YSR Rythu Bharosa: ఏపీ ప్రభుత్వం వరుసగా రెండో సంవత్సరం… వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాల రెండో విడత డబ్బును ఇవాళ చెల్లించింది. దాదాపు 50 లక్షల మంది రైతులకు మేలు జరిగింది.
YSR Rythu Bharosa: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ముందుగా చెప్పినట్లుగానే ‘వైయస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ పథకం రెండో సంవత్సరం, రెండో విడత నిధులను విడుదల చేసింది.
ఒక్కో రైతు కుటుంబానికీ… రూ.2000 చొప్పున… వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది.
ఈ స్కీమ్ కింద ప్రభుత్వం సంవత్సరానికి మూడు విడుతల్లో మొత్తం రూ.13,500 చెల్లిస్తూ… ఐదేళ్లలో రూ.67,500 ఇవ్వనుంది.
ఈ డబ్బుతో రైతులు విత్తనాలు, పురుగు మందులు కొనుక్కునేందుకు వీలు కానుంది.
ఖరీఫ్ సీజన్‌లో రూ.7500 చొప్పున ఇచ్చిన ప్రభుత్వం… ఆగస్టులో రూ.2000, ఇప్పుడు మరో రూ.2000 చొప్పున ఇచ్చి… మిగతా… రూ.2000ను వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సమయంలో ఇవ్వనుంది.
ఇందుకు సంబంధించి సీఎం క్యాంప్ ఆఫీసులో… సీఎం జగన్ మోహన్ రెడ్డి… కంప్యూటర్‌లో బటన్ నొక్కారు. అంతే… క్షణాల్లో డబ్బు… రైతుల అకౌంట్లలోకి వెళ్లిపోయింది.
అరకోటి మందికిపైగా రైతులకు దాదాపు రూ.6,797 కోట్లను వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ కింద అందిస్తున్నారు.
రాష్ట్రంలో కోటి యాభై లక్షల కుటుంబాలు ఉంటే… వాటిలో ప్రతి మూడింటిలో ఒక కుటుంబానికి ఈ పథకం ద్వారా మేలు జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.
దేశ చరిత్రలో ఎక్కడా కూడా రైతుకు రూ.13500 ఇచ్చిన దాఖలాలు లేవని వివరించింది.
ఇప్పుడు మొదట విడత రైతులుకు వారి యొక్క అకౌంట్లో Ammount వేయడం జరిగింది.
అమౌంట్ పడింది లేనిది వారి యొక్క ఆధార్ నెంబర్ను క్రింద ఇచ్చిన లింక్ లో ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.
రైతుకే సొమ్ము చేరేలా: ప్రభుత్వాలు ఇచ్చే సొమ్ములను బ్యాంకులు పాత బాకీల కింద లెక్కగట్టి… రైతులకు ఇవ్వట్లేదు. ఈ పథకం విషయంలో మాత్రం అలా జరగదు.
ఈ డబ్బును రైతుల అన్ ఇన్‌కమ్‌బర్డ్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఎవరైనా రైతు అకౌంట్‌లోకి మనీ రాకపోతే… 1902 హెల్ప్‌లైన్ నెంబర్‌కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వొచ్చు. కౌలు రైతులతో పాటు, ‘అటవీ హక్కు పత్రాలు’ (ROFR) పొంది సాగు చేస్తున్న గిరిజన రైతులకు కూడా YSR రైతు భరోసా పథకం వర్తిస్తోంది.
రైతులకు అందించే ఈ పెట్టుబడి సహాయాన్ని కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అందజేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం భూ యజమాని అయిన రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చే రూ.6000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.7,500 కలిపి, మొత్తంగా ఏడాదికి రూ.13,500 ప్రతి రైతు కుటుంబానికి అందిస్తున్నారు .
ఈ సొమ్మును అర్హులైన భూ యజమాని కుటుంబాలకు ఏటా మొదటి విడతగా మే నెలలో రూ.7,500..
రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4,000.. మూడో విడతగా జనవరిలో రూ.2,000 అందజేస్తున్నారు .
రాష్ట్రంలో భూమి లేని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతు కుటుంబాలకు ఏటా రూ.13,500 చొప్పున మూడు విడతల్లో ఆర్థిక సాయం చేస్తున్నారు .