AP-Rgistration-made-easy-Process

AP-Rgistration-made-easy-Process

మీ దస్తావేజుకు మీరే లేఖరి*

*మధ్యవర్తులను ఆశ్రయించక్కర్లేదు*

*రిజిస్ట్రేషన్ల శాఖలో నూతన విధానం*

ఎలా తయారు చేసుకోవాలంటే..*

*🔸రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ వెబ్‌సైట్‌ లోకి వెళ్లాలి. అందులో పబ్లిక్‌ డేటా ఎంట్రీ ఆప్షన్‌ ఉంటుంది. దాని మీద క్లిక్‌ చేస్తే యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ అడుగుతుంది. అక్కడే కింద న్యూ యూజర్‌ అన్న చోట క్లిక్‌ చేస్తే ఒక పేజీ వస్తుంది.

అందులో మన పేరు, ఫోన్‌ నెంబరు, ఆధార్‌ నెంబర్‌, ఈమెయిల్‌ ఐడీ, చిరునామా, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ టైప్‌ చేయాలి.

సబ్‌మిట్‌ కొడితే మన ఫోన్‌ నెంబర్‌, మెయిల్‌ ఐడీకి ఓటీపీ వస్తుంది.

దానిని పేజీలో  సబ్‌మిట్‌ చేస్తే మన పేరు రిజిస్టర్‌ అవుతుంది.

హోమ్‌పేజీకి వెళ్లి పబ్లిక్‌ డేటా ఎంట్రీపై క్లిక్‌ చేసి అందులో మనం క్రియేట్‌ చేసుకున్న యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదు చేయగానే పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో కొన్ని ఆప్షన్స్‌ చూపిస్తుంది.

న్యూ డాక్యుమెంట్‌ పై క్లిక్‌ చేస్తే ఆస్తికి సంబంధించి వివరాలు నమోదు చేసే పేజీ వస్తుంది.

అందులో విక్రయదారుడు, కొనుగోలుదారుడు పేర్లు, చిరునామా, ఆధార్‌ నెంబర్లు, ఆస్తి వివరాలు, సర్వే నెంబర్లు, హద్దులు, లింక్‌ డాక్యుమెంట్లు, వివరాలు, సాక్షుల వివరాలు అడిగిన చోట మనం టైప్‌ చేయాలి. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను అందులో అప్‌లోడ్‌ చేయాలి.

మనం ఆస్తి వివరాలు కొట్టగానే ఆటోమెటిక్‌గా ఎంత స్టాంప్‌ డ్యూటీ చెల్లించాలనేది అందులో చూపిస్తుంది. ఆన్‌లైన్‌లో దానిని చెల్లించాలి.

USER MANNUAL IN TELUGU FOR NEW REGISTRATION PROCESS

దస్తావేజు ఫార్మెట్‌లో మనం  వివరాలు అన్నీ పొందుపరిస్తే, అది జనరేట్‌ అవుతుంది.

వాటిని స్టాంప్‌ పేపర్లపై ప్రింట్‌ చేయించుకొని, టైమ్‌ స్లాట్‌ బుక్‌ చేసుకొని ఆ సమయానికి వెళితే సరిపోతుందని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.

దీని కోసం సిటిజన్‌ హెల్ప్‌ డెస్క్‌ను కూడా పెట్టారు. ఏమైనా సందేహాలు ఉంటే  హెల్ప్‌ డెస్క్‌ నెంబరు 91211 06359ను సంప్రదించాలని సూచించారు.*

*🍁ఇవీ ఉపయోగాలు..*

*సులభతరమైన, కచ్చితమైన ఆన్‌లైన్‌ చెల్లింపులు*

*పారదర్శకమైన, సాంకేతికమైన మార్కెట్‌ విలువల లెక్కింపు*

*నమోదైన సమాచారాన్ని ఈసీలో పొందుపర్చడం ద్వారా ఆఫీసులో డేటా ఎంట్రీలో జరిగే పొరపాట్లను నివారించచ్చు.*

*మరింత వేగంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతుంది.*

Registration made easy in CLICK HERE

FIND YOUR PLACE MARKET VALUE RATE

OFFICIAL WEBSITE FOR REGISTRATION WEBSITE

error: Content is protected !!