంది. ఇటువంటి సందర్భంలో ప్రతి సం॥ కమిటీలోని ఖాళీలను పూరించడానికి ప్రవేశతరగతులలో ఎన్నికలు జరిపించాలి. ఉదాహరణకు ప్రాధమిక మరియు ప్రాధమికోన్నత పాఠశాలలో నూతనంగా 1వ తరగతిలో ప్రవేశాలు జరుగుతాయి. ఉన్నత పాఠశాలలో 6వ తరగతిలో నూతన ప్రవేశాలు జరుగుతాయి. అ తరగతి తల్లిదండ్రులకు యాజమాన్య కమిటీలో స్థానం కల్పించవలసి వస్తుంది.

error: Content is protected !!